breaking news
mumbai furniture market
-
ఫర్నిచర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
-
ఫర్నిచర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
ముంబై మహానగరంలోని ఒషివారా ప్రాంతంలోగల ఫర్నిచర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జోగేశ్వరిలోని రిలీఫ్రోడ్ ప్రాంతంలో ఉన్న ఫర్నిచర్ మార్కెట్లో ఈ ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ వర్గాలు తెలిపాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు దాదాపు 15 ఫైరింజన్లను రంగంలోకి దించినా, ఇంకా అవి అదుపుకాలేదు. ఫర్నిచర్ మార్కెట్ కావడంతో ఎక్కువ ఫోమ్, దూది, కవర్లు, కలప అన్నీ ఉంటాయని.. అందువల్ల మంటలు తక్కువ సమయంలోనే ఎక్కువగా వ్యాపించేందుకు అవకాశం ఉంటుందని అగ్నిమాపకశాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం అందలేదు.