breaking news
naturopathy treatment
-
ధర్నాలతో అలిసి ప్రకృతి చికిత్సకు..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకృతి చికిత్స కోసం గురువారం బెంగళూర్ వెళుతున్నారు. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్ పదిరోజుల పాటు బెంగళూర్‌లో గడుపనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ కార్యాలయంలో వారం రోజులకు పైగా ధర్నా చేపట్టిన కేజ్రీవాల్ రెండు రోజుల కిందటే ఆందోళనను విరమించిన విషయం తెలిసిందే. ఐఏఎస్ అధికారులు తిరిగి విధులకు హాజరవుతుండటంతో కేజ్రీవాల్ ధర్నా విరమించారని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. కొద్దిరోజుల కిందటే కేజ్రీవాల్ బెంగళూర్‌కు చికిత్స నిమిత్తం వెళ్లాల్సి ఉందని అయితే ఐఏఎస్‌ల సమ్మె తదనంతర పరిణామాల నేపథ్యంలో వాయిదా పడిందని చెప్పారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడి అనంతరం పాలక ఆప్‌తో బ్యూరోక్రాట్లు ఆగ్రహంతో ఉన్నారు. ఐఏఎస్‌ల సమ్మెను నివారించాలని, ఢిల్లీపై కేంద్ర పెత్తనాన్ని నిరసిస్తూ ఎల్జీ కార్యాలయంలో కేజ్రీవాల్ సహా ఆయన మంత్రివర్గ సహచరులు ధర్నా చేపట్టారు. -
మళ్లీ ప్రకృతి చికిత్స చేయించుకుంటున్న సీఎం!
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకృతి చికిత్స చేయించుకోవడానికి బెంగళూరు వస్తున్నారు. ఆయన జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్లో పదిరోజుల పాటు ప్రకృతి చికిత్స చేయించుకోనున్నారు. తీవ్రమైన దగ్గు సమస్యతో బాధపడిన కేజ్రీవాల్ గత ఏడాది మార్చి నెలలో ఇక్కడ ప్రకృతి చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ హై షుగర్ లెవల్స్ తో కూడా బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి గత డిసెంబర్ 22నే ఆయన బెంగళూరుకు వెళ్లాలనుకున్నారు. అయితే, ఢిల్లీలో తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన సరి-బేసి విధానాన్ని పర్యవేక్షించడానికి ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయిన కేజ్రీవాల్ ఈ నెల 31న బెంగళూరు నగరంలో జరిగే పార్టీ ర్యాలీలో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. -
కేజ్రివాల్‌కు కాయకల్ప చికిత్స
న్యూఢిల్లీ: అధిక రక్తపోటు, మధుమేహం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ చికిత్స కోసం బెంగుళూరులోని జిందాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచరోపతి ఆస్పత్రికి తన తల్లిదండ్రులతో సహా తరలివెళ్లారు. గజియాబాద్ ప్రాంతంలోని కౌషాంబి ఇంటి నుంచి ఆయన గురువారం ఉదయం ఎనిమిది గంటలకు బయల్దేరి వెళ్లారు. చికిత్స నిమిత్తం ఆయన పదిరోజులు అక్కడే ఉంటారు. ఈ కారణంగా అంతవరకు పాలనాపగ్గాలను ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు అప్పగించారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సలహా మేరకు ఆయన బెంగుళూరులోని జిందాల్ ప్రకృతి వైద్యశాలకు వెళ్లడం గమనార్హం. ఢిల్లీలో జరిగిన 'ఎట్‌హోం' విందు కార్యక్రమంలో కేజ్రివాల్ దగ్గుతో బాధపడుతున్న విషయాన్ని గమనించిన మోదీ ఈ సలహా ఇచ్చారు. కేజ్రివాల్ తన తల్లిదండ్రులతో జిందాల్ ఆస్పత్రిలో పది రోజులు ఉండేందుకు పాతిక నుంచి మూప్పై వేల రూపాయలు మాత్రమే ఖర్చవుతాయని ఢిల్లీ అధికారవర్గాలు తెలియజేశాయి. ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం వల్ల అంత తక్కువగా తీసుకుంటున్నారా లేక ఖర్చే అంత తక్కువవుతుందా? అన్నది వారికే తెలియాలి. జిందాల్ ప్రకృతి వైద్యశాల విశేషాలు సువిశాలమైన రమణీయమైన ప్రాంగణంలో ఈ ఆస్పత్రి ఉంటుంది. ఎటూచూసిన ఆకుపచ్చని తోటలతో కళకళలాడే ఈ నందనవనంలోకి అడుగుపెడుతూనే రోగులకు సగం జబ్బు నయమైన భావన కలుగుతుంది. అక్కడ ప్రాకృతిక, ఆయుర్వేద వైద్యాలతోపాటు రోగుల పరిస్థితినిబట్టి ఆలోపతి వైద్యం కూడా అందుబాటులో ఉంటుంది. రకారకాల వ్యయామాలు, యోగాసనాలు, నీరు, బురదతో చేసే రకరకాల థెరపీలు, మసాజ్‌లు అందుబాటులో ఉంటాయి. ఆక్రోబయాటిక్ వ్యాయామాలే కాకుండా చైనా ఆక్యుపంక్చర్ వైద్య విధానం కూడా అందుబాటులో ఉంటుంది. రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్స విధానం ఉంటుంది. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రోగులకు రకరకాల చికిత్సలు చేస్తారు. సేంద్రీయ ఎరువులతో ప్రకృతిసిద్ధంగా పండించిన కూరగాయాలనే రోగులకు అందజేస్తారు. వాటిని కూడా ఆస్ప్రత్రి ప్రాంగణంలోని పొలాల్లోనే పండిస్తారు. చికిత్స విధానం మాత్రం కఠినంగా ఉంటుందని, క్రమశిక్షణతో వైద్యులు చెప్పినట్టుగా నడుచుకోవాల్సిందేనని అక్కడ చికిత్స పొందిన వాళ్లు తెలిపారు. రెండు రౌండ్లు పరుగెత్తి నాలుగు రౌండ్లు పరుగెత్తామంటే కుదరదని, ఏక్, దో, తీన్ అంటూ మనకు తెలియకుండానే మన రౌండ్లను లెక్కపెట్టే వారుంటారని వాళ్లు స్వానుభవంతో చెబుతున్నారు.