breaking news
Magnetic power
-
డాక్టర్ రోబో.. ఫైవ్ ఇన్ వన్!
కాలం మారిపోతోంది. ఒకప్పుడు కత్తులతో శరీరాన్ని కోసి చేసిన శస్త్రచికిత్సలు ఇప్పుడు చిన్న కోతలతో పూర్తవుతున్నాయి. మెరుగైన ఫలితాలిస్తున్నాయి. రోగులకు ఆ చిన్న కోతల బాధ కూడా లేకుండా చేసేందుకు సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ(ఎన్టీయూ) శాస్త్రవేత్తలు ఓ అద్భుతమైన రోబోను ఆవిష్కరించారు. శనగ గింజంత సైజుండే ఈ బుల్లి రోబో చేసే అద్భుతాలు అన్ని ఇన్నీ కావు.. పక్క ఫొటో చూశారా? అందులో శాస్త్రవేత్త చేతిలో కనిపిస్తున్న నల్లటి వస్తువే మన బుల్లి రోబో. దీని పొడవు 4.4 మిల్లీమీటర్లు. వైర్లూ, ఎల్రక్టానిక్స్, బ్యాటరీల్లాంటివి ఏవీ దీంట్లో ఉండవు. అయినప్పటికీ వైద్యుల సూచనల మేరకు శస్త్రచికిత్సలు చేసేస్తుంది. కణజాలాన్ని కోయడంతోపాటు శరీరంలో అవసరమైన చోటికి మందులు తీసుకెళ్లి వదిలిపెడుతుంది. కణజాలం లోపలి నుంచి సులభంగా ప్రయాణించగలదు. కేన్సర్ వంటి వ్యాధులకు సంబంధించి బయాప్సీ చేయాలనుకోండి.. ఈ రోబోను వదిలితే చాలు.. ఎంచక్కా కావాల్సిన కణజాలాన్ని కత్తిరించి పట్టుకొచ్చేస్తుంది. అవసరమైనప్పుడు శరీరం లోపల వేడి పుట్టించి కొన్ని రకాల చికిత్సలకు సాయంగా నిలుస్తుంది కూడా. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సెకన్ కాలంలో ఒక పని నుంచి ఇంకోరకమైన పనికి మారగలగడం దీని ప్రత్యేకత. అయస్కాంత శక్తి మహిమ వైర్లూ, బ్యాటరీల్లాంటివి లేకుండానే ఈ రోబో కేవలం అయస్కాంత శక్తితో పనిచేస్తుంది. ఇటీవలి కాలంలో ఈ ‘మ్యాగ్నెటిక్ మెడికల్ రోబోటిక్స్’కు ప్రాచుర్యం పెరుగుతోంది. రోబో శరీరం లోపల ఉంటే బయటి నుంచి వైద్యులు అయస్కాంతాల సాయంతో వాటిని కదలిస్తారు. ఇతర పనులు చేయిస్తారన్నమాట. అతి తక్కువ గాట్లూ, కోతలతో శస్త్రచికిత్సలను నిర్వహించేందుకు ఈ రకమైన రోబోలు బాగా ఉపయోగపడతాయని అంచనా. వీటితో సంప్రదాయ పద్ధతుల్లో చేరుకోలేని శరీరం లోపలి భాగాల్లోనూ సర్జరీలు చేయడం సులువు అవుతుంది. ఈ రకమైన రోబోలు ఇప్పటివరకూ ఏదో ఒక పని మాత్రమే చేయగలిగేవి. మందులు తీసుకెళ్లేందుకు ఒకటి.. కత్తిరించేందుకు ఒకటి ఇలా.. దేనికదే అన్నమాట. అయస్కాంత క్షేత్ర ప్రభావం రోబో మొత్తమ్మీద ఒకేరకంగా పడుతూండటం వల్ల ఒక రోబోతో వేర్వేరు పనులు చేయించలేకపోయే వారు. ఎన్టీయూ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ పరిమితిని అధిగమించగలిగారు. ఏడేళ్ల పరిశోధనలురోబోతో ఐదు రకాల పనులు చేయించేందుకు ఎన్టీయూ శాస్త్రవేత్తలు ఏడేళ్లుగా కృషి చేస్తున్నారు. వేర్వేరు కోణాల్లోంచి రోబోను అయస్కాంతీకరించడం, సాధారణ స్థితికి తీసుకురావడం ద్వారా గత అవరోధాలను విజయవంతంగా అధిగమించామని శాస్త్రవేత్త లుమ్ గుయో ఝాన్ తెలిపారు. ఒక్కో కోణంలో ఈ మార్పులు చేయడం ద్వారా ఒక్కో రకమైన పని చేయించేలా తాము రోబోలో ఒక మాగ్నెటిక్ రీప్రోగ్రామబుల్ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ బుల్లి రోబోలోని వేర్వేరు ప్రాంతాలు అయస్కాంతానికి భిన్న రీతుల్లో స్పందించేలా చేశామని, అయస్కాంత క్షేత్ర ప్రభావం ఈ ప్రాంతాలపై వేర్వేరుగా ఉంటుందని లుమ్ గుయో వివరించారు. సాఫ్ట్ రోబోటిక్స్‌లో విరివిగా వాడే పీడీఎంఎస్, ఎకోఫ్లెక్స్ వంటి పదార్థాలతో ఈ రోబోను తయారుచేశారు. పీడీఎంఎస్, ఎకోఫ్లెక్స్ అనేవి సిలికోన్ ఆధారిత పదార్థాలు. ఈ పదార్థంలోనే అక్కడక్కడ ఐదు మైక్రోమీటర్ల సైజున్న అయస్కాంత కణాలను ఏర్పాటు చేశారు. ఈ కణాల అమరిక, అయస్కాంతీకరణల ఆధారంగా రోబో కదలిక, పనులు ఆధారపడి ఉంటాయి. ఫైవ్ ఇన్ వన్ ఎలాగంటే... బయాప్సీ కోసం ఇందులో చిన్న బ్లేడ్ ఉంటుంది. రోబో గట్టిగా పట్టుకుంటే ఈ బ్లేడ్ కణజాలాన్ని కత్తిరించి తనలో దాచుకుంటుంది. బయటకు తీసుకొచి్చన తరువాత కణజాలాన్ని విశ్లేషించడం ద్వారా కేన్సర్ వంటి వ్యాధుల నిర్ధారణ జరుగుతుంది. మందులు పెట్టి రోబోను శరీరం లోపలికి పంపిస్తే ఆ రోబోనే ఔషధాన్ని శరీరంలోకి జొప్పిస్తుంది. ప్రత్యేకమైన అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించడం ద్వారా దీన్ని వేడెక్కించవచ్చు. అల్సర్ల వంటి వాటిని మాడ్చి మాన్పేందుకు ఉపయోగించవచ్చు. కేన్సర్‌కూ ఈ హైపర్ థెర్మియా పద్దతిని వాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కణజాలం మధ్య కదిలేందుకు ఈ రోబోకు దొర్లుకుంటూ వెళ్లే సామర్థ్యాన్ని కల్పించారు. దీంతో రోబో ఎటు కావాలంటే అటు వెళ్లిపోగలదు. కోడి లివర్‌లో, కృత్రిమ కణజాలం నమూనాల్లో ఈ రోబోను ఇప్పటికే పరిశీలించి సత్ఫలితాలు సాధించామని, మానవ చర్మకణాలతో ప్రయోగాలు జరిపి ఈ రోబో ద్వారా శరీరానికి హాని ఏదీ జరగదని నిర్ధారించుకున్నామని లుమ్ గుయో ఝాన్ తెలిపారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మార్స్ కొంప ముంచిన సౌర గాలులు
భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం(మార్స్)పై విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడికి వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు సైతం మొదలయ్యాయి. ఈ అరుణ గ్రహంపై కోట్లాది సంవత్సరాల క్రితం నీరు, వాతావరణం ఉండేవి. అవి క్రమేపి అంతరించిపోయాయి. మొత్తం శూన్యం ఆవరించింది. జీవుల మనుగడపై ఆస్కారమే లేకుండాపోయింది. మార్స్‌పై నీరు, వాతవరణం కనుమరుగైపోవడానికి కారణం ఏమిటన్నది ఎట్టకేలకు గుర్తించగలిగారు. బలమైన సౌర గాలులు, సౌర తుఫాన్ల కారణంగా అంగారక గ్రహం ఆయస్కాంత శక్తిని కోల్పోయినట్లు తేలింది. ఆయస్కాంత శక్తిని కోల్పోయిన తర్వాత అక్కడున్న ద్రవ రూపంలోని నీరు అంతరిక్షంలోకి ఆవిరైపోయింది. వాతావరణం సైతం నెమ్మదిగా అంతరించింది. దాంతో మార్స్ ఉపరితలంపై ఎర్రమట్టి దిబ్బలు, దుమ్ము, రాళ్లు మాత్రమే మిగిలాయి. మార్స్ అటా్మస్పియర్ వోలటైల్ ఎవల్యూషన్(మావెన్) మిషన్‌లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఈ విషయం కనిపెట్టింది. చాలా ఏళ్లుగా పరిశోధకుల మదిని తొలిచేస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లయ్యింది. సౌర గాలుల్లోని శక్తి కణాలు అంగారకుడి వాతావరణంలోకి చొచ్చుకెళ్లాయని, దాంతో నీరు ఆవిరైందని, తటస్థ కణాలు, అణువులు వాతావరణం నుంచి బయటకు వెళ్లిపోయాయని నిర్ణయానికొచ్చారు. ఈ పరిశోధన కోసం సోలార్ విండ్ అయాన్ అనలైజర్, న్యూట్రల్ గ్యాస్, ఐయాన్ మాస్ స్పెక్ట్రోమీటర్ ఉపయోగించారు. మార్స్‌పై ఒక భాగం పూర్తిగా వెలుతురు, మరో భాగం పూర్తిగా చీకటి ఉంటుంది. ఈ రెండు భాగాల సమగ్ర డేటా సేకరించారు. సౌర గాలులు, తుఫాన్లు అరుణ గ్రహం స్థితిగతులను పూర్తిగా మార్చేసినట్లు స్పష్టమయ్యింది. ఈ మొత్తం పరిశోధన వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ పత్రికలో ప్రచురించారు. అంగారకుడిపై మరింత అవగాహన పెంచుకోడానికి, భవిష్యత్తులో చేపట్టే పరిశోధనలకు ఈ వివరాలు దోహదపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఒకవేళ మార్స్‌పై నీరు, వాతావరణం యధాతథంగా ఉంటే అది మరో భూగోళంగా మనుషుల మనుగడకు తోడ్పడేదని మనం భావించవచ్చు. సౌర గాలులు, తుఫాన్లు అంగారకుడి కొంప ముంచడమే కాదు.. మన ఆశలనూ నీరుగార్చేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహిళ శరీరంలో అయస్కాంత లక్షణాలు.. ఈసారి మాత్రం
కోల్‌కతా: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాకా కొందరు తమ శరీరంలో అయస్కాంత లక్షణాలు కనిపిస్తున్నాయంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవలే నాసిక్‌కు చెందిన 71 ఏళ్ల అరవింద్ సోనార్ అనే వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అతడి శరీరం అయస్కాంతంలా మారిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా బెంగాల్‌కు చెందిన అనిమా నాస్కర్ (66)కు తన శరీరంలో అయస్కాంత లక్షణాలు కనిపించాయని పేర్కొన్నారు. అనిమా ఇటీవలే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ''నా శరీరంపై మెటాలిక్ వస్తువులు అతుక్కుంటున్నాయి. దీంతో డౌట్ వచ్చి నా కొడుకు ప్రయోగాలు చేశాడని.. నాకు ఆయస్కాంత లక్షణాలు ఉన్నట్లు తేల్చాడు. నా శరీరంలో అయస్కాంత శక్తికి కరోనా వ్యాక్సిన్ అని మాత్రం చెప్పలేను. ఈ లక్షణాలు ఎందుకు ఉన్నాయనే దానిపై రిపోర్ట్ రావాల్సి ఉంది.అప్పటివరకు నా శరీరం ఇలా కావడానికి కరోనా వ్యాక్సిన్‌ను తప్పుబట్టను.''అని చెప్పుకొచ్చారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనే దానిపై అనిమా తన కొడుకు సందీప్‌తో కలిసి అక్కడి లోకల్ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నారు. ఆ రిపోర్ట్‌లో వచ్చే దానిపై అసలు విషయం బయటపడనుంది. '' నేను వ్యాక్సిన్‌ను తప్పుబట్టను. ముందుల వల్ల శరీరంలో జరిగే మార్పులే ఇలాంటి వాటికి కారణం అని నేను భావిస్తున్నా.'' అని సందీప్ తెలిపాడు. అయితే మీకు అయస్కాంత లక్షణాలు ఉండడం చూసి భయపెడుతున్నారా అని అనిమాను అడగ్గా.. '' నేనేం భయపడట్లేదు.. కానీ అయస్కాంత లక్షణాల వెనుక ఉన్న కారణం తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నా'' అంటూ నవ్వుతూ పేర్కొన్నారు. చదవండి: Fact Check: వ్యాక్సిన్ తీసుకుంటే అయస్కాంత లక్షణాలు! US: కొవాగ్జిన్ తీసుకున్నారా.. మా దేశం రావచ్చు! -
వెలుగుల రేడు డేవిడ్!
అంతా అయస్కాంత శక్తి మహిమ..ఒక్కసారి 5 హెచ్‌పీ మోటారు రూ. 20 వేలతో కొనుక్కుంటే..ఇక రోజువారీగా రూపాయి ఖర్చు లేకుండానే..రోజుకు 24 గంటలూ పంటలకు నీటిని తోడుకోవచ్చు..!కరెంటువెలుగులను పొలాల్లోనూ, ఇళ్లలోనూ నిరంతరాయంగా వెలిగించుకోవచ్చు! అంతెందుకు.. చిన్న తరహా పరిశ్రమదారులు సైతం కరెంటు కొనుక్కోనక్కర్లేదు..!ఈ అద్భుత ఆవిష్కర్త అతి సామాన్య డ్రైవర్..పుస్తకాల చదువు ఐదో తరగతికి మించి లేదు.. అయితేనేం.. కొండంత ప్రజ్ఞాశాలి! కానీ, మోటారులో జనరేటర్‌ను జగమెరుగని రీతిలో జోరుగా తిప్పేయగల ఒడుపును పసిగట్టిన వాడు! అతడే.. డేవిడ్ రాజు!!జన్మను సార్థకం చేసే ఆవిష్కరణ వెనుక రాజీ ఎరుగని దశాబ్దాల కృషి దాగి ఉంది..! ఈ వెలుగుల రేడు మదిలోకి తొంగి చూద్దాం రండి.. సృజనాత్మక తృష్ణకు అకుంఠిత దీక్ష తోడు కావటంతో గొప్ప గ్రామీణ ఆవిష్కరణ వెలుగు చూసింది. రాజీ ఎరుగని ఓ జిజ్ఞాసువు చిరకాల స్వప్నం ఎట్టకేలకు ఫలించింది.పెద్దగా చదువు లేకపోయినా, మెండుగా వనరులు అందుబాటులో లేకపోయినా.. ఆయనలోని సృజనాత్మకత అద్భుత ఆవిష్కరణకు దోహదపడింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. ఎందరు ఈసడించినా.. నిరుత్సాహపడలేదు. అవిశ్రాంతంగా నీటిని తోడే అద్భుత అయస్కాంత మోటారును ఆవిష్కరించే వరకు విశ్రమించలేదు. అసాధారణమైన ఆ గ్రామీణ ఆవిష్కర్త పేరు.. దేవరపల్లి డేవిడ్‌రాజు (58)!చిన్నప్పటి నుంచీ మోటారు యంత్రాల పనితీరుపై ఉన్న గాఢమైన ఆసక్తే డేవిడ్‌రాజును ఇవాళ గొప్ప ఆవిష్కర్తగా నిలిపింది. విజయవాడలో ఆర్టీసీ డ్రైవర్‌గా ఇటీవలే రిటైరైన ఆయన తన చిరకాల స్వప్నాన్ని ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు. యంత్రాలపైనే దృష్టంతా.. కృష్ణా జిల్లా ముసునూరు మండలం వేలుపుచర్ల గ్రామంలో పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఆశీర్వాదం, జమాయమ్మ దంపతులకు కలిగిన ఆరో సంతానం ఆయన. పేదరికం వల్ల ఆయన చదువు స్థానిక బోర్డు స్కూల్లో ఐదో తరగతితో ఆగిపోయింది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనప్పటికీ ఆయన దృష్టంతా యంత్రాలపైనే ఉండేది. చెక్క రేడియోలను విప్పి చూడటం, బిగించటం వంటి పనులు చేసేవారు. మట్టితో యంత్రపు ఆకృతులు చేసేవారు. యంత్రాలపై జిజ్ఞాస కొద్దీ మోటారు మెకానిక్ పని నేర్చుకున్నారు. చెయ్యి తిరిగిన మెకానిక్‌లు పని చేస్తుంటే పక్కనే ఉండి తదేక దీక్షతో గమనించటం ద్వారా ఆ పనిలో నైపుణ్యం పొందారు. పరిశీలన ద్వారా గ్రహించిన జ్ఞానంతోనే అన్ని రకాల మోటారు వాహనాలను నడపటం నేర్చుకున్నారు. ఆ క్రమంలోనే ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరి, ఇటీవలి వరకు పనిచేశారు. గాలితో లారీ నడిపిన ఘనత ఆరేళ్ల క్రితం ఓ రోజు డేవిడ్ రాజు బస్సు నడుపుతుండగా మనసులో కొత్త ఆలోచన మెదిలింది. బస్సులో ఇంజిన్‌ను మరో విధంగా ఎందుకు నడపకూడదు? అనిపించింది. బోర్లు వేసేటప్పుడు బండరాళ్లను తొలవడానికి గాలి (కంప్రెషన్)తో రంధ్రాలు వేయటం సాధ్యమవుతున్నప్పుడు.. కంప్రెషన్‌తో బస్సును లేదా లారీని ఎందుకు నడపలేం..? అన్న ఆలోచన కలిగింది. ఆర్టీసీ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తూనే.. తన అన్వేషణ కొనసాగించారు. ఖాళీ సమయాల్లో ఇదే ఆలోచన ఆయన మదిని తొలిచేస్తూ ఉండేది. కాగితాలపై డిజైన్లు గీసి, చింపేసి కొత్తవి గీయటం.. అదే పనిలో గడిపేవారు. తన ఆలోచనను ఆవిష్కరించే క్రమంలో ఇక ఏ పనినీ పట్టించుకునే వారు కాదు. దీంతో.. బంధుమిత్రులు ఆయనకు పిచ్చెక్కిందని చమత్కరించేవారు. అయినా, వెనక్కి తగ్గని డేవిడ్ రాజు మిత్రుల తోడ్పాటుతో 2016 జనవరిలో డీజిలు, పెట్రోలు లేకుండా కేవలం గాలి(కంప్రెషన్)తో లారీని నడిపి చూపించారు. ఈ వాహనాల ద్వారా ఇంధన ఖర్చును, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చన్నది ఆయన అభిప్రాయం. అప్పట్లో పత్రికల్లో, టీవీ చానెళ్లలో కథనాలు వచ్చాయి. అయినా, ఎటువంటి ప్రోత్సాహమూ లభించకపోవటంతో ఆర్థిక శక్తి లేక మిన్నకుండిపోయారు. తిరువూరు డిపోలో పనిచేసేటప్పుడు 2014లోనే గాలి(కంప్రెషన్)తో జీపును నడిపానని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే ప్రోత్సహించకపోగా ఆగ్రహం వ్యక్తం చేశారని డేవిడ్ రాజు వాపోయారు. మాగ్నెట్ మోటారు ఆవిష్కరణ.. నిరంతరాన్వేషణ క్రమంలో శక్తికి మించి సొంత డబ్బు ఖర్చవుతున్నా.. దేశానికి, రైతులకు ఉపయోగపడే ఆవిష్కరణ ఏదైనా చేయాలని డేవిడ్ రాజు తలచారు. భార్య సుగుణ, కుమార్తె బ్లెస్సీ ఆయనకు మద్దతుగా నిలిచారు. గత కొంతకాలంగా తన మిత్రుడు శ్రీను తోడ్పాటుతో గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ కృషి ఫలితంగానే 5 అశ్వ శక్తి(హెచ్.పి.) సామర్థ్యం కలిగిన అయస్కాంత శక్తితో నడిచే మోటారును ఆవిష్కరించి.. ఇటీవల ప్రయోగాత్మకంగా నడిపి చూపించారు. ఇంధన ఖర్చు లేకుండా, పర్యావరణ కాలుష్యం లేకుండా, పంట పొలాల్లో విద్యుత్తు షాక్ మరణాలు లేకుండా.. సాగు నీటి, విద్యుత్తు అవసరాలు తీర్చే ఈ అద్భుత ఆవిష్కరణను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేగలిగితే రైతులోకానికి, మొత్తం సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది. హ్యాట్సాఫ్ టు డేవిడ్ రాజు! గంటకు 3.67 యూనిట్ల విద్యుత్తు ఆదా! ► సాధారణ విద్యుత్తుతో నడిచే 5 హెచ్.పి. మోటారు గంట నడిస్తే 3.67 యూనిట్ల విద్యుత్తు ఖర్చవుతుంది. ► ప్రభుత్వం యూనిట్ రూ. 5 చొప్పున వెచ్చించి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నది. ఈ లెక్కన 5 హెచ్.పి. మోటారు గంట సేపు సాధారణ విద్యుత్తుతో నీటిని తోడితే రూ.18.35 ఖర్చవుతుంది. ► రోజుకు రైతు పది గంటల పాటు మోటారు నడిపిస్తాడనుకుంటే.. రూ. 183 రూపాయల విద్యుత్తు ఆదా అయినట్లే. ► అయస్కాంత విద్యుత్తుతో నడిచే మోటారుకు ఈ ఖర్చేమీ ఉండదు. అంతేకాదు.. రైతుకు అవసరమైన, సమయంలో దీన్ని నడుపుకోవచ్చు. విద్యుత్తు స్తంభాలు, లైన్ల ఖర్చు.. ఇతరత్రా ఖర్చులేవీ ఉండవు. అయితే, అయస్కాంతాలు తదితర యంత్ర పరికరాలు, బుష్‌ల అరుగుదల ఖర్చు మాత్రం ఉంటుంది. ► అయస్కాంత మోటారు వాడటం అంటే.. సాంకేతిక భాషలో చూస్తే.. ‘మాగ్నటిక్ ఎనర్జీ’ని ‘రొటేషనల్ ఎనర్జీ’గా వాడటం అన్నమాట. మాగ్నెట్ మోటారు ప్రత్యేకతలు.. అయస్కాంత మోటారు ఆవిష్కర్త డేవిడ్ రాజు అందించిన వివరాల ప్రకారం.. విద్యుత్తు, డీజిల్, పెట్రోల్, సౌరశక్తి వంటి ఎటువంటి ఇంధనం అవసరం లేకుండా కేవలం అయస్కాంత శక్తితోనే మోటారు నడుస్తున్నది. ప్రారంభంలో కొద్దిసేపు బ్యాటరీ అవసరం ఉంటుంది. తర్వాత గంటల తరబడి పనిచేస్తుంది. శబ్దం పెద్దగా ఉండదు. షాక్ కొట్టదు. కాబట్టి, షాక్ వల్ల ఎవరూ మరణించకుండా చేయొచ్చు. ఈ మోటారు ద్వారా నీటిని ఎన్ని వందల అడుగుల లోతు నుంచైనా తోడవచ్చు. ఈ మోటారును ఎంతకాలం వాడినా మరమ్మతులు రావని, ఆరు నెలలకోసారి స్వల్ప ఖర్చుతో రాగి బుష్లను మార్చుకోవటం తప్ప వేరే నిర్వహణ ఖర్చు ఏమీ ఉండదని చెబుతున్నారు. రూ. 20 వేలతో 5 హెచ్.పి. మోటారు ప్రస్తుతం 5 హెచ్.పి. మాగ్నెట్ మోటారును డేవిడ్ రాజు విజయవంతంగా నడిపిస్తున్నారు. దీని తయారీకి రూ. 20 వేలు ఖర్చయ్యిందన్నారు. ఎక్కడెక్కడి నుంచో విడిభాగాలను సేకరించి తయారు చేయటం వల్ల దీని బరువు 100 కిలోల వరకు ఉంటుందని, సొంతంగా తయారు చేసుకోగలిగితే 50 కిలోల బరువుకు తగ్గించవచ్చని ఆయన అంటున్నారు. పారిశ్రామికవేత్తలు లేదా ప్రభుత్వం ముందుకొస్తే సులభంగా ఎక్కడికైనా ద్విచక్రవాహనంపై తీసుకెళ్లగలిగేలా తయారు చేయాలన్నది తన లక్ష్యమని ఆయన అంటున్నారు. 10, 20 హెచ్.పి. సామర్థ్యం కలిగిన మోటార్లనైనా అయస్కాంతాలతో తయారుచేసి నిరంతరాయంగా వాడుకోవచ్చని డేవిడ్ రాజు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. బల్బులనూ వెలిగించవచ్చు.. మాగ్నెట్ మోటారుతో నీటిని తోడటంతోపాటు దీపాలను కూడా వెలిగించుకోవచ్చని డేవిడ్ రాజు తెలిపారు. నెల రోజుల పాటు తన ఇంటిలో దీపాలను మాగ్నెట్ మోటారుతో విజయవంతంగా వెలిగించానని వెల్లడించారు. రైతులు ఆనందంగా నిద్రపోవచ్చు ఏ ఇంధనమూ అవసరం లేకుండా అయస్కాంతాలతో నడిచే మోటారు నిరంతరాయంగా నడుపుకోవచ్చు. షాక్ కొట్టదు. ప్రాణం తీయదు. రైతుల కష్టాలు తీరిపోతాయి. ఇక ఆనందంగా నిద్రపోవచ్చు.. ఇళ్లలో విద్యుత్ జనరేటర్ మాదిరిగా కూడా ఈ మోటారును ఉపయోగించవచ్చు. మా ఇంట్లో నెల రోజులు వాడాను. గతంలో గాలితో జీపును, లారీని నడిపి చూపించినా ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నో ఏళ్లు తపనపడి, సొంత ఖర్చుతో మహా ప్రయత్నం చేశాను. నా కల ఇప్పటికి ఫలించింది. పారిశ్రామికవేత్తలు లేదా ప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్థికంగా తోడ్పాటునందిస్తే.. ఈ మోటార్ల విడిభాగాలన్నీ సొంతంగా తయారు చేసి రైతులకు తక్కువ ధరకే ఇవ్వాలన్నదే నా లక్ష్యం. తగిన ప్రోత్సాహం ఇస్తే ఎన్నో అద్భుతాలు సాధిస్తా.. వందల మందికి ఉపాధి చూపిస్తా..! – దేవరకొండ డేవిడ్ రాజు, గ్రామీణ ఆవిష్కర్త, విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్, విజయవాడ (డేవిడ్ రాజును 82973 65979 నంబరులో లేదా ఆయన మిత్రుడు వేపచెట్టు శ్రీనును 98481 95263 నంబరులో సంప్రదించవచ్చు) కథనం: సాగుబడి డెస్క్ ఇన్పుట్స్: తక్కెళ్లపాటి శివనాగిరెడ్డి, తాడేపల్లి రూరల్, సాక్షి, గుంటూరు జిల్లా -
చందమామే కీలకం
లండన్: భూమి అయస్కాంత శక్తి ప్రభావంలో చంద్రుడి పాత్ర అత్యంత కీలకమని, అంతేకాక ఇది సూర్యుడి లాంటి వాటి నుంచి వచ్చే రేడియేషన్ నుంచి ప్రాణులను కాపాడుతుందని పరిశోధనలో వెల్లడైంది. ఫ్రాన్స్‌కు చెందిన బ్లేజ్ పాస్కల్ వర్సిటీ, నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సంయుక్తంగా ‘గురుత్వాకర్షణ’పై అధ్యయనం నిర్వహించాయి. భూపరిభ్రమణం వల్ల ఈ అయస్కాంత శక్తి ప్రభావం ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.


