breaking news
Mi 6
-
భారత్‌లోకి షావోమి తొలి డ్యూయల్-కెమెరా ఫోన్
న్యూఢిల్లీ : చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండే స్మార్ట్ఫోన్లను డ్యూయల్ రియర్ కెమెరాలతో లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు ఇంకా భారత్‌లోకి ప్రవేశించలేదు. త్వరలోనే ఈ రెండు స్మార్ట్ఫోన్లలో ఒకటి అంటే తొలి డ్యూయల్ కెమెరా షావోమి స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి రాబోతుంది. ఈ విషయాన్ని షావోమి మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ తన మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. '' ఇంకా మీరు ఎన్నో రోజులు వేచిచూడాల్సిన పనిలేదు. షావోమి తొలి డ్యూయల్ కెమెరా ఫోన్ వచ్చే నెలలో భారత్‌లోకి వచ్చేస్తోంది. అయితే అదేంటో మీరు గెస్ చేయగలరా?'' అని జైన్ ట్వీట్ చేశారు. అయితే ఈ రెండు స్మార్ట్ఫోన్లలో ఒకటి షావోమి ఎంఐ 5ఎక్స్‌ను గత నెలలోనే చైనా మార్కెట్లోకి లాంచ్ చేశారు. 4GB+64GB తో దీన్ని అక్కడ ప్రవేశపెట్టారు. దీని ధర అక్కడ 1,499 యువాన్లు. భారత్‌లో సుమారు 14,200 రూపాయల వరకు ఉండొచ్చు. ఈ ఫోన్ అతిపెద్ద ఆకర్షణ, వెనుకవైపు రెండు కెమెరాలు. రెండు కూడా 12 మెగాపిక్సెల్వే. ఫ్రంట్ వైపు రియల్-టైమ్ బ్యూటిఫికేషన్ ఫీచర్‌తో 5ఎంపీ కెమెరాను అమర్చింది కంపెనీ. 5.5 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే, ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 128జీబీ విస్తరణ మెమరీ, 3080ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో మిగతా ఫీచర్లు. ఇక ఎంఐ 6 విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌ను షావోమి ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ చేసింది. క్వాల్కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 835 ఫ్లాగ్షిప్ ఎస్ఓసీతో ఇది రూపొందింది. 6జీబీ ర్యామ్, 5.15 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 3.5ఎంఎం ఆడియో జాక్, 64జీబీ, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 3,350 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ఫీచర్లు. ఈ ఫోన్‌కు కూడా 12ఎంపీ లెన్స్‌తో వెనుకవైపు రెండు కెమెరాలున్నాయి. దీంతో 4కే వీడియో రికార్డింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఇది రూపొందింది. -
లీకైన షియోమి ఫోన్లు: అదరగొట్టే ఫీచర్లివే!
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంచలన విక్రయాలతో దూసుకెళ్తున్న షియోమి, మరో రెండు స్మార్ట్ ఫోన్లతో వినియోగదారుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల స్పెషిఫికేషన్లు లాంచింగ్ ముందే ఆన్ లైన్ లో లీకైపోయాయి. డిస్ప్లే, ప్రాసెసర్, స్టోరేజ్, కెమెరా వంటి అన్ని ప్రత్యేకతలు ఆన్ లైన్ లో దర్శనమిస్తున్నాయి. షియోమి ఎంఐ 6, షియోమి ఎంఐ 6 ప్లస్‌ల పేరుతో ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఏప్రిల్ 11న లాంచ్ కాబోతున్నాయి. లీకైన వీటి స్పెషిఫికేషన్ వివరాలు ఓ సారి చూద్దాం... ఎంఐ 6 స్మార్ట్ ఫోన్ స్పెషిఫికేషన్లు... 5.15 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ప్లే 2.45 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835ఎస్ఓసీ 32జీబీ, 64జీబీ లేదా 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు 4జీబీ లేదా 6జీబీ ర్యామ్ 19ఎంపీ సోనీ ఐఎంఎక్స్400 సెన్సార్‌తో ప్రైమరీ కెమెరా 8ఎంపీ ఫ్రంట్ షూటర్ 3200 ఎంఏహెచ్ బ్యాటరీ(నాన్-రిమూవబుల్) ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో దీని ధరలు సుమారు రూ.19,000 నుంచి రూ.26,000 మధ్యలో ఉంటాయట. ఎంఐ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్ స్పెషిఫికేషన్లు... 5.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ప్లే 2.45 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835ఎస్ఓసీ 64జీబీ లేదా 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు 6జీబీ ర్యామ్ 12ఎంపీతో డ్యూయల్ కెమెరా ఫ్రంట్ 8ఎంపీ సెల్ఫీ షూటర్ 4500ఎంఏహెచ్ బ్యాటరీ (నాన్ రిమూవబుల్) ఆండ్రాయిడ్ 7.0 నోగట్ దీని ధరలు సుమారు రూ.24,680 నుంచి రూ.33,226 మధ్యలో ఉంటాయట.