breaking news
major relief
-
పాన్ కార్డు లేకుండానే ప్రాపర్టీ డీల్స్!
దేశంలో ఆస్తి లావాదేవీలకు సంబంధించిన కీలక నిబంధనల్లో మార్పులు చేయాలని ఆదాయపు పన్ను శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాన్ కార్డు నిబంధనలకు సడలింపు కల్పిస్తూ రూ.20 లక్షల లోపు ఉన్న ఆస్తి లావాదేవీలకు పాన్ అవసరం లేకపోవచ్చని ముసాయిదా ఆదాయపు పన్ను నియమాల్లో సూచించింది. ఈ ప్రతిపాదన కొత్త ఆదాయపు పన్ను పాలనలో భాగంగా తీసుకువచ్చిన మార్పులలో ఒకటి. ప్రస్తుతం ఇది ప్రజా సంప్రదింపుల దశలో ఉంది.ప్రస్తుతం ఎలా ఉందంటే.. ప్రస్తుత నియమాల ప్రకారం.. రూ.10 లక్షలకు మించిన విలువ కలిగిన స్థిరాస్తి కొనుగోలు లేదా విక్రయాల సమయంలో పాన్ నంబర్‌ను తప్పనిసరిగా కోట్ చేయాలి.కొత్త ప్రతిపాదన ఏమిటి?ముసాయిదా ప్రకారం.. రూ.20 లక్షల లోపు విలువైన ఆస్తి లావాదేవీలకు పాన్ అవసరం లేదు. రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు పాన్ తప్పనిసరి. ఈ మార్పు చిన్న స్థాయి ఆస్తి కొనుగోలుదారులకు, ముఖ్యంగా చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో గృహాలు కొనుగోలు చేసే వారికి ఉపశమనం కలిగించనుంది.గిఫ్ట్ డీడ్స్, జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాలకూ వర్తింపుసవరించిన ముసాయిదా ప్రకారం, పాన్ నిబంధన కేవలం కొనుగోలు, అమ్మకాలకే పరిమితం కాదు. స్థిరాస్తి బహుమతిగా బదిలీ, ఉమ్మడి అభివృద్ధి ఒప్పందాలకూ వర్తిస్తుంది. ఇలాంటి లావాదేవీలకూ ఇదే రూ.20 లక్షల పరిమితి వర్తిస్తుంది. అంటే ఆస్తి విలువ రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అయితే మాత్రమే పాన్ తప్పనిసరి అవుతుంది.మార్పు వెనుక కారణంగత కొన్ని సంవత్సరాల్లో ఆస్తి ధరలు గణనీయంగా పెరిగాయి. అనేక నగరాల్లో సాధారణ ఇళ్ల ధర కూడా రూ.10 లక్షలను దాటిపోయింది. ఈ నేపథ్యంలో పాత పరిమితి ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు సరిపోవడం లేదని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ ప్రతిపాదన వల్ల చిన్న కొనుగోలుదారులపై పేపర్‌వర్క్ భారం తగ్గుతుంది. అఫర్డబుల్ హౌసింగ్ మార్కెట్లో లావాదేవీలు సులభతరం అవుతాయి. ప్రస్తుత రియల్ ఎస్టేట్ విలువలకు అనుగుణంగా నిబంధనలు మారుతాయి. ప్రత్యేకంగా టైర్-2, టైర్-3 నగరాల్లో గృహ కొనుగోలుదారులకు ఇది ప్రయోజనకరంగా మారుతుంది.అమలు ఎప్పుడు?ప్రస్తుతం ఇవి ముసాయిదా దశలోనే ఉన్నాయి. ప్రజల నుంచి, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడనుంది. అమల్లోకి వస్తే, చిన్న స్థాయి ఆస్తి కొనుగోలుదారులకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది. అదే సమయంలో, భారీ లావాదేవీలపై పారదర్శకతను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
టెల్కోలకు భారీ ఊరట
సాక్షి, న్యూడిల్లీ: ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం కంపెనీలకు ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించింది. 2020–21, 2021–22 సంవత్సరాల్లో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దీంతో భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో సంస్థలకు సుమారు రూ. 42,000 కోట్ల మేర ఊరట లభించనుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెల్కోలు..దాదాపు 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న సంగతి తెలిసిందే. -
ఎంపీ శశికళ పుష్పకు భారీ ఊరట
చెన్నై: లైంగిక వేధింపులు, హత్యకేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్పకు భారీ ఊరట లభించింది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు శశికళ కుటుంబంపై నమోదు అయిన కేసును బాధితులు ఎట్టకేలకు విత్ డ్రా చేసుకున్నారు. శశికళ భర్త లింగేశ్వర్ తిలకన్, ఆమె కుమారుడు ప్రదీప్ రాజా తనతో పాటు తన సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వారింట్లో పని చేసిన భానుమతి, ఝాన్సీరాణి అనే మహిళలు గతంలో తిరునల్వేలి జిల్లా తుత్తికుడి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా తమను ఇంట్లో నిర్భంధించి చిత్రహింసలు పెట్టారని బాధితులు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే శశికళ పుష్ప ... దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా గళం విప్పిన అనంతరం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పాటు, పెద్ద ఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పనిమనుషులు భానుమతితో పాటు ఝాన్సీరాణి కేసు విత్ డ్రా చేసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా లేఖ రాశారు. మరోవైపు రాజకీయంగా తనను, తన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికే వేధింపుల పేరుతో కుట్ర పన్నారని శశికళ పుష్ప ఆరోపించారు. కాగా ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీని చెంపదెబ్బ కొట్టడంతో శశికళ పుష్ప పార్టీ నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే.


