breaking news
love fails
-
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
కేపీహెచ్‌బీకాలనీ: ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్ధిపేట జిల్లా, ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఉప్పరపల్లి మహేందర్ (25) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అడ్డగుట్ట సొసైటీలోని హాస్టల్లో ఉంటున్నాడు.సోమవారం సాయంత్రం హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో హాస్టల్ నిర్వాహకుడు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమలో ఓడిపోవడమే తన మరణానికి కారణమని రాసి ఉన్న లెటర్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు పై పడిన సెల్‌ఫోన్ తీసుకుంటుండగా...శామీర్‌పేట్: రోడ్డు పడిన సెల్ ఫోన్ తీసుకుంటుండగా కారు ఢీ కొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి జినోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సిద్దిపేట్ జిల్లా, మామిడ్యాల గ్రామానికి చెందిన పొట్ట ప్రవీణ్ (23), హైదరాబాద్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై రాజీవ్ రహదారి మీదుగా వెళుతుండగా తుర్కపల్లి గ్రామ సమీపంలో తన జేబులోంచి సెల్‌ఫోన్ రోడ్డుపై పడింది. దీంతో కిందపడిన సెల్‌ఫోన్‌ను తీసుకుంటుండగా అదే సమయంలో నగరం నుంచి వేగంగా వచి్చన ఎర్టిగా కారు వెనక నుంచి అతడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. జినోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
దొడ్డబళ్లాపురం: ప్రేమ విఫలం కావడంతో ప్రేమికులు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కనకపుర తాలూకాలో చోటుచేసుకుంది. కనకపుర తాలూకా చాముండిపుర గ్రామానికి చెందిన ప్రేమికులు తమిళనాడు సమీపంలోని కావేరి నది ప్రవాహంలో హొగేనకల్ జలపాతం వద్ద విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా యువకుడు ఉమేశ్ (24) మృతిచెందగా, ప్రియురాలు (17)ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఉమేశ్, పీయూసీ ఫస్టియర్ చదువుతున్న గిరిజన మైనర్ బాలిక ప్రేమించుకున్నారు. విషయం తెలిసి పెద్దలు వ్యతిరేకించడంతో ఆగస్టు 9వ తేదీన ఇద్దరూ కనబడకుండా పోయారు. దీంతో వారు కోడిహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హొగేనకల్ ఫాల్స్ వద్ద ప్రేమికులు విషంతాగి ఆత్మహత్యాయత్నం చేశారని తెలిసి పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే ఉమేశ్ చనిపోయి ఉన్నాడు. అస్వస్థతకు గురైన బాలికకు ధర్మపురి ఆస్పత్రిలో చికిత్స అందించిన తరువాత బెంగళూరు కెంపేగౌడ ఆస్పత్రికి తరలించారు.