breaking news
n indrasena reddy
-
'క్రీడా విధానంలో మార్పులు చేయాలి'
హైదరాబాద్ : క్రీడా విధానంలో మార్పులు చేయాల్సి అవశ్యకత ఎంతైనా ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్. ఇంద్రసేనారెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ... కోచ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే క్రీడాకారులకు ఇచ్చే పారితోషకంలో కోచ్‌లను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. గ్యాంగ్‌స్టర్ నయిమ్ కేసును సీబీఐకీ అప్పగించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పథకం ప్రకారం ఓట్లు తొలగించారు
హైదరాబాద్ : నోటిసులు ఇవ్వకుండా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో బతికున్న వాళ్ల పేర్లు కూడా తొలగించారని ఆయన తెలిపారు. చట్టవిరుద్ధంగా ఓట్లు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన భన్వర్‌లాల్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్‌ను తెలంగాణలోని ప్రతిపక్ష నేతలు కలిశారు. అనంతరం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, ఎన్ ఇంద్రసేనారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పథకం ప్రకారం ఓట్లు తొలగించారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్ ఇంద్రసేనారెడ్డి చెప్పారు. ఈ అంశంపై అధికారులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతో కలిపి నిజనిర్ధారణ చేయించాలని భన్వర్‌లాల్‌కు వారు వినతిపత్రం అందజేశారు.