MLA Errabelli Dayakar Rao
-
అభివృద్ధి కోసమే పార్టీ మారాం
సంగెం : తమను నమ్ముకున్న క్యాడర్, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారామని పాలకుర్తి, పరకాల ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఎల్గూర్‌స్టేçÙన్ మాజీ సర్పంచ్ జీజుల సమ్మయ్య తల్లి లక్ష్మి, కొత్తగూడెం సర్పంచ్ వాసం సాంబయ్య తండ్రి వాసం వీరస్వామి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. బుధవారం ఇద ్దరు ఎమ్మెల్యేలు వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ సారథ్యం లో నియోజకవర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉండేలా కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యేల వెంట సర్పంచ్‌లు రంగరాజు నర్సింహస్వామి, మాదినేని రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కిషన్‌నాయక్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, సుదర్శన్‌రెడ్డి, నరహరి, ఉండీల రాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
చీలిక గ్రూపుగానే కొనసాగింపు
మూడింట రెండొంతుల మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి * అయినా విలీనమవకుండా చీలిక వర్గంగా కొనసాగే వ్యూహం * చీలిక వర్గంగా గుర్తించాలంటూ రేపో మాపో స్పీకర్‌కు లేఖ * రాజీనామా లేఖను వెనక్కి తీసుకోనున్న తలసాని! * రెండ్రోజుల్లో టీఆర్ఎస్లోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు! * దాంతో పరిపూర్ణం కానున్న టీఆర్ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ * టీడీపీలో మిగిలేది రేవంత్, గోపీనాథ్, కృష్ణయ్యలే సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అనుకున్నది సాధించింది. మొత్తం తెలుగుదేశం శాసనసభ్యుల్లో మూడింట రెండొంతుల మందిని చేర్చుకోవడం ద్వారా తన ఆపరేషన్ ఆకర్ష్‌ను దిగ్విజయంగా పూర్తిచేసింది. మూడు రోజుల్లోనే ముగ్గురు ఎమ్మెల్యేలు చేరడం, మరో ఎమ్మెల్యే చేరాలని నిర్ణయం తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ చీలికవర్గం పైచేయి సాధించింది. గతంలో శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో విలీనమైనట్లుగా కాకుండా చీలికవర్గంగానే వీరు కొనసాగుతారు. తాము టీడీపీ నుంచి బయటకు వచ్చామని.. మెజారిటీ సంఖ్యలో ఆ పార్టీని వీడినందున తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని స్పీకర్‌ను కోరుతారు. ప్రత్యేక గ్రూపుగా తాము టీఆర్ఎస్కు మద్దతు ఇస్తామని, ప్రభుత్వంలో భాగస్వాములం అవుతామని అనుమతి కోరుతారు. దీంతో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తన రాజీనామా లేఖను అధికారికంగానే వెనక్కి తీసుకుంటారు. ఇక మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, గ్రేటర్ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరుతారని విసృ్తతంగా ప్రచారం జరుగుతోంది. వచ్చే వారం ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని.. అదే సమయంలో సండ్ర పార్టీలో చేరుతారని టీఆర్ఎస్ ముఖ్యుడొకరు వెల్లడించారు. ఎమ్మెల్యే గాంధీ మూడు రోజుల కిందే టీఆర్ఎస్లో చేరాలనుకున్నా... సరైన ముహూర్తం చూసుకుని చేరుతానని చెప్పినట్లు తెలిసింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారు. ఈ చేరికలూ పూర్తయితే టీడీపీలో ముచ్చటగా ముగ్గురు రేవంత్‌రెడ్డి (కొడంగల్), గోపీనాథ్ (జూబ్లీహిల్స్), కృష్ణయ్య (ఎల్బీ నగర్) మిగులుతారు. చీలికవర్గం నేతగా ఎర్రబెల్లి టీడీపీ చీలికవర్గానికి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వం వహిస్తారు. త్వరలోనే ఈ చీలిక వర్గం నేతలంతా సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకుంటారని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశం నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అధికారికంగా టీఆర్ఎస్లో చేరిన తరువాతా... లేదా మిగతా ఇద్దరు కూడా చేరాక ఏర్పాటు చేసుకుంటారా అన్నదానిపై స్పష్టత లేదని ఆ వర్గాలు తెలిపాయి. సమావేశం ఎప్పుడైనా చీలికవర్గం నేతగా ఎర్రబెల్లినే ఎన్నుకుంటారని, ఆయన టీడీఎల్పీ నేతగా కూడా చేసినందున ఆయనకే అవకాశం వస్తుందంటున్నారు. మంత్రివర్గంలో మరొకరికి చాన్స్ టీడీపీ చీలికవర్గం నుంచి మంత్రివర్గంలో మరొకరికి అవకాశం లభించనుంది. ఇప్పటికే తలసాని శ్రీనివాసయాదవ్ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా చీలికవర్గంలో సీనియర్ ఎమ్మెల్యేకు అవకాశం కల్పిస్తారు. మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుత మంత్రుల్లో ముగ్గురు లేదా ఐదుగురికి ఉద్వాసన పలుకుతారని ప్రచారం సాగుతోంది. అలాగే చీలికవర్గ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
కడియం, ఎర్రబెల్లి మధ్య సఖ్యత కుదిరేనా?
హైదరాబాద్: ఆ ఇద్దరు నాయకులకు ఒకరంటే మరొకరికి సరిపడదు. ఒకే జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులైన వారిద్దరు ఇప్పుడు మళ్లీ ఒకే గూటిలో చేరిపోయారు. ఇప్పుడు వారిద్దరి మధ్య సఖ్యత కుదురుతుందా అంటే... సన్నిహితంగా ఉండే నేతలు మాత్రం ఆ అవకాశాలే లేవని చెబుతున్నారు. అలాంటి వారిద్దరిని పార్టీలో చేర్పించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, నిన్నటి వరకు టీడీపీలో ఉన్న సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు... వీరిద్దరి మధ్య ఎప్పటినుంచో రాజకీయంగా విభేధాలున్నాయి. గత సాధారణ ఎన్నికలకు ముందు కడియం శ్రీహరి టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరగా, టీడీపీ శాసనసభా పక్షం నేతగా వ్యవహరిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం చేరారు. ఒకే జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నాయకులు గత కొంత కాలంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడు కూడా పరస్పరం ఘాటు విమర్శలు సంధించుకున్న సందర్భాలున్నాయి. జిల్లా రాజకీయాల్లో తమ మాట నెగ్గించుకునే ప్రయత్నాల్లో అనేకసార్లు వీరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. సాధారణ ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొత్తలోనే ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరతారన్న వార్తలొచ్చాయి. అయితే సందర్భంగానుసారంగా ఆయన వాటిని ఖండిస్తూ వచ్చారు. ఎర్రబెల్లి చేరికను ఏదోరకంగా కడియం శ్రీహరి అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేశారని చెబుతుంటారు. ఆ కారణంగానే ఇంతకాలం ఎర్రబెల్లిని టీఆర్ఎస్ లో చేర్పించుకోలేదన్న ప్రచారం కూడా ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఎర్రబెల్లి వ్యవహారం తెరమీదకు రావడం, వెనువెంటనే ఆయన పార్టీ మారడం జరిగిపోయింది. ఎర్రబెల్లిని తీవ్రంగా వ్యతిరేకించే కడియం శ్రీహరికి తెలియకుండా జరిగిందా... లేక ఆయనకు చెప్పే చేర్పించుకున్నారా అన్న విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. ఎంతో కాలం నుంచే ఎర్రబెల్లి నేరుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో టచ్ లో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకాలం సమయం కోసం వేచిచూసిన కేసీఆర్ ఒక్కసారిగా ఎర్రబెల్లి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే వరంగల్ జిల్లాలో ఎడమొహం పెడమొహంగా ఉండే వీరిద్దరిని ఏవిధంగా ఒకే వేదికపైకి తెస్తారు. అసలు వీరిద్దరి మధ్య సఖ్యత కుదురుతుందా, ఈ విషయంలో కేసీఆర్ కు మరో ప్లాన్ ఏమైనా ఉందా అన్న విషయాలు ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైనా చివరి నిమిషయం వరకు కడియంకు ఎలాంటి సమాచారం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరిన విషయంలో కడియం శ్రీహరి ఇంతవరకు స్పందించలేదు. ఎర్రబెల్లి చేరికను కడియం శ్రీహరి ఏరకంగానూ సమర్థించరని, అయితే పార్టీ నాయకత్వం ముందు ఎలాంటి అంగీకారం కుదిరిందో తమకు తెలియదని కడియం వర్గీయులు చెబుతున్నారు. ఇంతకాలం రాజకీయంగా బద్ధశత్రువులుగా వ్యవహరించిన వీరిద్దరు రానున్న రోజుల్లో ఎలా ఉంటారన్న విషయం వేచిచూడాల్సిందే.