breaking news
miryalaguda revenue division
-
‘రియల్’కు ‘రైతుబంధు’!
సాక్షి, మిర్యాలగూడ (నల్గగొండ): మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసిన ప్లాట్లుగా మార్చిన వెంచర్లకు కూడా రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందుతోంది. వెంచర్లకు రైతుబంధు ఏమిటి అనుకుంటున్నారా.. ఇది ముమ్మాటికీ నిజం. కొందరు రియల్ వ్యాపారులు వ్యవసాయ భూములను కొని వెంచర్లుగా ఏర్పాటు చేసినప్పటికీ నాలాపన్ను చెల్లించకపోవడంతో రికార్డుల ప్రకారం ఆ వెంచర్లు వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. దీంతో అధికారులు ఏంచక్కా వాటికి రైతుబంధు వర్తింపజేసినట్టు సమచారం. దీంతో రియల్ వెంచర్లకు రైతుబంధు అందుతుందన్న సంగతి హాట్‌టాపిక్‌గా మారింది. మిర్యాలగూడ డివిజన్లో కొత్త దందా ఇది.. రైతుల పేరుమీద ఉన్నప్పటికీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. వాటికి కూడా రైతుబంధు అందుతుండడం గమనార్హం. ఇక్కడ రియల్‌వ్యాపారులు వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. కానీ నాలా పన్ను చెల్లించకపోవడం.. రికార్డుల్లో వ్యవసాయ భూమిగా ఉండడంతో వారికి రైతుబంధు నగదు సాయం అందుతోంది. మిర్యాలగూడ పట్టణ సమీపంతో పాటు మండలంలోని చింతపల్లి, హైదలాపురం, గూడూరు, శ్రీనివాస్‌నగర్, బాదలాపురం, ఆలగడప గ్రామాలలో పలు రియల్ ఎస్టేట్ భూముల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇటీవల ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ హైదలాపురం సమీపంలో చూసిన సర్వే నంబర్ 4, 218లలో కూడా కనీసం నాలా కూడా చెల్లించలేదని తేలింది. ఆ భూములు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి ప్లాట్లుగా చేసినా రైతులు రామ్మూర్తి పేరున 7.04 ఎకరాలు, విజయలక్ష్మి పేరున 1.30 ఎకరాల భూమి ఉన్నట్లుగా తేలింది. దాంతో వ్యవసాయ భూమిగా ఉన్న ఈ భూమికి కూడా ఇటీవల రైతుబంధు పథకాన్ని అధికారులు వర్తింపజేసినట్లు సమాచారం. పరిశీలన బృందం ఏర్పాటుకే పరిమితం.. అనధికారిక లేఅవుట్లను మిర్యాలగూడ పట్టణం, మండలంలోని గుర్తించడానికి గాను ఆర్డీఓ జగన్నాథరావు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బృందంలో మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వేయర్ ఉన్నారు. మున్సిపాలిటీ, మండలంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లను పరిశీలించి నాలా పన్ను చెల్లించారా? లేదా? అనే విషయంతో పాటు లేఅవుట్‌కు అనుమతి ఉందా? లేదా? పరిశీలించాలి. అనుమతి లేని లేఅవుట్ ఏర్పాటు చేస్తే చర్యలు తీసు కోవడంతోపాటు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంబంధిత ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అనధికారిక లేఅవుట్లను పరిశీలించే బృందం కేవలం ఏర్పాటుకే పరిమితం కాగా లేఅవుట్లను పరిశీలించడం లేదు. ఇప్పటికైనా అనుమతి లేని వెంచర్లపై చర్యలు తీసుకోవాలని పట్టణవాసుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. కానీ.. అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే. అనుమతి లేఅవుట్లపై చర్యలేవీ? మిర్యాలగూడ మున్సిపాలిటీ, సమీప గ్రామంలో అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అటు గ్రామపంచాయతీ, ఇటు మున్సిపల్‌శాఖ అనుమతులు లేకుండా వెలుస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అనధికారిక లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశాలు జారీ చేయగా ఆర్డీఓ జగన్నాథరావు, మున్సిపల్ కమిషనర్ సత్యబాబు, ఎంపీడీఓ దేవిక పరిశీలించారు. కానీ ఒక్కరోజు పరిశీలనలోనే పది ఎకరాల భూమి నాలా పన్ను కూడా చెల్లించలేదని తేలినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు కేవలం లేఅవుట్‌ను పరిశీలించి వదిలేశారు. -
భూముల విలువ రూ.160.56 కోట్లు
నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల విలువ లెక్కింపు ఓ కొలిక్కి వచ్చింది. మండలాలు, గ్రామాల వారీగా జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములు ఏ మేరకు ఉన్నాయి.. భూముల విస్తీర్ణం, వాటి విలువ, సర్వేనంబర్లతో సహా జిల్లా యంత్రాంగం పకడ్బందీ నివేదికను సిద్ధం చేసింది. భూముల అమ్మకం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో విలువైన ప్రభుత్వ భూములు, భవనాలను జిల్లా యంత్రాంగం గుర్తించింది. అయితే భూముల గుర్తింపులో మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ మినహా మిగిలిన నాలుగు డివిజన్లలో కసరత్తు పూర్తయింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదికలు జిల్లా ఉన్నతాధికారులకు చేరాయి. మిర్యాలగూడ డివిజన్ అధికారులు దామరచర్ల థర్మల్ పవర్‌ప్లాంట్ పనిలో నిమగ్నమై ఉండడంతో వివరాల సేకరణలో కొంత జాప్యం జరిగింది. ఇక భవనాల గుర్తింపు, వాటి విలువను లెక్కించే ప్రక్రియ కూడా తుది దశకు చేరింది. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు నాలుగు రెవెన్యూ డివిజన్లలో విలువైన ప్రభుత్వ భూములు 2017.82 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. రిజిస్ట్రేషన్ లెక్కల ప్రకారం ఆ భూముల (బేస్ వాల్యూ) విలువ రూ.160.56 కోట్లుగా తేల్చారు. మార్కెట్ విలువ ప్రకారం అయితే రూ.269.51 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే ప్రభుత్వ బేసిక్ వాల్యూ ప్రకారమే వేలం వేసే అవకాశం ఉంటుంది. దానిపై ఎవరు ఎక్కువ పాడుకుంటే వారికి ఆ భూములు దక్కే అవకాశం ఉంటుంది. ఆ డివిజన్ల భూములు సప‘రేటు’... భువనగిరి డివిజన్‌తో పోలిస్తే సూర్యాపేట, నల్లగొండ, దేవరకొండ డివిజన్ల భూముల ధరలు ఓ మోస్తారుగానే ఉన్నాయి. హైదరాబాద్‌కు భువనగిరి డివిజన్ అత్యంత సమీపంలో ఉండటంతో ఆ ప్రాంత భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయి. డివిజన్ల వారీగా పరిశీలిస్తే... సూర్యాపేట డివిజన్లో 20 చోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించారు. ఈ డివిజన్ పరిధిలో భూములు కోదాడ, తుంగుతుర్తి, మునగాల, మోతె, ఆత్మకూరు(ఎస్) మం డలాల్లో ఉన్నాయి. అత్యధికంగా సూర్యాపేటలో గాంధీనగర్ ప్రాంతంలోని భూములకు రిజిస్ట్రేషన్ విలువ రూ.2 కోట్లు ఉండగా...మార్కెట్ విలువ రూ.6 కోట్ల వరకు ఉంది. దేవరకొండ డివిజన్లో 41 చోట్ల భూములు గుర్తించారు. గుర్రంపోడు, గణ్పూర్, డిండి, అక్కంపల్లి, అం గడిపేట ప్రాంతాల్లో విలువైన భూములు గుర్తిం చారు. ఈ ప్రాంతంలో గుర్రంపోడులో రిజిస్ట్రేషన్ విలువ రూ.19 లక్షలు కాగా, మార్కెట్ విలువ రూ.25 ల క్షల వరకు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. నల్లగొండ డివిజన్లో 50 చోట్ల భూములు గుర్తించారు. అత్యధికంగా చిట్యాల, కట్టంగూరు, నార్కట్‌పల్లి, కేతేపల్లి ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ భూముల విలువ రిజిస్ట్రేషన్ లెక్కల ప్రకారం రూ.25 లక్షలు కాగా, మార్కెట్ విలువ రూ.40 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. శివారు భూములకు భలే గిరాకీ... నాలుగు డివిజన్లలో గుర్తించిన భూముల్లో అత్యధిక విలువైన భూములు హైదరాబాద్ శివారు ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్ధుగానే ఉన్నప్పటికీ శివారు భూముల ధరలు మాత్రం నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న చౌటుప్పుల్, పోచంపల్లి ప్రాంతాల్లో మార్కెట్ విలువ ప్రకారం భూముల ధరలు కోటి రూపాయల వరకు ఉన్నాయి. అదే రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం అయితే రూ.15 లక్షలు మాత్రమే ఉంది. భువనగిరి డివిజన్లో 57 చోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించారు. ఈ భూములు ఆలేరు, భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట, వలిగొండ మండలాల్లో ఉన్నాయి. యాదగిరిగుట్టను తెలంగాణ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్ విలువ ప్రకారం ఆ భూములకు మరింత ధర పలకనుంది. గుర్తించిన భూములు..వాటి విలువ.. డివిజన్ గుర్తించిన భూమి బేసిక్ వాల్యూ రిజిస్ట్రేషన్ పేరు (ఎకరాల్లో) మార్కెట్ విలువ ప్రకారం సూర్యాపేట 35.19 రూ.13.11 కోట్లు రూ.29 కోట్లు దేవరకొండ 414.30 రూ.34.50 కోట్లు రూ.58.60 కోట్లు భువనగిరి 717.30 రూ.88.25 కోట్లు రూ.124.24 కోట్లు నల్లగొండ 851.03 రూ.24.70 కోట్లు రూ.57.67 కోట్లు మొత్తం 2017.82 రూ.160.56 కోట్లు రూ.269.51 కోట్లు