breaking news
National best teacher
-
నేషనల్ బెస్ట్.. పవిత్ర టీచర్
పెన్‌పహాడ్ (సూర్యాపేట): జీవ శాస్త్రంలో ఆమె బోధన వినూత్నంగా ఉంటుంది. ప్రతి పాఠ్యాంశాన్ని విద్యార్థుల కళ్లకు కట్టినట్టుగా వివరిస్తారు. వారితో ప్రయోగాలు చేయిస్తారు. ఇందుకోసం సాంకేతికతను విని యోగిస్తారు. విద్యార్థులు తాను చెప్పే విషయంలో లీనమయ్యేలా చేస్తారు. సూర్యా పేట జిల్లా పెన్‌పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయురాలు మారం పవిత్ర అనుసరిస్తున్న బోధన పద్ధతులు, విద్యార్థులను తీర్చిదిద్దుతున్న తీరు ఆమెకు జాతీయ స్థాయి గుర్తింపును తీసుకువచ్చాయి. జాతీయ స్థాయిలో ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం మారం పవిత్రను ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులను ఈ అవార్డు కోసం ఎంపిక చేయగా, తెలంగాణ నుంచి మారం పవిత్రను ఈ అవార్డు వరించింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెపె్టంబర్ 5న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు స్వీకరిస్తారు. మారం పవిత్రకు జాతీయ ఉపాధ్యాయ అవార్డు–2025 లభించడంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికొలస్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది దరఖాస్తురాష్ట్ర వ్యాప్తంగా 150 మంది ఉపాధ్యా యులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకోగా, రాష్ట్ర జ్యూరీ కమిటీ 15 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. ఢిల్లీ స్థాయిలో పలు అంశాలపై ఇంటర్వ్యూ చేసిన తర్వాత.. అందులో టాప్ ఆరుగురిని నలుగురు సభ్యులతో కూడిన నేషనల్ జ్యూరీ ఆగస్టు 13న ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి గూగుల్ మీట్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది. అనంతరం ఒక్కొక్క ఉపాధ్యాయుడికి 10 నిమిషాల చొప్పున సమయం ఇచ్చి వారు చేసిన ప్రయోగాల ప్రదర్శనకు అవకాశం ఇచ్చారు. ఆ టాప్ 6 ఉపాధ్యాయుల్లో ఒకరిని (మారం పవిత్ర) అవార్డుకు ఎంపిక చేశారు. భర్త ప్రోత్సాహంతో.. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన మారం పవిత్ర పదో తరగతి వరకు వేములపల్లి, తడకమళ్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివారు. ఇంటర్, డిగ్రీ మిర్యాలగూడలోని ప్రైవేట్ కళాశాలలో చదివారు. కాగా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరికి చెందిన టీచర్ నాతాల మన్మథరెడ్డితో ఆమెకు వివాహమైంది. భర్త ప్రోత్సాహంతో బీఈడీ, డీఈడీ పూర్తి చేసి 2008 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. 2009లో మొదటగా ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెం యూపీఎస్‌లో జీవశాస్త్ర ఉపాధ్యాయురా లిగా విధులు చేపట్టారు. 2012 నుంచి 2015 వరకు గోరెంట్ల జెడ్పీహెచ్‌లో, ఆ తర్వాత గడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్లో ప్రస్తు తం పెన్‌పహాడ్‌లో పనిచేస్తున్నారు.విద్యార్థులను సైంటిస్టుల్ని చేయడమే లక్ష్యం –మారం పవిత్రనా ఉద్యోగ జీవితంలో కనీసం ఒకరిద్దరు విద్యార్థులనైనా శాస్త్రవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. విద్యార్థులు సిద్ధాంతపరంగా నేర్చుకున్న విషయాలు ప్రయోగపూర్వకంగా నిర్ధారణ చేసుకునే అవకాశం, పరిస్థితులను ఉపాధ్యాయులు కలి్పంచాలి. సైన్స్ అభ్యసనంలో ప్రయోగాత్మకతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తే విద్యార్థులకు నేర్చుకోవడం సులువు అవుతుంది.ఎన్నో వినూత్న బోధనలు.. జాతీయ స్థాయిలో సీఐఈటీ, ఎన్‌ఐసీఆర్‌టీ యూట్యూబ్ చానల్ ద్వారా 2020–21లో ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఐసీటీ టూల్స్‌పై పవిత్ర అవగాహన తరగతులు అందించారు. 2019లో విద్యా విధానంపై జాతీయ స్థాయి సెమినార్లో ‘సైన్స్ టీచింగ్ త్రూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్’అనే అంశంపై ప్రసంగించారు. 2017 నుంచి ఇప్పటివరకు స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎస్ఐఈటీ) ద్వారా జీవశాస్త్రంలో 14 డిజిటల్ పాఠాలను బోధించారు. తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో 6, 7 తరగతులు, సామాన్య శాస్త్రం 8, 9, 10 తరగతుల జీవశాస్త్రం పాఠ్యపుస్తకాలలో ఉన్న క్యూ ఆర్ కోడ్లలో కంటెంట్ తయారీకి ఎస్సీఈఆర్టీ దీక్ష ఆధ్వర్యంలో 60 వీడియోలు, 16 క్వశ్చన్ సెట్లను తయారు చేశారు. వాటిని ఎస్సీఆర్టీ క్యూ ఆర్ కోడ్‌లో పబ్లిష్ చేశారు. ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు వర్క్షీట్ల తయారీ, పదోతరగతి విద్యార్థులకు పరీక్షలపై ఒత్తిడి తగ్గించడానికి ఎస్సీఈఆర్టీ రూపొందించిన జీవశాస్త్ర అభ్యసన దీపికల్లో పాల్గొన్నారు. జీవశాస్త్ర శిక్షణ, అభ్యసనఫలితాలకు సంబంధించి 2016–19, 2020–21 సంవత్సరాల్లో రాష్ట్రస్థాయి సెమినార్లలో పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో యూట్యూబ్ చానల్ ద్వారా 50 వీడియోలు రూపొందించి వాట్సాప్ ద్వారా విద్యార్థులకు అందించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ యూట్యూబ్ చానల్ ద్వారా పదో తరగతి విద్యార్థుల కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ, హోమ్‌సైన్స్ పాఠాలు బోధించారు. అందుకున్న అవార్డులు ఇవే... 2019లో అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ టీచర్ అవార్డు. ఠి 2021లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు. ఠి టెక్ మహీంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించిన సైన్స్ ఉపాధ్యాయ పోటీల్లో ట్రాన్స్‌ఫారి్మంగ్ అవార్డు. ఠి 2023లో నేషనల్ సైన్స్ డే సందర్భంగా సారాబాయి టీచర్ సైంటిస్ట్ నేషనల్ అవార్డును జమ్మూకాశీ్మర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రవిశంకర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఠి 2023–24లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు పొందారు. ఠి ప్రస్తుతం (2025) జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. -
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా శ్రీదేవి
భీమునిపట్నం: విశాఖ జిల్లా భీమిలిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని తిరుమల శ్రీదేవి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. 24 సంవత్సరాలుగా బోధన వృత్తిలో ఉన్న ఆమె నాలుగేళ్లుగా ఇక్కడ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ‘కం టు లెర్న్ అండ్ గో టు సర్విస్ నేషన్’ అనే విధానంతో ఆమె విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. ఆధునిక బోధన విధానంలో డిజిటల్ బోర్డు వినియోగంతోపాటు ఆయా పాఠ్యాంశాలను ప్రాక్టికల్‌గా వివరిస్తూ, వాటిపై పూర్తిస్థాయి అవగాహన కలి్పస్తున్నారు.విద్యార్థులతో పలు అంశాలపై ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయిస్తారు. దీనివల్ల పాఠ్యాంశాలు బాగా అర్థమై విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. 2015లో 8వ తరగతి విద్యార్థులు వర్షం నీటితో భూగర్భ జలాలను ఎలా పెంచాలనే అంశంపై రూపొందించిన ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో ఐదో స్థానం లభించింది. అలాగే గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్‌లో ప్రత్యేక గుర్తింపు లభించింది. వినూత్న పద్ధతుల్లో బోధన, దాని ఫలితాలు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపిక చేసింది. ఇప్పుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. అవార్డును సెప్టెంబర్ 5వ తేదీ ఢిల్లీలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. విద్యార్థులకు మేలు మారుతున్న విద్యావిధానాలు, సాంకేతిక పద్ధతులకు అనుగుణంగా విద్యార్థులకు బోధించడం ద్వారా వారిలో మంచి ఆలోచన విధానం ఏర్పడటంతోపాటు ప్రతిభ కూడా తెలుస్తుంది. దీనివల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం కాకుండా భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు. – తిరుమల శ్రీదేవి, ప్రధానోపాధ్యాయిని, భీమిలి -
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఏడుగురు ఎంపిక
సాక్షి, హైదరాబాద్: 2016 సంవత్సరానికి గాను రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఉపాధ్యా యులు జాతీయ ఉత్తమ ఉపా ధ్యాయులుగా ఎంపికయ్యారు. శనివారం ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి రాష్ట్ర పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమాచారం అందింది. ప్రాథమిక పాఠశాల నుంచి నలుగురు, ఉన్నత పాఠశాల నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. టీచర్ పాఠశాల జిల్లా వీ కిషన్ ఎంపీపీఎస్ పాత యల్లాపూర్ నిర్మల్ కుక్కముడి జనార్దన్ పీఎస్ శివన్నగూడ నల్లగొండ మంతటి నారాయణ యూపీఎల్ పల్కపల్లి నాగర్‌కర్నూల్ నానుగొండ విజయలక్ష్మి ఎంపీపీఎస్ కులాస్పూర్ నిజామాబాద్ గుండేటి యోగేశ్వర్ జెడ్పీహెచ్ఎస్, మంచిర్యాల మంచిర్యాల కందుకూరి సురేందర్ జెడ్పీహెచ్ఎస్, జగిత్యాల జగిత్యాల పొట్ట రామారావు జెడ్పీహెచ్ఎస్, ఏన్కూర్ ఖమ్మం