breaking news
Manthan samvaad
-
ప్రశ్నించడమే రాజకీయం
ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలన్నా, దానిని కాపాడుకోవాలన్నా మేధావులు చర్చిస్తేనే సాధ్యం అవుతుందని మంథన్ సంవాద్ వేదికగా పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ‘మంథన్ సంవాద్’ 13వ ఎడిషన్ బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికపై జరిగింది. మేధావులను ఒకే వేదికపైకి తీసుకొచి్చ, వారి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మంథన్ 2005 నుంచి అక్టోబర్ 2న ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 470 కార్యక్రమాలు జరిగాయి. సింగర్ అనూజ్ గుర్వారా, నటుడు అజీజ్ నజీర్, సబాఖాన్ సహా 1,500 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.8 మంది వక్తలు పలు అంశాలపై తమ అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకున్నారు. – సాక్షి, హైదరాబాద్ముస్లిం జనాభా పెరుగుతుందనేది ఒక అపోహ: ఖురేషీ దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందనేది ఒక అపోహ మాత్రమేనని కేంద్ర ఎన్నికల మాజీ కమిషనర్ ఖురేషీ చెప్పారు. మంథన్ సంవాద్‌లో భాగంగా ‘దేశంలో ము స్లిం జనాభా పెరుగుదల–అపోహలు’అనే అంశంపై ఆయన మాట్లాడారు. 1951 నుంచి 2011 వరకు జనాభా లెక్కల ప్రకారం ముస్లిం జనాభా 13.6 కోట్లకు, హిందువుల జనాభా 67.6 కోట్లకు చేరిందని వివరించారు. ఈ గణాంకాలు చూస్తే..దేశ జనాభా పెరిగేందుకు హిందువులు కారణమని చెప్పారు. అదే కాలంలో హిందూ, ముస్లింల మ« ద్య జనాభా గ్యాప్ 26.7 కోట్ల నుంచి 80.8 కోట్లకు పెరిగిందన్నారు. హిందువులను ముస్లిం జనాభా దాటేస్తుందనేది ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. ఎక్కువ మంది జనాభాను కనాలని ఏ ముస్లిం నాయకుడు కానీ, మేధావి కానీ పిలుపునివ్వలేదని గుర్తు చేశారు. కుటుంబ నియంత్రణను ఖురాన్ ఎక్కడా నిషేధించలేదన్నారు. ఒకే దేశం–ఒకే ఎన్నిక అసంబద్ధం : అరవింద్ దాతార్ ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే ప్రతిపాదన అసంబద్ధమైనదని సీనియర్ అడ్వొకేట్ అరవింద్ దాతార్ అన్నారు. దీనివల్ల దేశంలో రాజ్యంగా సంక్షోభం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘75 ఏళ్ల రాజ్యాంగం’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ అవసరంపై చర్చ జరగాలన్నారు. గవర్నర్లు ప్రతి బిల్లుకు కొర్రీలు పెడుతూ ఇబ్బందులు పెట్టడం సరికాదని చెప్పారు. రాష్ట్రాలపై పెత్తనం చెలాయించేందుకు గవర్నర్ వ్యవస్థను వాడుకోవడమేంటని ప్రశ్నించారు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ అవసరం: కిరణ్‌రావు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావొద్దంటే.. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్‌రావు సూచించారు. ‘లింగ దృష్టి కోణం’అనే అంశంపై ఆమె ప్ర సంగించారు. సినిమాల్లో స్త్రీల ను చూపించే విధానంలో మార్పులు రావాలని, అయితే మహిళల సమస్యల గురించి మహిళా డైరెక్టర్లతోపాటు కొందరు పురుషులు కూడా అద్భుతంగా తెరకెక్కించారని కిరణ్‌రావు పేర్కొన్నారు. పురుషులు కూడా చాలా సున్నితమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటి గురించి కూడా చర్చించాలన్నారు. తనకు వనపర్తి అంటే చాలా ఇష్టమని, తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్తుంటానని చెప్పారు. హై దరాబాద్‌తో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే : శశికాంత్ మెజారిటీ, మైనారిటీ అనే అంశాన్ని రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ పేర్కొన్నారు. మెజారిటీ ప్రజలకు మైనారిటీలంటే లేనిపోని భయాలు కల్పించి ఎన్నికల్లో గెలుపొందడమే వారి లక్ష్యమని చెప్పారు. ‘కౌంటరింగ్ మెజారిటేరియనిజం–తీసుకోవాల్సిన చర్యలు’అనే అంశంపై ఆయన మాట్లాడారు. మెజారిటేరియనిజం అనేదే పెద్ద నకిలీదని, దీని వల్ల మెజారిటీ ప్రజలే తీవ్రంగా నష్టపోతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే చాలా ప్రదేశాల్లో గుళ్లలోకి కొన్ని కులాలను వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో శాస్త్రీయంగా ముందుకు వెళ్లాల్సింది పోయి.. తిరోగమనం చెందడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కుటుంబం నుంచే రాజకీయాలు మాట్లాడకుండా తల్లిదండ్రులు పిల్లలను పెంచుతున్నారన్నారు. పార్లమెంటరీవ్యవస్థ నాశనం సంజయ్సింగ్దేశంలో పార్లమెంటరీ వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తోందని ఆమ్ఆద్మీ ఎంపీ సంజయ్‌సింగ్ విమర్శించారు. ఎంపీలను సస్పెండ్ చేసి, నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ‘పార్లమెంట్ వ్యవస్థ పతనం’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. పదేళ్ల యూపీఏ హయాంలో 150 మంది ఎంపీలను మాత్రమే సస్పెండ్ చేశారని, వారిలో 50 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారని చెప్పారు. గత పదేళ్ల మోదీ పాలనలో 250 మందికిపైగా ఎంపీలను సస్పెండ్ చేస్తే వారిలో ఒక్కరంటే ఒక్క బీజేపీ ఎంపీ లేకపోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నారని, బయటకు వచ్చి మాట్లాడితే ఈడీ, సీబీఐతో దాడులు జరిపించి, జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన వారు బీజేపీలో చేరగానే.. సత్యహరిశ్చంద్రులుగా మారుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ప్రభుత్వం నడవకుండా చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. -
నా వార్తల్లో నిజాయితే నన్ను ధైర్యంగా నిలబెట్టింది
-
మేధోమథనంతోనే పరిష్కారాలు
సామాజిక సమస్యలపై ‘మంథన్ సంవాద్’లో నిగ్గుతేల్చిన వక్తలు సాక్షి, హైదరాబాద్: వ్యవస్థలో మార్పులు, మహిళల హక్కుల సాధన, ప్రత్యామ్నాయ రాజకీయాలు,సామాజిక అశాంతి, నగరీకరణ సవాళ్లు, వ్యవసాయ రంగ సంక్షోభం వంటి అంశాలను ఎదుర్కొనేందుకు ప్రజలు, మేధావుల భాగస్వామ్యంతో చేపట్టే మేధోమథనంతోనే చక్కటి పరిష్కారాలు లభిస్తాయని వివిధ రంగాల నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘మంథన్ సంవాద్’ నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏర్పాటుచేసిన చర్చాగోష్టిలో వారు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు ఔత్సాహికులు సంధించిన ప్రశ్నలకు వక్తలు సమాధానాలిచ్చారు. సంస్థ ప్రతినిధి, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి కాకిమాధవరావు సారథ్యంలో సాగిన ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కల్పనా కన్నభిరాన్, ఆర్థిక సంఘ మాజీ సభ్యుడు అరుణ్మైరా, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్, పాత్రికేయ ప్రముఖుడు శేఖర్‌గుప్తా, నిర్మాణ రంగ నిపుణుడు కె.టి.రవీంద్రన్, పర్యావరణ ఉద్యమకారిణి వందనా శివలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సదస్సులో పలు రం గాల నిపుణులు, విద్యావేత్తలు, సీనియర్ జర్నలిస్టు చందనా చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ‘మంథన్ సంవాద్’లో వెల్లడైన అభిప్రాయాలు వక్తల మాటల్లోనే ఇలా... మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేసేందుకు యత్నాలు దేశంలో పత్రికారంగం, ఎలక్ట్రానిక్ మీడియాకు సంకెళ్లు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ పార్టీల చేతుల్లో మీడియా ఉండడం, చెల్లింపు వార్తలు వంటివి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నాయి. 2జీ స్కాం, కామన్వెల్త్ క్రీడల్లో కుంభకోణం,రాజకీయ అవినీతి పట్ల పౌరసమాజం తీవ్ర అసంతృప్తిగా ఉంది. అవినీతి కేసులను తక్షణం పరిష్కరించడంలో న్యాయవ్యవస్థ విఫలమౌతోంది. దీంతో పౌరసమాజంలో అసంతృప్తి, సామాజిక అశాంతి పెరుగుతోంది. ఈ పరిణామం ప్రజా ఉద్యమాలకు దారితీస్తోంది. దేశరాజధానిలో జరిగిన నిర్భయ వంటి ఉదంతాలు పౌరసమాజంలో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. కేసులు విచారణలో ఉన్న సమయంలో ఏళ్లుగా నిందితులు జైళ్లలో మగ్గాల్సి వస్తోంది. ఈ కోవలో ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఉంటున్నారు. వ్యవస్థలో సంస్కరణల ద్వారానే దీన్ని చక్కదిద్దవచ్చు. - శేఖర్‌గుప్తా, ప్రముఖ పాత్రికేయుడు మహిళలపై ఆగని అఘాయిత్యాలు మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. వారిపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా ఒకవైపు ఏళ్లతరబడి పోరాటాలు కొనసాగుతున్నా..మరోవైపు ఢిల్లీ ‘నిర్భయ’ లాంటి సంఘటనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. వేధింపులు, గృహ హింస పేట్రేగిపోతోంది. వీటిని అరికట్టేందుకు, మహిళా హక్కుల సాధనకు స్త్రీలోకం నడుం బిగించాలి. - కల్పన కన్నాభిరాన్, సామాజిక కార్యకర్త విత్తనసంస్థల గుత్తాధిపత్యం నిరోధించాలి దేశంలో వ్యవసాయర ంగాన్ని శాసిస్తున్న బడా కార్పొరేట్ విత్తన సంస్థల గుత్తాధిపత్యం నుంచి వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలి. వ్యవసాయ రంగ సంక్షోభాన్ని నివారించేందుకు పటిష్ట చట్టాలు అవసరం. రైతులను ఆదుకునేందుకు ఇన్పుట్ సబ్సిడీలను అమెరికాకు దీటుగా పెరగాల్సిన ఆవశ్యకత ఉంది. జన్యుమార్పిడి పంటల కారణంగా ఆహారంలో పోషకవిలువలు లోపించడంతోపాటు దేశీయ వ్యవసాయ రంగం కుదేలవుతోంది. సేంద్రీయ వ్యవసాయంతో పర్యావరణ పరిరక్షణ,జీవవైవిధ్య పరిరక్షణ, మానవ ఆరోగ్య పరిరక్షణ సాధ్యపడుతుందని గుర్తెరగాలి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల పర్యావరణ హననంతోపాటు రైతులకు సేద్యపు ఖర్చులు అనూహ్యంగా పెరిగి అప్పుల పాలవుతున్నారు. దేశంలో గత దశాబ్దకాలంగా సుమారు మూడు లక్షల మంది అన్నదాతల ఆత్మహత్యలకు కారణం ఇదే. విత్తనోత్పత్తిలో స్వావలంభన కోసం కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - వందనా శివ, పర్యావరణ ఉద్యమకారిణి భవిష్యత్తు మెట్రోలదే 2020 నాటికి దేశంలో పట్టణాల్లో నివసించే వారి సంఖ్య 50 కోట్లకు చేరుకుంటుంది. ఇంత పెద్ద జనాభా రవాణా అవసరాలను తీర్చేందుకు మెట్రో రైలు వ్యవస్థలే చక్కటి పరిష్కారం. దేశంలో మిలియన్ జనాభా దాటిన 53 నగరాల్లో ఈ ప్రాజెక్టుల ఆవశ్యకత ఉంది. వాటి నిర్మాణం ఖర్చుతో కూడుకున్నదే అయినా రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ఆ వ్యయాన్ని పూడ్చుకోవచ్చు. స్మార్ట్‌సిటీల నిర్మాణంతో దే శంలో పట్టణీకరణ వేగవంతం అవుతోంది. వలసలు, ఉద్యోగాలు, గృహవసతి, ప్రజారవాణా, పేదలకు ఇళ్ల నిర్మాణం, ప్రజోపయోగ పనులకు అవసరమైన స్థలాల లేమి, మంచినీటి వసతి, పారిశుద్ధ్యం, పర్యావరణ సమస్యలు, సాంస్కృతిక విలువలను పరిరక్షించడం, సుపరిపాలన, ట్రాఫిక్, పట్టణాల డిజైనింగ్ వంటి సమస్యలు సవాలుగా మారుతున్నాయి. వీటికి పరిష్కారాలను అన్వేషిస్తే ఛండీగఢ్ వంటి ప్రణాళికా బద్ధమైన నగరాలను నిర్మించడం అసాధ్యమేమీ కాదు. ఈస్ట్ చైనాలోని గిఫ్ట్‌సిటీ నమూనా పలు నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. - కె.టి. రవీంద్రన్, పట్టణీకరణ నిపుణుడు ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత మెరుగుపర్చాలి ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత మెరుగుపర్చేవిధంగా ప్రత్యామ్నాయ రాజకీయాలు రూపొందాలి. ఈ స్థాయికి ప్రజలు ఇంకా చేరుకోలేదు. ఆ దిశవైపు ప్రయాణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ విజయాలపై వర్తమాన రాజకీయ ప్రభావం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయ ఎజెండా కొంత మేరకు విజయం సాధించినా.. పూర్తి స్థాయిలో సత్ఫలితాలు ఇప్పటి వరకూ లేవు. ఢిల్లీలో ప్రత్యామ్నాయ రాజకీయాలు బలమైన శక్తిగా ఎదిగినప్పటికీ సవాళ్లు తట్టుకోక తప్పలేదు. ఎన్నికల్లో విజయం సాధించినా.. దానిని నిలబెట్టుకోవడమే బలమైన పరీక్ష. ప్రజలకుజవాబుదారీతనంగా సేవలు అందించాలి. - యోగేంద్ర యాదవ్, రాజకీయ విశ్లేషకుడు వ్యవస్థీకృత మార్పు అవసరం దేశంలో అన్ని రంగాల్లో వ్యవస్థీకృత మార్పులు అత్యావశ్యకం. ప్రణాళికా సంఘాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. ఇదే విషయాన్ని గత యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని స్పష్టం చేశారు. గత ముప్పైఏళ్ల కిందట కొన్ని అంశాలు అవినీతిమయంగా కనిపించక పోయినా వ్యవస్థలో మార్పుతో అవినీతి మయంగా మారినట్లు బహిర్గతమవుతోంది. ఐఏఎస్, ఐపీఎస్‌ల మాదిరిగా రాజకీయ నాయకులకు శిక్షణ సాధ్యం కాదు. వారికి ఎలాంటి అర్హతను గీటురాయిగా పెట్టలేం. ప్లానింగ్ కమిషన్ ప్రజా ప్రణాళిక రూపొందించే సమయంలో వారికి చేరువకావడానికి ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగినా అది సాధ్యం కావడం లేదు. ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు ప్రజలతో చర్చించినా.. నిజమైన ప్రజాభిప్రాయం మాత్రం ప్లానింగ్ కమిషన్‌కు అందడం లేదు. సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారీ వ్యవస్థ రెండు మాత్రం ఒకదానితో మరోదానికి పొసగడం లేదు. - ఆరుణ్మైరా, ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు