breaking news
mudi reddy konda reddy
-
మాయమాటలతో అధికారంలోకి వచ్చే కుట్ర
యాచారం (రంగారెడ్డి): కేసీఆర్ మాయమాటలు చెప్పి మళ్లీ అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. యాచారంలో మంగళవారం డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారం కోసం కేసీఆర్ ఎన్ని అబద్ధాలైనా ఆడుతారని విమర్శించారు. ప్రజలను మాయలో ముంచి రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాకుండా అందరూ కృషి చేయాలని సూచించారు. కేసీఆర్ తన నాలుగేళ్ల పాలనలో పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో రియల్ వ్యాపారం చేసి రూ. కోట్ల రూపాయలు జమచేశారని ఆరోపించారు. నేడు ఆ డబ్బుతో ఎన్నికల్లో అడ్డదారిలో పీటం ఎక్కేందుకు యత్నిస్తున్నారన్నారు. ప్రస్తుతం ప్రజలు టీఆర్ఎస్కు నమ్మే పరిస్థితిలో జనం లేరన్నారు. జనంలో వ్యతిరేక ప్రభావం ఉండడం గమనించి ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి సీఎం కేసీఆర్ కుటిలంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుబంధుతో పేద రైతులకు, కౌలు రైతులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఉన్న భూమి రికార్డుల్లోకి ఎక్కక, పట్టాదారు, పాసుపుస్తకాలు రాక రైతులు ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. సీలింగ్, భూదాన్ భూములన్న రైతులకు తక్షణమే పట్టాదారు, పాసుపుస్తకాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు, ఇంటి నిర్మాణాలు, ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పేదలు ఆర్థిక ప్రగతి సాధించేలా పథకాలు అమలు చేస్తామని తెలిపారు. మళ్లీ వైఎస్సార్ పాలనను తీసుకొస్తామని పేర్కొన్నారు. నా టికెట్‌పై అనుమానాలు వద్దు: క్యామ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని, పార్టీ శ్రేణులు ఆందోళన చెందరాదని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ పేర్కొన్నారు. తన గెలుపు కోసం పార్టీ శ్రేణులు సైనికుల్లాగా పనిచేయాలని కోరారు. నాలుగేళ్లుగా నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులకు అండగా ఉన్నానని తెలిపారు. అధిష్టానం ఆదేశాలను పాటించి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. తనకు టికెట్ రావడం గ్యారంటీ అని.. ప్రజలు అశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 5న యాచారంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉందని, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. అనంతరం గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కాలె మల్లేష్, ప్రధాన కార్యదర్శి లిక్కి పాండురంగారెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆడాల గణేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు విష్ణు, యాచారం మాజీ సర్పంచ్ యాదయ్య తదితరులు ఉన్నారు. -
సోనియా దయతోనే తెలంగాణ
యాచారం, న్యూస్‌లైన్: సీమాంధ్రలో కాంగ్రెస్ వెనుకబడిపోతుందన్న విష యం తెలిసి కూడా యూపీఏ చైర్ పర్స న్ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రా న్ని ఇచ్చిందని టీపీసీసీ క్రమ శిక్షణ సంఘం చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. పట్నం కాంగ్రెస్ అసెం బ్లీ అభ్యర్థి క్యామ మల్లేష్‌కు మద్దతుగా మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంతన్‌గౌరెల్లి, మాల్, నానక్‌నగర్ తదితర గ్రామాల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ.. మాట తప్పిన కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు క్షమించరని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు.అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సోనియాగాంధీ కాళ్లయినా పట్టుకుంటానని మాటిచ్చి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తున్న కేసీఆర్ తీరు దారుణమని మండిపడ్డారు. బిల్లు ప్రవేశ పెట్టడంలో బీజేపీ ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ఇచ్చిన మాట తప్పలేదన్నారు. కానీ తన పోరాటం ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ బహిరంగసభల్లో గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ అభ్యర్థి క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తానని, ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి వా రి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పా రు. మంతన్‌గౌరెల్లి, మాల్ గ్రామాల్లో క్యామకు మద్దతుగా వందలాది మంది కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పీఏసీఏస్ చైర్మన్ శీలం మధుకర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధంకి రజితారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి దెంది రాంరెడ్డి, నాయకులు కాలె మల్లేష్, సిద్ధంకి కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాగలక్ష్మి, యాలాల యాదయ్య, బాషా, అరవింద్ పాల్గొన్నారు.