breaking news
Narendra panniru
-
మోదీ గెలుస్తే పెట్రోల్, డీజిల్ ధరలు..400 +..!?
-
'తెగువ' ఒమన్ అధ్యక్షులుగా నరేంద్ర పన్నీరు
సాక్షి, హైదరాబాద్ : గల్ఫ్ వలసకార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమం కోసం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ (తెగువ) ఒమన్ (మస్కట్) శాఖఅధ్యక్షులుగా నరేంద్ర పన్నీరును నియమిస్తూ సంస్థ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నియామకపత్రం ఇచ్చారు. జగిత్యాలకు చెందిన నరేంద్ర పన్నీరు ఒమన్ దేశంలోని మస్కట్‌లో ఒక టెలికం కేబుల్ కంపెనీ యజమానిగా ఉన్నారు. ప్రముఖ ప్రవాస భారతీయుడైన నరేంద్ర పన్నీరు తెలంగాణ వలసకార్మికుల సమస్యల పరిష్కారానికి ఒమన్‌లో కృషిచేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'గల్ఫ్' సినిమా కు ఓవర్సీస్ అంబాసిడర్ గా వ్యవహరించారు. తెలంగాణ నుంచి దాదాపుగా 10 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారిసంక్షేమాన్నీ ప్రభుత్వం గాలికివదిలేసిందన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు 650మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ లో చనిపోతే ఒక్కకుటుంభానికి కూడా ప్రభుత్వం సహాయం చెయ్యకపోవడం బాధాకరమయిన విషయమన్నారు. 2014 ఎలక్షన్ మేనిఫెస్టోలో గల్ఫ్ సమస్యలని పరిష్కరిస్తామని వారికోసం పాలసీ రూపొందిస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటి వరకు ఏమి చెయ్యకపోవడం అత్యంత దారుణం అని అన్నారు.