breaking news
nagarjuna university vc
-
మంత్రి గంటా తీవ్ర అసంతృప్తి
సాక్షి, అమరావతి: ఆచార్య నాగార్జున వర్సిటీ ఇన్చార్జి వీసీగా శ్రీకాకుళం అంబేడ్కర్ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కె.రామ్‌జీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇంతకు ముందు ఈ వర్సిటీ ఇన్చార్జి వీసీగా ఇక్కడే వీసీగా కాలపరిమితి ముగించుకున్న ప్రొఫెసర్ ఏ.రాజేంద్రప్రసాద్‌ను నియమిస్తూ ఈ నెల 11న ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీ యూనివర్సిటీ చట్టానికి విరుద్ధంగా ఈ నియామకం జరిగిందంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇన్చార్జి వీసీగా వర్సిటీ రెక్టార్‌ను నియమించాలని ఆ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రతిపాదనలను పక్కన పెట్టిమరీ.. ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులు రాజేంద్రప్రసాద్‌ను నియమించడంతో చివరకు అది వివాదంగా మారింది. మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తపరచడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. చివరకు రాజేంద్రప్రసాద్ నియామకాన్ని తాత్కాలికంగా నిలుపుచేసిన ఉన్నత విద్యాశాఖ.. చివరకు ఆయన నియామక ఉత్తర్వులు రద్దుచేసి కొత్తగా రామ్‌జీని నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. సీఎంవో తీరుపై మంత్రి అసంతృప్తి ఇన్చార్జి వీసీగా రెక్టార్‌ను నియమించాలని అంతకు ముందు ఆ శాఖ మంత్రి గంటా లిఖిత పూర్వకంగా చేసిన ప్రతిపాదనను సీఎంవో అధికారులు పక్కన పెట్టడంపై మంత్రి అసంతృప్తికి లోనయ్యారు. ఇన్చార్జి వీసీ నియామకం వంటి చిన్న చిన్న అంశాల్లో మంత్రులే నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీ. అయితే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు రెక్టార్‌కు బదులు రాజేంద్రప్రసాద్‌ను నియమించి.. మంత్రి నిరసనతో మళ్లీ మార్పు చేసి.. ప్రస్తుతం రామ్‌జీని నియమించారు. ఇన్చార్జి వీసీని నియమించే అధికారం కూడా తనకు లేకపోవడంపై మంత్రి మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. హడావుడిగా పలు ఫైళ్లపై సంతకాలు మరోపక్క ఇన్చార్జి వీసీగా కొనసాగేలా ఈ నెల11న ఉత్తర్వులందుకున్న రాజేంద్రప్రసాద్.. ఆ ఉత్తర్వులు పెండింగ్‌లో పడడంతో రాత్రికి రాత్రే హడావుడిగా పలు ఫైళ్లపై సంతకాలు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో నిబంధనలకు విరుద్ధమైన నియామకాలతో పాటు.. పలు ఇతర నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారన్న ఆరోపణలొస్తున్నాయి. ఈ నియామకాలపై విచారణ జరిపి రాజేంద్రప్రసాద్‌పై చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మానవ వనరులశాఖ మంత్రికి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదులు పంపినట్టు వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ఏఎన్‌యూ ఇన్చార్జ్ వీసీగా ఆచార్య రామ్‌జీ ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీగా శ్రీకాకుళం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య కూన రామ్‌జీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దమయంతి జీవో నంబర్ ఆర్టీ 14ను ఆదివారం విడుదల చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు రామ్‌జీ ఏఎన్‌యూకి ఇన్చార్జ్ వీసీగా కొనసాగుతారు. ఈ ఉత్తర్వుల్లో రాజేంద్రప్రసాద్‌ను 2016లో రెగ్యులర్ వీసీగా నియమించిన జీవోను, ఇన్చార్జ్ వీసీగా నియమించిన జీవోను రిఫరెన్స్‌గా పేర్కొన్నారు. ఇలా రెండు జీవోలను రిఫరెన్స్‌గా చూపడం వెనుక ఆంతర్యమేమింటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇదిలా ఉండగా రామ్‌జీ 17న విధుల్లో చేరనున్నారు. -
బాబూరావును ఎందుకు అరెస్ట్ చేయలేదు?
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ జి.బాబూరావును ఎందుకు అరెస్టు చేయటం లేదని రిషితేశ్వరి తల్లిదండ్రులు మొండి మురళీకృష్ణ, దుర్గాబాయి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిషితేశ్వరి మృతి ఘటనపై దర్యాప్తును వేగవంతం చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు. శనివారం యూనివర్సిటీలో రిషితేశ్వరి తల్లిదండ్రులు ఇన్చార్జి వీసీ బి.ఉదయలక్ష్మిని కలిశారు. అనంతరం వారు 'సాక్షి'తో మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కమిటీ చేసిన సూచనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ బాబూరావు నిర్లక్ష్యం ఉందని, ఆయన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయాలని. .. బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదికలో పేర్కొందని మీడియాలో కథనాలు వచ్చాయని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదిక అనంతరం బాబూరావును విధుల నుంచి తొలగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు తాము అందజేయలేమని పేర్కొన్నారు. రిషితేశ్వరి రాసుకున్న రెండో డైరీని, ఈ కేసులో నిందితులైన విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్ బాబూరావు కలిసి ఉన్న ఫొటోలను ఈ సందర్భంగా ఉదయలక్ష్మికి అందజేసినట్లు రిషితేశ్వరి తల్లిదండ్రులు వివరించారు. అనంతరం గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి శనివారం మధ్యాహ్నం ఉదయలక్ష్మిని కలిసి, రిషితేశ్వరి మృతి కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, చేపడుతున్న చర్యలను వివరించినట్లు సమాచారం. -
ప్రిన్సిపాల్ బాబూరావుపై ఎట్టకేలకు ఫిర్యాదు
రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుని మూడు వారాలు గడిచిపోయినా.. రాష్ట్రమంతా దీనిపై తీవ్రస్థాయిలో ఆందోళన చెలరేగినా స్పందించని నాగార్జున యూనివర్సిటీ వీసీ.. వైఎస్ఆర్సీపీ కమిటీ పర్యటనతో ఎట్టకేలకు కదిలారు. ఆత్మహత్యకు ప్రత్యక్షంగా కారకుడని ఆరోపణలు వస్తున్న ప్రిన్సిపాల్ బాబూరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాంటీ ర్యాగింగ్ చట్టం కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దాదాపు గంటన్నరకు పైగా వీసీ సాంబశివరావు,రిజిస్ర్టార్ రాజశేఖరలతో నిజనిర్ధారణ కమిటీ సమావేశమైంది. అంతకుముందు వైఎస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు యూనివర్సిటీ హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. హాస్టల్‌ను తనిఖీచేసి విద్యార్థులతో పాటు వార్డెన్‌తో మాట్లాడారు. అక్కడ ఉన్న వసతులపై కూడా చర్చించారు. ఇప్పటికి రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుని మూడు వారాలు గడిచినా బాబూరావు మీద అసలు కేసు కూడా పెట్టలేదు, ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేయడంతో.. అక్కడే కమిటీ సభ్యుల సమక్షంలోనే తాగి తందనాలాడుతున్న బాబూరావుపై చర్యలు తీసుకోవాలంటూ వీసీ ఫిర్యాదు రాసి పెదకాకాని సర్కిల్ ఇన్స్పెక్టర్ కు అందించారు.