breaking news
Lal Bahadur
-
జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక
ఈ నెల 22 నుంచి 25 వర కు ఉత్తరాఖండ్‌లో జరి గే స్టూడెంట్ ఒలింపిక్ జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు వరంగల్‌లో ని లాల్ బహుదుర్ కళాశాలలో ఇంటర్ ద్వితీ య సంవత్సరం చదువుతున్న ఉదయ్‌సింగ్ ఎంపికయ్యాడు. నల్గొండలో జరిగిన రాష్ట్ర స్థాయి స్టూటెండ్ ఒలింపిక్స్‌లో ప్రతిభ కనబర్చాడు. ఈ సందర్బంగా గురువారం కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ ప్రభాకర్ గౌడ్, రెజ్లింగ్ కమిటీ సభ్యులు రమణారెడ్డి, మొండ్రాతి సదానందం, రవీందర్, రాజేశ్వర్ రావు, బండి రజీనికుమార్, హరిణి, సతీష్ కుమార్, లలిత, రత్నాకర్ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు
జాతిపిత మహాత్మాగాంధీ, దివంగత ప్రధానమంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళి అర్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి చిత్రపటాలతోపాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి.. పుష్పాంజలి ఘటించారు. సుదీర్ఘ కాలం తర్వాత జగన్మోహన్రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడంతో అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసింది. గాంధీ, శాస్త్రి జయంతి వేడుకల్లో పార్టీ నాయకులు కొణతాల రామకృష్ణ, డీఏ సోమయాజులు, బాజిరెడ్డి గోవర్ధన్, వైవీ సుబ్బారెడ్డి, నల్లా సూర్యప్రకాష్, బి.జనక్‌ప్రసాద్, కె.శివకుమార్, వాసిరెడ్డి పద్మ, పీఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.