breaking news
Mankind Pharma
-
‘ఫ్లై దుబాయ్’ హీరోకు రూ.కోటి నజరానా..
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం క్రాష్ అవకుండా తన ప్రాణాలకు తెగించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు ప్రముఖ ఫార్మా సంస్థ మాన్‌కైండ్ ఫార్మా రూ.కోటి నజరానాను ప్రకటించింది. ఆయన ధైర్యసాహసాలను గుర్తిస్తూ ఈ మొత్తాన్ని కెప్టెన్ మచ్చార్, ఆయన కుటుంబానికి అందించనున్నట్లు సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ జునేజా లేఖ ద్వారా తెలిపారు.సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో కెప్టెన్ మచ్చార్ అసమాన తెగువను చూపించారు. సుమారు 33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లో కెప్టెన్ మచ్చార్‌తో కో-పైలట్ ఘర్షణకు దిగి తీవ్రంగా గాయపరిచాడు. ఈ క్రమంలో విమానం ప్రమాదం దిశగా తీవ్ర వేగంతో కిందికి దూసుకెళ్తుందని గమనించిన కెప్టెన్ మచ్చార్ అతి కష్టం మీద కాక్‌పిట్ తలుపు తెరవడంతో సిబ్బంది, ప్రయాణికులు లోపలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సహకరించారు. అనంతరం విమానం టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో సిబ్బంది సహా 182 మంది ప్రయాణికులు ఉన్నారు.ఈ ఘటనలో కెప్టెన్ మచ్చార్ చూపిన ధైర్యాన్ని ప్రశంసిస్తూ.. ‘సంక్షోభ సమయంలో ఆయన ప్రదర్శించిన ధైర్యం, సమయ స్ఫూర్తి, బాధ్యత ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేశాయని మాన్‌కైండ్ ఫార్మా ఎండీ రాజీవ్ జునేజా పేర్కొన్నారు. ఆయన కాపాడిన ప్రాణాల విలువను డబ్బును పోల్చలేమని, ఈ రూ.కోటి నజరానా తమ కృతజ్ఞతను వ్యక్తం చేసే చిన్న ప్రయత్నం మాత్రమేనని తెలిపారు.కాగా, ఈ ఘటనలో కెప్టెన్ మచ్చార్ పాత్రను భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన చూపిన తెగువ విమానంలో ఉన్నవారిని రక్షించడంలో కీలకంగా నిలిచిందని నెతన్యాహు పేర్కొన్నారు. -
కండోమ్స్ బిజినెస్: 50లక్షలనుంచి రూ. 43వేల కోట్లతో దడ పుట్టించిన బ్రదర్స్
ప్రముఖ కండోమ్ బ్రాండ్ మేన్‌కైండ్ ఫార్మా ఏప్రిల్ 25న ఐపీఓకు రానుంది. దేశీయంగా మేన్‌ఫోర్స్ కండోమ్‌లు, ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ డిటెక్షన్ కిట్ల విక్రయాలతో పాపులర్ బ్రాండ్‌గా పేరొందింది. మెడికల్ సేల్స్‌మెన్స్‌గా మొదలై రూ.43,264 కోట్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దిన జునేజా సోదరుల సక్సెస్ స్టోరీ.. ఢిల్లీకి చెందిన డ్రగ్ కంపెనీ, కండోమ్ మేకర్ మేన్‌కైండ్ ఫార్మా రూ. 4,326 కోట్ల పబ్లిక్ ఆఫర్‌ని ఏప్రిల్ 25న ప్రారంభించి, ఏప్రిల్ 27న ముగించడానికి సిద్ధంగా ఉంది. అనిశ్చిత ఆర్థికపరిస్థితుల మధ్య 2023లో ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన ఏడో ఐపీఓ ఇది. మెడికల్ సేల్స్మెన్లా ప్రయాణం మొదలుపెట్టి రూ. 43,264 కోట్లకు చేర్చారు రమేష్ జునేజా, రాజీవ్ జునేజా. జునేజా సోదరులుగా పేరొందిన వీరు ఒంటరిగానే మొదలు పెట్టారు. పట్టుదలతో, మొక్కవోని దీక్షతో కంపెనీని అద్భుత స్థాయికి తీసుకొచ్చారు. ముఖ్యంగా 90వ దశకంలో బాలీవుడ్ స్టార్లతో ఆకర్షణీయమైన ప్రకటనలతో మధ్య తరగతిని ఆకర్షించడంలో జునేజా సోదరుల మేనేజ్మెంట్ స్కిల్స్, కార్పొరేట్ వ్యూహం నిదర్శనంగా నిలిచింది. అతితక్కువ సమయంలోనే విక్రయాల్లో దూసుకు పోతూ దిగ్గజాలకు దడ పుట్టించారు. ఛైర్మన్ రమేష్ సీ జునేజా 1974లో కీఫార్మా అనే కంపెనీకి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశారు. ఆ తరువాత ఫార్మా దిగ్గజం లుపిన్‌లో ఎనిమిదేళ్లు పనిచేశారు. 1994లో తను స్థాపించిన కంపెనీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 1995లో తన సోదరుడు రాజీవ్ జునేజాతో కలిసి మేన్కైండ్ని ప్రారంభించారు. ఇందుకు వారి ప్రారంభ పెట్టుబడి రూ.50 లక్షలు మాత్రమే. 25మంది వైద్య ప్రతినిధులతో సంస్థను ప్రారంభించారు. ఇపుడు దేశవ్యాప్తంగా 25 తయారీ కేంద్రాలతో, 600 మందికిపైగా శాస్త్రవేత్తల బృందంతో పనిచేస్తోంది. అతిపెద్ద నెట్‌వర్క్‌తో నాలుగు యూనిట్లలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నడుపుతోంది. 2022లో ఫోర్బ్స్ డేటా ప్రకారం 34500 కోట్ల రూపాయల నికర విలువ జునేజా సోదరుల సొంతం. మేన్ కైండ్ ఫార్మా మార్కెట్ క్యాప్ రూ.43,264 కోట్లు. దేశీయ విక్రయాల పరంగా ఇది భారతదేశంలో నాలుగో అతిపెద్ద కంపెనీ. గత సంవత్సరం, డిసెంబర్ 2022 నాటికి, దాని ఏకీకృత లాభం రూ.996.4 కోట్లు. తొలి తొమ్మిది నెలల ఆదాయం రూ.6697 కోట్లు. మ్యాన్‌ఫోర్స్ కండోమ్ బ్రాండ్ రూ. 462 కోట్లకు పైగా దేశీయ విక్రయాలతో ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉందని పేర్కొంది. ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ కిట్ల విక్రయం రూ. 184.40 కోట్లు. ముఖ్యంగా కంపెనీ నెట్వర్క్ విస్తరణకు, విజయానికి కారణం కంపెనీ సీఈవోగా రాజీవ్ జునేజా. రమేష్ జునేజా సైన్స్ గ్రాడ్యుయేట్ కాగా, రాజీవ్ కాలేజీ డ్రాప్ అవుట్. అలాగే జునేజా సోదరుల మేనల్లుడు అర్జున్, ప్రొడక్షన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్యవేక్షిస్తుండగా. మరో మేనల్లుడు శీతల్ అరోరా, గైనకాలజీ, డెర్మటాలజీ డ్రగ్స్ మార్కెటింగ్ విభాగం లైఫ్స్టార్ను బాధ్యతలను చూస్తుండటం విశేషం.కంపెనీ వివిధ తీవ్రమైన, దీర్ఘకాలిక చికిత్సలకు సంబంధించి పలు ఫార్మ ఫార్ములేషన్స్తోపాటు, అనేక వినియోగదారు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఐపీఓ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ద్వారా 40,058,844 ఈక్విటీ షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్సీ రెండింటిలోనూ జాబితా చేయాలని ప్రతిపాదించింది. ప్రమోటర్లలో సహ వ్యవస్థాపకులు రమేష్ జునేజా , రాజీవ్ జునేజా, సీఈవో శీతల్ అరోరా, కెయిర్న్‌హిల్ CIPEF, కెయిర్న్‌హిల్ CGPE, బీజ్ లిమిటెడ్ ,లింక్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉన్నారు. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.1,026 1,080గా నిర్ణయించారు. కంపెనీ షేర్లు మే 3న ఇన్వెస్టర్లకు కేటాయించిన తరువాత మే 8న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టవుతాయి. Autism is a development disorder where children have problems with social communication and interaction, restricted or repetitive behaviors or interests. Let's learn more about Autism and bridge the gap created by social stigma. #AutismAwarenessDay #MankindPharma #ServingLife pic.twitter.com/5WPKIqvIUi — Mankind Pharma (@Pharma_Mankind) April 2, 2023


