breaking news
mandal parishad development officers
-
ఎంపీడీఓలకే ‘ఉపాధి’ బాధ్యతలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మండలస్థాయిలో ఉపాధి హామీ పథకం అమలు బాధ్యత ఇకపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులకే అప్పగిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి పేర్కొన్నారు. జీఓఎంఎస్ 15 ప్రకారం ఎంపీడీఓలను మండల ప్రోగ్రాం అధికారులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అన్నిశాఖల అధికారులతో గ్రామసభలు నిర్వహించి కొత్తగా కార్యక్రమాలు రూపొందించాలని వారిని ఆదేశించారు. అదేవిధంగా క్షేత్రసహాయకులు, మేట్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికలివ్వాలన్నారు. బుధవారం సచివాలయం నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్‌పీటర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో తీసుకుంటున్న చర్యలు వివరించారు. అనంతరం ఎంపీడీఓలతో సమీక్షించి వారికి పైఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ హరితహారం కింద మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా కోటి మొక్కలు నాటేలా లక్ష్యాన్ని నిర్దేశించినట్లు పేర్కొన్నారు. -
మిగిలేది ముగ్గురే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికల ఫీవర్ యంత్రాంగానికి తాకింది. మూడేళ్లు పైబడి జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం కలిగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో పాలనా యంత్రాంగంలో కలవరం మొదలైంది. ఇప్పటివరకు ఎన్నికలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న రెవెన్యూ అధికారులకే బదిలీలను పరిమితం చేసిన ఈసీ.. ఈ సారి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు(ఎంపీడీఓ), సబ్ ఇన్స్పెక్టర్లను కూడా బదిలీల జాబితాలో చేర్చడంతో అధికారవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే నెల పదో తేదీ నాటికీ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ నిర్దేశించింది. మే 31, 2014 నాటికి మూడేళ్లు పూర్తయ్యే అధికారులకు స్థానభ్రంశం కలిగించాలని ఈసీ మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని 33 మండలాలకుగాను 30 మండలాల ఎంపీడీఓలపై బదిలీల ప్రభావం పడనుంది.. గండేడ్, రాజేంద్రనగర్, హయత్‌నగర్ మినహా మిగతా మండలాల అభివృద్ధి అధికారులకు స్థానచలనం కలగనుంది. ఊహించని ఈసీ ఆదేశాలతో నివ్వెరపోయిన ఎంపీడీఓల సంఘం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎన్నికల కమిషనర్‌ను కోరాలని నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికలతో తమకు ప్రత్యక్ష సంబంధంలేనందున తమను బదిలీల నుంచి మినహాయించాలని అభ్యర్థించాలని సంకల్పించారు. మరోవైపు మూడేళ్లుగా జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్ల జాబితాను జిల్లా యంత్రాంగం రూపొందించింది.