breaking news
Lease of farmers
-
ముందస్తు సాగు.. మహా జాగు
* రుణాలు అందక మొదలుకాని రబీ నాట్లు * 30 శాతమైనా పూర్తికాని నారుమడులు * నెలాఖరులోగా నాట్లు వేయడం కష్టమేనంటున్న అన్నదాతలు * రుణాలు అందకపోవడమే ప్రధాన కారణం ఏలూరు : గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది రబీ సాగు ముందుగానే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ నిర్ణరుుంచింది. ఈ మేరకు రైతులకు సూచనలూ చేసింది. క్షేత్రస్థారుులో మా త్రం ముందస్తు రబీ సాగుకు పరిస్థితు లు అనుకూలిం చడం లేదు. డిసెంబర్ 31లోగా నాట్లు పూర్తి చేయూలని అధికారులు తొందరపెడుతుండగా, ఆ సమయూనికి కనీసం నారుమడులైనా పూర్తిచేసే అవకాశాలు కనిపించడం లేదు. అన్నదాతకు అడుగడుగునా ఆటంకాలు ఎదురు కావడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. రుణాలేవీ రుణమాఫీ వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో రైతులకు పంట రుణాలు అందటం లేదు. ఇప్పటివరకు అధికారులు వ్యవసాయ రుణ ప్రణాళికను ఖరారు చేయలేదు. డీసీసీబీ ద్వారా ఏ మేరకు రుణాలు ఇస్తారో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నా. రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసే తతంగం జనవరి నెలాఖరు వరకు కొనసాగేలా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కనీసం ఒక్క రైతుకైనా బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చే అవకాశం లేదు. రుణమాఫీ సొమ్ములు ప్రభుత్వం నుంచి జమ అయితేనే కొత్తగా రుణాలిస్తామని బ్యాంకర్లు, సొసైటీ అధికారులు చెబుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి అరుుతే మరీ దయనీయంగా ఉంది. జిల్లాలో రెండు లక్షలకు పైగా కౌలు రైతులు ఉండగా, వారికి రుణాలు ఎప్పుడిస్తారు, ఎంత ఇస్తారనేది నిర్ణయం కాలేదు. నీటి లభ్యతపైనా అనుమానాలు గోదావరి డెల్టా పరిధిలో దాదాపు రెండున్నర లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు చేయూల్సి ఉంది. నూరు శాతం ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని అధికారులు, యంత్రాంగం చెబుతున్నా గత అనుభవాలను బట్టి చూస్తే అది సాధ్యమవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నారుు. గోదావరిలో నీటి లభ్యత తగ్గిపోతోందని, యుద్ధప్రాతిపదికన నారుమడులు వేసి ఈనెలాఖరు నాటికి నాట్లు పూర్తి చేసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో తీర్మానం సైతం చేశారు. ఆ దిశగా రైతులను సమాయత్తం చేసే పరిస్థితులు కనిపించడం లేదు. మార్చి నెలాఖరు నాటికి కాలువలకు నీటిని నిలుపుదల చేసి డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుండగా, ఆ సమయూనికి పంటలు పూర్తయ్యే అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు. నీరున్నా కృష్ణా డెల్టాకు ఇవ్వరేం కృష్ణా డెల్టా పరిధిలోని వరి చేలకు సాగునీరిచ్చే విషయంలో సర్కారు రైతులను వంచిస్తోంది. కృష్ణా నదిలో నీరున్నా రైతుల అవసరాలకు నీటిని విడుదల చేయడం లేదని, ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేస్తామని సర్కారు చెప్పడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కృష్ణా కాలువ కింద ఏలూరు, దెందులూరు, పెదపాడు మండలాల్లోని 50వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. రబీలో ఏటా ఇక్కడి భూములకు సాగునీరు అందించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. 30 శాతం నారుమడులు పూర్తి జిల్లాలో 4.60 లక్షల ఎకరాల్లో వరి సాగుకు 1.20 లక్షల హెక్టార్ల నారుమడి అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ 40 వేల హెకార్ల మేర నారుమడులు వేశారు. ఇదికూడా మెట్ట ప్రాంతంలోనే ఎక్కువగా ఉంది. ఈ నెలాఖరు నాటికైనా నారుమడులు పూర్తిస్థారుులో వేసే అవకాశం కనిపించడం లేదు. అలా చేయకపోతే జనవరి నెలాఖరు నాటికైనా నాట్లు పూర్తిచేయలేమని వ్యవసాయ శాఖ ఆందోళన చెందుతోంది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి కోతలు పూర్తరుుతే తప్ప డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టలేమని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అదును దాటితే డెల్టాలో వరి సాగుకు నీరివ్వలేమని చేతులెత్తేస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం ఈ నెలాఖరు నాటికి రబీ నాట్లు పూర్తి చేసేలా రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాది విత్తనాలు, ఎరువుల కొరత ఏ మాత్రం లేదు. అన్ని సవ్యంగానే ఉన్నాయి. పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఆకివీడు తదితర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు పడుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి కనీసం 50 శాతం విస్తీర్ణంలో అరుునా నాట్లు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటాం. - సారుులక్ష్మీశ్వరి, జేడీ, వ్యవసాయ శాఖ -
కౌలురైతు కష్టం దేవుడికే ఎరుక
‘కౌలు రైతుల కష్టాలు దేవుడికి ఎరుక’ అన్నట్టు సార్వా సీజన్ ముగుస్తున్నా ఇప్పటికీ కౌలు రైతులను పట్టించుకున్న నాధుడే లేరు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి వేరే చెప్పనవసరం లేదు. గుంటూరు జిల్లాలో కౌలు రైతులకు ఈ ఏడాది వందకోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా, కేవలం రూ. 53 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చిలకలూరిపేటరూరల్ : జిల్లా వ్యాప్తంగా లక్షల్లో ఉన్న కౌలు రైతులను ఈ ఏడాది ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఖరీఫ్‌లో అప్పులపాలయ్యారు. సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పెట్టుబడులకు అందినచోటల్లా అప్పులు చేశారు. ఏదో ఒక సమయంలో ప్రభుత్వం పట్టించు కోకపోతుందా అని ఆశించిన కౌలు రైతులకు నిరాశే ఎదురవుతోంది. చివరకు అప్పులే మిగిలేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు పంట రుణాలు అందించడం, వివిధ కారణాలతో పంటలను నష్టపోయిన కౌలుదారులను ఆదుకుని, తిరిగి సాగుకు ప్రోత్సహించే విధంగా 2011లో భూ అధీకృత రైతుల చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. దీని ద్వారా కౌలు రైతులను గుర్తించి కార్డులు అందజేయాలి. తద్వారా బ్యాంకు రుణం పొందే అవకాశం కల్పించాలి. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం కౌలు రైతుల పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. ఏదో మొక్కుబడిగా కౌలు రైతుల గుర్తింపు చేపట్టి చేతులు దులుపుకుంది. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నామమాత్ర సంఖ్యలో గుర్తింపు కార్డులు ఇచ్చి చేతులు దులుపుకోవడంతో కౌలు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో కేవలం 27వేల మంది మాత్రమే కౌలు రైతులు ఉన్నట్లు గుర్తించి భూ అధీకృత గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. వారిలో 212 మందికి ఒక్కొక్కరికీ రూ. 25వేలు చొప్పున మాత్రమే వివిధ బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించటం, రుణాల మంజూ రుకు బ్యాంకర్లు విముఖత వ్యక్తం చేయడంతో కౌలు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించి పెట్టుబడులకు అప్పులు చేశారు. ఖరీఫ్ ఆరంభంలో వాతావరణం అనుకూలించకపోవటం, వర్షా లు సక్రమంగా లేకపోవడం, పెరిగిన ఎరువుల ధరలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. సాగు పెట్టుబడులతోపాటే అప్పులూ పెరిగాయి. వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని సాగు చేపట్టారు. ఇప్పటికీ బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ఖరీఫ్ దిగుబడులతో అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక కౌలు రైతులు తలలు పట్టుకుంటున్నారు. కౌలు రైతులకు రుణ పంపిణీ జరిగిన తీరు .... సంవత్సరం కౌలు దారుల సంఖ్య రుణాల లక్ష్యం పంపిణీ చేసింది 2011-12 40,470 రూ 100 కోట్లు రూ 26 కోట్లు 2012-13 16,664 రూ 100కోట్లు రూ 20కోట్లు 2013-14 21,413 రూ 100కోట్లు రూ 12.31కోట్లు 2014-15 27,000 రూ 100 కోట్లు రూ 53 లక్షలు