breaking news
Lucky Grahak Yojana
-
లక్కీ గ్రాహక్, డిజీ ధన్ షురూ
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్’సందర్భంగా లక్కీ గ్రాహక్ యోజన, డిజీ ధన్ వ్యాపార్ యోజన పథకాలను ప్రారంభించారు. ‘మొబైల్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వినియోగదారులు, వ్యాపారుల కోసం ఈ పథకాలు ప్రారంభిస్తున్నాం’అని ఆయన తెలిపారు. క్రిస్మస్ కానుకగా లక్కీ గ్రాహక్ కింద ఈ రోజు డ్రా ద్వారా 15 వేల మంది విజేతలకు వారి ఖాతాల్లో రూ. 1,000 జమ అవుతుందని, వందరోజులు అమలయ్యే ఈ పథకం కింద రోజూ 15 వేల మంది విజేతలకు వెయ్యి అందుతుందని చెప్పారు. అయితే మొబైల్ బ్యాంకింగ్, ఈ–బ్యాంకింగ్, రూపే కార్డు, యూపీఐ తదితరాలతో రూ. 50 నుంచి రూ. 3,000ల లోపు డిజిటల్ చెల్లింపులు చేస్తేనే ఇది వర్తిస్తుందన్నారు. ప్రతివారం లక్షల విలువైన నగదు బహమతి కూడా ఉంటుందన్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా కోట్ల రూపాయల అవార్డులిచ్చే మెగా బంపర్ డ్రా ఉంటుందని తెలిపారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే వ్యాపారుల కోసం వంద రోజుల నడిచే డిజీ ధన్ను తెచ్చామని, వారికి వేలాది అవార్డులు, పన్ను రాయితీ ఉంటాయని చెప్పారు. దేశంలో 30 కోట్ల రూపే కార్డులుండడంతో 30 కోట్ల మంది ఈ పథకాల కిందికి వచ్చారన్నారు. డిజిటల్ ఉద్యమాన్ని నల్లధనం, అవినీతి నిర్మూలనకు అనుసంధానించాలని కోరారు. -
భారీ స్థాయిలో బంగారం అక్రమాలు !
-
రద్దయిన నోట్లతో కనకాభిషేకం!
► దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో బంగారం కొనుగోళ్లు ► ఢిల్లీలో ఇంతవరకు రూ. 650 కోట్ల అమ్మకాలు న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లతో అక్రమార్కులు బంగారు పంట పండిస్తున్నారు. లెక్కల్లో చూపని ఈ డబ్బుతో నల్లకుబేరులు భారీగా బంగారాన్ని కొంటున్నారు. బులియన్ వ్యాపారులు పకడ్బందీగా ఈ నోట్లకు కనకపు కడ్డీలను అమ్ముకుని దర్జాగా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఆదాయపన్ను(ఐటీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జరిపిన దాడుల్లో కళ్లు తిరిగే స్థాయిలో అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఢిల్లీ ‘నోట్లకు బంగారం’ లావాదేవీలకు అడ్డాగా మారింది. ఇంతవరకు రూ. 650 కోట్లకు పైగా విలువైన ఇలాంటి అమ్మకాలను ఢిల్లీలో గుర్తించారు. తాజా దాడుల్లో.. ఢిల్లీలోని కరోల్ బాగ్, చాందినీ చౌక్ తదితర చోట్ల షాపులు, బులియన్ వ్యాపారుల ఇళ్లపై శుక్రవారం జరిపిన దాడుల్లో లెక్కల్లో చూపని రూ. 250 కోట్ల బంగారం అమ్మకాలు బయటపడ్డాయి. రద్దయిన నోట్లకు నలుగురు ట్రేడర్లు బంగారాన్ని అమ్మినట్లు అధికారులు గుర్తించారు. రద్దయిన నోట్లకు బంగారాన్ని అమ్మి, ఆ డబ్బును డొల్ల(షెల్) ఖాతాల్లో డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. ఇంతకుముందు.. నోట్ల రద్దు తర్వాత ఢిల్లీలోనే జరిపిన దాడుల్లో రూ. 400 కోట్ల లెక్కల్లో చూపని బంగారం అమ్మకాలు వెలుగు చూశాయి. ఇద్దరు దళారులను, ఇద్దరు బ్యాంకు మేనేజర్లను అరెస్ట్‌చేశారు. కాగా, బెంగళూరులో శుక్రవారం బులియన్ ట్రేడర్లు, నగల వ్యాపారుల షాపుల్లో, ఇళ్లలో జరిపిన దాడుల్లో రూ. 47 కోట్ల లెక్కచెప్పని ఆదాయం బయటపడింది. ఆగ్రాలో ఓ బులియన్ గ్రూపుపై జరిపిన దాడుల్లో.. లెక్కల్లో లేని 12 కోట్ల డబ్బు బయటపడింది. కేరళలో రూ.39 లక్షలు సీజ్ మలప్పురం: కేరళలో రద్దయిన నోట్లకు మార్పిడి చేసిన రూ. 39.98 లక్షల విలువైన 2000 కరెన్సీని జప్తు చేశారు. తిరూర్ వ్యాపారి షాబిర్ బాబు ఇంట్లో ఈ మొత్తం బయటపడింది. దళారిగా వ్యవహరించిన అలీని అరెస్ట్ చేసి, అతనికి షాబిర్ నోట్ల మార్పిడి కోసం ఇచ్చిన రూ. 3 లక్షల విలువైన రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు మీడియాలో చర్చించొద్దు.. అధికార నిర్ణయాలపై ఐటీ అధికారులు ట్విటర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వెబ్సైట్లలో చర్చించకూడదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదేశించింది. అధికార నిర్ణయాలతోపాటు, రహస్యంగా జరిపే అధికార భేటీల వివరాలపైనా కొందరు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారని, ఇకపై దీన్ని మానుకోవాలని స్పష్టం చేసింది. నేటి నుంచి ‘నగదు రహిత’ అవార్డులు నగద రహిత(డిజిటల్) చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన ‘లక్కీ గ్రాహక్ యోజన’, ‘డిజీ ధన్ వ్యాపార్ యోజన’ అవార్డులు ఆదివారం నుంచి 100 నగరాల్లో ప్రారంభం కానున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఏప్రిల్ 14న మెగా డ్రా నిర్వహిస్తారు. లక్కీ గ్రాహక్ యోజన కింద రోజూ 15 వేల మంది విజేతలకు రూ. 100 క్యాష్ బ్యాక్ ఇస్తారు. మరో పథకం కింద ప్రతివారం గెలిచిన వ్యాపారికి గిఫ్ట్లిస్తారు. 430 కేజీల బంగారాన్ని అక్రమంగా అమ్మేశారు! ప్రత్యేక రాయితీ పథకం కింద సుంకం కట్టకుండా దిగుమతి చేసుకున్న వందల కేజీల బంగారాన్ని ఓ సంస్థ అడ్డదారిలో అమ్మేసి అడ్డంగా దొరికిపోయింది. నోయిడా సెజ్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెజర్స్ శ్రీలాల్ కంపెనీ రూ. 140 కోట్ల విలువైన 430 కేజీల బంగారాన్ని అక్రమంగా అమ్మినట్లు రెవిన్యూ(డీఆర్ఐ) అధికారులు గురు, శక్రవారాల్లో జరిపిన దాడుల్లో బయటపడింది. ఈ కంపెనీలో, కంపెనీ అధికారుల ఇళ్లలో దాడులు జరిపి రూ. 2.60 కోట్ల నగదు(రూ. 12 లక్షల కొత్త నోట్లతో కలిపి), 15 కేజీల బంగారు నగలు, 80 కేజీల వెండిని సీజ్ చేశారు. నోట్లను రద్దు చేసిన నవంబర్ 8న ఈ కంపెనీ 24 కేజీల బంగారాన్ని కొని రద్దయిన నోట్లకు అమ్మినట్లు గుర్తించారు. -
డిజిటల్ చెల్లింపులకు బంపర్ డ్రా
లక్కీ గ్రాహక్ యోజన, డిజి–ధన్ వ్యాపార్ యోజనల్లో బహుమతుల వర్షం రోజూ 15 వేల మంది వినియోగదారులకు రూ.1000 చొప్పున బహుమతులు న్యూఢిల్లీ: దేశ ప్రజల్ని డిజిటల్ వైపు మళ్లించేం దుకు కేంద్రం గురువారం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులు చేస్తే బంపర్ డ్రాలు, మెగా డ్రాల రూపంలో వినియోగదారులు, వ్యాపారులకు భారీ ప్రో త్సాహకాలు అందించనున్నట్లు తెలిపింది. క్రిస్మస్ నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం కోసం రూ.340 కోట్ల మొత్తాన్ని వెచ్చిస్తున్నట్లు పే ర్కొంది. ఈ మేరకు వినియోగదారుల కోసం ‘లక్కీ గ్రాహక్ యోజన’, వ్యాపారుల కోసం ‘డిజి ధన్ వ్యాపార్ యోజన’లను డిసెంబర్ 25 నుంచి ప్రారంభిస్తున్నామని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. రూ. 50 నుంచి రూ. 3వేల మధ్య డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తే లక్కీడ్రా నిర్వహించి బహుమతులు అందిస్తామన్నారు. దేశానికి ఇది క్రిస్మస్ కానుక అని, డిసెంబర్ 25న మొదటి డ్రా, అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న మెగా డ్రా నిర్వహిస్తామని కాంత్ వెల్లడించారు. అవార్డుల కోసం డిజిటల్ చెల్లింపుల ఐడీల్లో కొన్నింటిని డ్రా ద్వారా ఎంపిక చేస్తారని, యూపీఐ, యూఎస్ఎస్డీ, ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ(ఏఈపీఎస్) ద్వారా జరిపిన కార్యకలాపాలు, రూపే కార్డులు లక్కీ డ్రాకు అర్హమని తెలిపారు. ప్రైవేట్ క్రెడిట్ కార్డులు, ప్రైవేటు కంపెనీల ఈ–వాలెట్ల ద్వారా చేసే కార్యకలాపాలకు ఈ పథకాలు వర్తించవని చెప్పారు. పేద, మధ్య తరగతి, చిన్న వ్యాపారుల్ని డిజిటల్ చెల్లిం పుల విప్లవంలో భాగస్వాములు చేసేందుకు వీటిని ప్రారంభిస్తున్నట్లు కాంత్ పేర్కొన్నారు. 2, 3 వారాల్లో 50 శాతం కొత్త కరెన్సీ వచ్చే 2–3 వారాల్లో కొత్త కరెన్సీ నోట్ల పంపిణీ గణనీయంగా పెరుగుతుందని ఆర్థిక శాఖ వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ గురువారం తెలిపారు. ఇంతవరకూ రూ. 5 లక్షల కోట్ల మేర రూ. 500, రూ. 2 వేల నోట్లు చెలామణీలోకి వచ్చాయని, నెలాఖరుకు రూ.15 లక్షల కోట్ల(రదై్దన నోట్ల మొత్తం)లో 50 శాతం చలామణీలోకి వస్తాయని చెప్పారు. రదై్దన నోట్ల డిపాజిట్ల వివరాల్ని మరోసారి పరిశీలించుకోవాలని, రెండు సార్లు లెక్కించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్బీఐ, బ్యాంకులకు సూచించినట్లు దాస్ చెప్పారు. రూ. 500 నోట్ల ముద్రణ, సరఫరా వేగవంతం చేశామని, 2 లక్షల ఏటీఎంల్లో కొత్త నోట్లకు అనుగుణంగా మార్పులు చేశామని ఆయన వెలడించారు. 80% వస్తే ఆంక్షల సడలింపు! కొత్త కరెన్సీ 80 శాతం చలామణిలోకి వస్తే నగదు ఉపసంహరణలపై ఆంక్షలు సడలించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ముందుగా సహకార బ్యాంకుల్లో, అనంతరం అన్ని వాణిజ్య బ్యాంకుల్లో ఆంక్షలు సడలిస్తామని చెప్పారు. పన్ను చెల్లింపులు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వ చెల్లింపులపై రద్దు చేసిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)ను బ్యాంకులకు రీఇంబర్స్ చేసేందుకు బడ్జెట్లో తగిన ఏర్పాట్లు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఎండీఆర్ చార్జీల కోసం బ్యాంకులు తమ క్లెయింలు ఆర్బీఐకు సమర్పించాలని సూచించింది. పరిమిత నగదు వ్యవస్థే లక్ష్యం: జైట్లీ డిజిటల్ కార్యకలాపాల వ్యయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు చర్యలు తీసుకుంటున్నాయని, పరిమిత నగదు ఆర్థిక వ్యవస్థే తమ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నగదు కార్యకలాపాలకు డిజిటల్ వ్యవహారాలు ప్రత్యామ్నాయం కాదని, ఇవి రెండూ సమాంతరంగా కొనసాగుతాయని చెప్పారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అంటే పరిమిత నగదు ఆధారిత వ్యవస్థ అని... ఏ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నగదు రహితం కాదన్నారు. ముంబైలో రూ. 10 కోట్ల స్వాధీనం ముంబై శివారు చెంబూరులో పోలీసులు ఒక వాహనం నుంచి రూ.10.10 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 10 కోట్లు రద్దైన 500 నోట్లు కాగా, రూ. 10 లక్షల విలువైన రూ. 2వేల నోట్లు దొరికాయని పోలీసులు తెలిపారు. పుణే జిల్లాలోని వైద్యనాథ్ అర్బన్ సహకార బ్యాంకు నుంచి నగదును పుణేకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. క్రిస్మస్ కానుక: మోదీ లక్కీ గ్రాహక్ యోజ న, డిజి–ధన్ వ్యాపా ర్ యోజనలు క్రిస్మస్ కానుకలని, డిజిటల్ చెల్లింపులకు ఇవి సాయపడే ప్రోత్సాహకాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. నగదురహిత లావాదేవీలను పెంచే దిశగా ఈ పథకాల ప్రకటన వ్యూహాత్మక అడుగని, నగదురహిత, అవినీతి రహిత భారతం సాధించేందుకివి ఊతమిస్తాయన్నారు. ‘యాక్సిస్’లో 60 కోట్ల అక్రమ నగదు నోట్ల రద్దు అనంతరం యాక్సిస్ బ్యాంకు బ్రాంచీల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నోయిడాలోని సెక్టార్ 51 యాక్సిస్ బ్యాంక్ శాఖలో 20 షెల్ కంపెనీలకు చెందిన రూ. 60 కోట్ల నగదును ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. షెల్ కంపెనీల డైరెక్టర్లు ఎవరనే కోణంలో విచారణ చేపట్టారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ. 600 కోట్ల విలువైన బంగారం కడ్డీల్ని నోయిడాలోని ఒక జ్యువెలరీ షాపు అమ్మిన కేసు విచారణలో భాగంగా ఈ వివరాలు వెలుగు చూశాయి. నోయిడా బ్రాంచ్‌లో బంగారం దుకాణానికి ఖాతాలున్నట్లు గుర్తించి విచారణ కొనసాగించడంతో షెల్ కంపెనీల బాగోతం బయటపడింది. ఇంతవరకూ దేశవ్యాప్తంగా యాక్సిస్ బ్యాంకుల్లో అక్రమాలపై 24 మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేశామని, 50 ఖాతాల్ని నిలిపివేశామని ఆ బ్యాంకు ప్రకటించింది. వినియోగదారులు, వ్యాపారులకు వేర్వేరుగా... లక్కీ గ్రాహక్ యోజన: డిసెంబర్ 25 నుంచి 100 రోజుల పాటు(ఏప్రిల్ 14 వరకూ) రోజు 15 వేల మంది వినియోగదారులకు రూ.1000 చొప్పున నగదు ప్రోత్సహకం అందిస్తారు. వారానికోసారి రూ. లక్ష, రూ.10 వేలు, రూ. 5 వేల చొప్పున 7 వేల మందికి అవార్డులిస్తారు. మెగా అవార్డు కింద ఏప్రిల్ 14న రూ. కోటి, రూ. 50 లక్షలు, రూ. 25 లక్షలు ఇస్తారు. డిజి–ధన్ యోజన: వారానికోసారి 7 వేల మంది వ్యాపారులకు రూ. 50,000, రూ. 5 వేలు, రూ. 2,500ల చొప్పున అవార్డులతో పాటు ఏప్రిల్ 14న వ్యాపారుల కోసం మెగా డ్రాలో రూ. 50 లక్షలు, రూ. 25 లక్షలు, రూ. 5 లక్షలు ఇస్తారు.