మంత్రికి కరెంట్ షాక్, ఆస్పత్రికి తరలింపు
భోపాల్: మధ్యప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ మంత్రి విజయ్ షాకు కరెంట్ షాక్ కొట్టింది. ఆయన్ను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంత్రికి ప్రాణాపాయం లేదని ఆయన సహాయకులు చెప్పారు.
మంగళవారం విజయ్ షా తన అధికారిక నివాసంలో కరెంట్ స్విచ్ ఆన్ చేస్తుండగా స్విచ్ బోర్డు నుంచి షాక్ కొట్టింది. ఆయన చేతికి కాలిన గాయాలయ్యాయి. వైద్యులు చికిత్స చేసిన అనంతరం విశ్రాంతి తీసుకోవాల్సిందిగా మంత్రికి సూచించారు. మంత్రి ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నట్టు సహాయకులు చెప్పారు.