breaking news
labour rights
-
జీతం కావాలంటే ఇంటి వచ్చి నా కోరిక తీర్చు..!
‘సార్.. రెండు నెలల నుంచి జీతం ఇవ్వలేదు.. చిన్నపిల్లలతో ఉంటున్నాను..ఇల్లు గడవడం కష్టంగా ఉంది.. ఇప్పుడు అర్జంట్‌గా గ్యాస్ సిలిండర్ విడిపించాలి.. అడ్వాన్స్‌గా అయినా ఓ రెండు వేల రూపాయలు ఇవ్వండి..’ అంటూ శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగిని పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్టర్ వద్ద వేడుకుంది. ‘జీతం కావాలంటే ఇంటి వచ్చి నా కోరిక తీర్చు.. నిన్ను బాగా చూసుకుంటాను..’ అంటూ సదరు కాంట్రాక్టర్ లైంగిక వైధింపులకు దిగాడు.ఆలయం పారిశుద్ధ్య నిర్వహణ విభాగంలో ఇటీవల చోటుచేసుకున్న ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని కొద్ది రోజులుగా బయటకు రాకుండా ఉండేలా అటు కాంట్రాక్టర్ వర్గం, ఇటు కొందరు అధికార సిబ్బంది కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని నేరుగా ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ వద్ద ప్రస్తావించింది. అయినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోవడంతో తోటి ఉద్యోగుల మద్దతుతో శ్రీకాకుళం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే స్థానికంగా రాజకీయ ఒత్తిళ్లు కారణంగా చర్యలకు వెనుకాడుతున్నట్లు సమాచారం. ఏం జరిగిందంటే.. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో పారిశుద్ధ్య నిర్వహణ టెండర్‌ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక టీడీపీ నేతల జోక్యంతో గోవింద్ అనే వ్యక్తి టెండర్ దక్కించుకున్నాడు. ఆలయ సెక్యూరిటీ విభాగంతో పాటు పారిశుద్ధ్య సిబ్బంది వ్యవహారాలన్నీ ఈ టెండర్‌దారుని పరిధిలోకే వస్తాయి. రెండు నెలల నుంచి సెక్యూరిటీ సిబ్బందికి, పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది (స్వీపర్లు)కి జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ బ్బందులు పెడుతున్నాడంటూ ఆలయ ఈవోకు ఫిర్యాదులు అందాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి మాత్రం ఒక నెల జీతం చెల్లించి మిన్నకుండిపోయాడు. దీంతో స్వీపర్లు మరోసారి ఈవోకు వినతిపత్రం అందజేశారు. అదే సందర్భంలో తాను అడ్వాన్స్ ఇవ్వాలని అడిగితే.. అసభ్యంగా మాట్లాడినట్లుగా బాధితురాలు ఈవోకు రికార్డెడ్ ఎవిడెన్స్‌గా తన బాధను వివరించింది. రాజకీయ జోక్యంతో చర్యలకు దూరం..! స్థానికంగా కూటమి ప్రభుత్వం మద్దతుదారులు, టీడీపీ ముఖ్య కార్యకర్తలు ఏడాది కాలంగా ఆదిత్యాలయ టెండర్లలో జోక్యం చేసుకుని తమ వారిని పెట్టుకుని మేనేజ్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది టెండర్‌ను దక్కించుకున్న గోవింద్ ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాలతో పాటు పీఎఫ్ జమ విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యంగా ఉంటున్నట్లు సమాచారం. సిబ్బందిపై లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకున్నాక ఉద్యోగులు ఈవోకు, పోలీస్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోలేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చర్యలకు వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. ఇలాంటి ఫిర్యాదులుంటే కచ్చితంగా కాంట్రాక్టర్ టెండర్‌ను రద్దు చేసే అధికారం ఈవోకు ఉన్నా తాత్సారం జరుగుతుండటంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసభ్యంగా మాట్లాడాడు... రెండు నెలల జీతం కావాలంటే ఇంటికి రా..కోరిక తీర్చు అంటూ కాంట్రాక్టర్ గోవింద్ అసభ్యంగా మాట్లాడారు. ఇదే విషయం ఆలయ ఈవోకు చెప్పాను. ఆయన కాంట్రాక్టర్‌ను పిలిపించి మందలించారు. న్యాయం కోసం తోటి ఉద్యోగులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాం. నాలాంటి బాధితులు ఇంకా ఉన్నారు. కానీ భయంతో నోరు మెదపలేకపోతున్నారు. – బాధితురాలు ఫిర్యాదు అందింది.. పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్న గోవింద్‌పై పెండింగ్ జీతాల విషయంతో పాటు ఓ ఉద్యోగినిపై అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే పిలిపించి కాంట్రాక్టర్‌ను గట్టిగా మందలించి పంపించాను. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వారిని క్షమించేది లేదు. ఇప్పటికే పోలీసులకు బాధితులు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది. – కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ఈవో శ్రీకాకుళం: -
శ్రమజీవుల హక్కులకు భంగం
– అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య సమావేశం అలంపూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నూతన విధానాలతో శ్రమ జీవుల హక్కులకు భంగం వాటిల్లుతుందని తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బంటు శ్రీనివాస్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంఘటిత రంగాన్ని అసంఘటిత రంగంగా మార్చి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నాయన్నారు. కాంట్రాక్టు విధానాన్ని తీసుకొచ్చి కార్మికులను ఉగ్యోగంలోకి తీసుకోవడాన్ని కాంట్రాక్టర్లకు కట్టెబెట్టిందన్నారు. దీని వలన కార్మికులకు సమాన పనికి సమాన వేతనం లేకుండా చేసిందన్నారు. ఇదే విధానాలు ప్రభుత్వాలు అనుసరిస్తూ వారికి తక్కువ వేతనాలు ఇస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఉన్న చట్టాలలో 44 చట్టాలను నాలుగు విభాగాలుగా విభజించి వాటిని సవరణలు చేసి కార్మికుల హక్కులను కాలరాయలని చూస్తోందన్నారు. 15 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు సెప్టెంబర్ సమ్మెలో పాల్గొని తమ నిరసన గళం వినిపించారన్నారు. అయినా ప్రభుత్వం తన విధానాలను సమీక్షించుకుని ఉద్యోగ, కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించకపోగా కార్మిక వర్గంపై మరిన్ని దాడులకు తెగబడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసనగా 2016 సెప్టెంబర్ 2వ తేదిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, జర్నలిస్టు సంఘం రాష్ట్ర నాయకులు చిర్రా రవి, డీటీఎఫ్ నాయకులు రామ్మోహన్, శ్రీనివాస్, హరి నరోత్తమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సవరిస్తే సహించేది లేదు
వినాయక్‌నగర్: కార్మికుల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించడానికి పూనుకుంటే సహించేది లేదని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ అధ్యక్షతన సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల అనుంబంధ బీడీ కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 2న జరుగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తీర్మానించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను చైతన్య పర్చడానికి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.


