breaking news
Mohammad Riaz
-
మామ సీఎం.. అల్లుడు ఎమ్మెల్యే
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. మామ, అల్లుళ్ల జంట అసెంబ్లీలోకి త్వరలో అడుగిడనుంది. ఆ మామ, అల్లుళ్లు ఎవరో కాదు సాక్షాత్తూ సీఎం పినరయి విజయన్, ఆయన అల్లుడు పి.ఎ.మొహమ్మద్ రియాస్..!. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్(77) కన్నూర్ జిల్లా ధర్మదామ్ నుంచి, ఆయన అల్లుడు రియాస్(44) కోజికోడ్ జిల్లా బేపోర్ నియోజకవర్గం నుంచి, ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. విజయన్ కూతురు వీణ, రియాస్ 2020లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. వీణ బెంగళూరులో ఐటీ సంస్థను నడుపుతుండగా రియాస్ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. రియాస్ 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజికోడ్ నుంచి బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. కేరళ అసెంబ్లీకి 11 మంది మహిళా ఎమ్మెల్యేలు 2001 తర్వాత మొట్టమొదటి సారిగా కేరళ అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం ఈసారి రెండంకెలకు చేరింది. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 140 స్థానాలకు 103 మంది మహిళలు బరిలో నిలవగా 11 మంది మాత్రం విజయం సాధించారు. వీరిలో 10 మంది అధికార ఎల్డీఎఫ్కు చెందిన వారు, ఒక్కరు మాత్రమే ప్రతిపక్ష యూడీఎఫ్ ఎమ్మెల్యే. ఆరోగ్యమంత్రి కేకే శైలజ 60 వేల ఓట్ల మెజారిటీతో మత్తన్నూర్ నుంచి ఘన విజయం సాధించారు. 2016 ఎన్నికల్లో 8 మంది మాత్రమే నెగ్గగా, 1996లో 13 మంది మహిళలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. -
మరణంలోనూ వీడని సోదర బంధం
కుటుంబ సభ్యులను కాపాడే {పయత్నంలో ప్రాణాలు కోల్పోయిన అన్నదమ్ములు కళ్లముందే తోడును కోల్పోయిన తోడికోడళ్లు విహారయాత్రంలో విషాదం నక్కపల్లి/ ఎస్.రాయవరం: మృత్యువు కూడా రక్త సంబంధాన్ని విడదీయలేకపోయింది. కుటుంబ సభ్యులను రక్షించే ప్రయత్నంలో అన్న దమ్ములిద్దరూ సముద్రంలో మునిగి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తోడికోడళ్లిద్దరూ తోడు కోల్పోయి అనాథలుగా మిగిలారు. ఆపదలో ఉన్న కుటుంబ సభ్యులను రక్షించేందుకు వీరు చేసిన ప్రాణత్యాగానికి వారు ప్రత్యక్షసాక్షులుగా మిగిలిపోయారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాయకరావుపేట శాంతినగర్‌కు చెందిన మహ్మద్ రియాజ్ (38) మహ్మద్ దావూద్‌వాహబ్(36)లు అన్నదమ్ములు. రియాజ్‌కు భార్య షాజీబేగం, ముగ్గురు పిల్లలు అబ్దుల్హ్మ్రన్, రియాజ్, సానియా ఉన్నారు. వాహబ్కు భార్య హారిక్, పిల్లలు రెహ్మన్, ఇషాన్ ఉన్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉన్న వాహబ్ ఇటీవల పాయకరావుపేట రావడంతో శనివారం రెండు కుటుంబాలు కలసి బంగారమ్మపాలెం సముద్రతీరానికి విహార యాత్రకు వెళ్లారు. మొగ (మూడు నదులు కలిసే సంగమం) వద్దకు బోటులో వెళ్లారు. భోజనాల అనంతరం ఇసుక తిన్నెలపై ఆనందంగా గడిపారు. ఈత కొడదామన్న సరదాతో సముద్రంలోకి దిగారు. పక్కనే ఉన్న చిన్నపాటి పాడైన బోటుపై కుటుంబ సభ్యులు ఆడుకుంటున్నారు. కెరటాలు బలంగా రావడంతో ఆడుకుంటున్న పిల్లలు నీటిలో పడిపోయారు. వారి కోసం తల్లులు కూడా నీటిలో దిగారు. ఇది చూసి అన్నదమ్ములిద్దరూ కుటుంబసభ్యులను సురక్షితంగా ఇసుక తిన్నెలపై చేర్చారు. ఇంతలో కెరటాలు మరింత ఉధృతంగా రావడంతో అన్నదములు సముద్రంలో మునిగిపోయారు. అక్కడే ఉన్న నేవీ సిబ్బంది, మత్య్సకారులు వారిని ఒడ్డుకు చేర్చారు. నీరు ఎక్కువగా తాగడంవల్ల అపస్మారక స్థితికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న వారిని నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి ఆటోలో తరలించారు. మార్గమధ్యలోనే వీరు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుల పిల్లలంతా పదేళ్లలోపు వయసు వారే, తండ్రి మరణించారన్న విషయం వారికింకా తెలపలేదు. కళ్లముందే తమను రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయి విగత జీవులుగా పడి ఉన్న భర్తల మృతదేహాల వద్ద తోడికోడళ్లు రోదిస్తున్న తీరు స్థానికులను కలిచి వేసింది. ప్రమాద విషయం తెలిసిన బంధువులు, స్నేహితులు అధిక సంఖ్యలో నక్కపల్లి ఆస్పత్రికి చేరుకున్నారు. మృతులు నివాసముంటున్న పాయకరావుపేట శాంతినగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతులకు తల్లి ఉంది. ఆమె హుద్‌హుద్ తుఫాన్ సమయంలో ఆందోళనతో గుండెజబ్బుకు గురై తీవ్ర అనారోగ్యంతో ఉంది. దీంతో కుమారుల మరణవార్త ఆమెకు చెప్పలేదు.