breaking news
Meagaamann
-
స్టిల్ తెచ్చిన తంటా!
శింబుకు కటీఫ్ చెప్పేసి, కెరీర్‌పైనే పూర్తిస్థాయి ఏకాగ్రత పెట్టిన హన్సికను ఇప్పుడు మరో వివాదం చుట్టుముట్టింది. ఇటీవల ఆమె ట్వీట్ చేసిన ఓ ఫొటోనే ఈ వివాదానికి కారణం. వివరాల్లోకెళ్తే - ప్రస్తుతం ఆర్యతో ‘మేఘమాన్’ అనే సినిమా చేస్తున్నారు హన్సిక. ఆ సినిమా షూటింగ్ చెన్నయ్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ చిత్రం దర్శకుడు తిరుమేని... ఆర్య, హన్సికపై ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని తెరకెక్కించాడు. సన్నివేశానికి అనుగుణంగా ఆర్య హృదయంపై హన్సిక తలవాల్చి కాసేపు అలా ఉండిపోవాలి. సన్నివేశం చేస్తున్న సమయంలోనే... అక్కడున్న స్టిల్ ఫొటోగ్రాఫర్ వారిద్దరినీ క్లిక్ మనిపించాడు. ఆ స్టిల్స్ హన్సికకు చూపించాడు. ఆమెకు చాలా బాగా నచ్చడంతో ఆ స్టిల్స్‌ని తన ట్విట్టర్లో పోస్ట్ చేసుకుంది హన్సిక. అదే ఈ ముద్దుగుమ్మ చేసిన తప్పు. ట్విట్టర్లో ఆర్య, హన్సిక స్టిల్స్ చూసిన అందరూ వారిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందని చెప్పుకోవడం మొదలుపెట్టారట. దీంతో ఆమె మీడియాకు వివరణ ఇవ్వక తప్పలేదు. ‘‘ఆ స్టిల్‌లో మా జంట చాలా ముచ్చటగా ఉంది. సినిమాకు హెల్ప్ అవుతాయని ట్వీట్ చేశాను. అంతేతప్ప అందులో మరో ఉద్దేశం లేదు. దయచేసి లేనివి సృష్టించొద్దు’’ అని చెప్పారు హన్సిక. -
ఆర్యతో మరోసారి...
హీరోయిన్లందరికీ ఆర్య రియల్ హీరో అనే పేరుంది. ఎందుకంటే ప్రతి హీరోయిన్ ఆయన్ని ఇష్టపడుతుందట. కారణాలేమయినా ఈ నటుడిపై పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయి. తన సరసన నటించే ప్రతి హీరోయిన్‌తోను ఆయన చెట్టాపట్టాలేసుకుని షికార్లు చేస్తారన్నది ఆ ప్రచారాల్లో ఒకటి. అలాంటి నటుడితో ఆరంభం చిత్రంలో జతకట్టింది తాప్సీ. ఈ చిత్రంలో చక్కని యువ జంటగా పేరు తెచ్చుకున్నారు కూడా. ప్రస్తుతం తాప్సీ ఆర్యతో మరోసారి రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో రూపొందనున్న మిగామన్ చిత్రం హీరోయిన్గా శృతి హాసన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆ పాత్రకు తాప్సీని ఎంపిక చేసే యత్నంలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలిసింది. కోలీవుడ్ వర్గాలు కూడా దీన్ని సూచన ప్రాయంగా అంగీకరిస్తున్నాయి.