-
కుంగ్‌ఫూ, కరాటేలో జిల్లా ప్రతిభ
గుంటూరు స్పోర్ట్స్: విజయవాడలో ఈనెల 29వ తేదీన నిస్కిన్ మంక్ కుంగ్‌ఫూ అకాడమి ఆ«ధ్వర్యంలో జరిగిన రాష్టస్థాయి కుంగ్‌ఫూ, కరాటే పోటీలలో తమ క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబర్చి రెండు బంగారు, ఒక రజత, నాలుగు కాంస్య పతకాలు సాధించారని ఉషూ కుంగ్ ఫూ అకాడమి చీఫ్ ఇన్స్ట్రక్టర్ షేక్ సంధాని తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం బ్రాడీపేట మహిమ గార్డెన్స్‌లోని అకాడమిలో ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అండర్–12 స్పారింగ్ విభాగంలో ఎం.థామస్ బంగారు, ఎం.తరుణ్య కాంస్య పతకాలు సాధించారని తెలిపారు. 50 నుంచి 65 కేజీల స్పారింగ్ విభాగంలో కె.సాయిమౌళి బంగారు, ఎ.శేషసాయి కిరణ్ రజత, ఎస్.సాయి శాండిల్య, ప్రవీణ్ ఫ్రాన్సిస్, పీఎన్ఎస్ తేజస్వి కాంస్య పతకాలు సాధించారని చెప్పారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో క్రీడాకారులు, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. -
కుంగ్ ఫూలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
గుంటూరు స్పోర్ట్స్: జాతీయ స్థాయి ఉషూ కుంగ్ ఫూ పోటీలలో తమ అకాడమి క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించారని ది షావలిన్ కుంగ్ ఫూ అకాడమి మాస్టర్ సి.హెచ్ మస్తాన్ చెప్పారు. జాతీయ స్థాయి కుంగ్ ఫూ పోటీలలో బంగారు పతకాలు సాధించిన బి.దినేష్, ఎస్.సాయి శాండిల్య, కె.సాయి మౌళిలను గురువార స్థానిక లాడ్జి సెంటర్లోని ఏఎల్ బీఈడీ కళాశాల ఆవరణలోఅభినందించారు. ఈ సందర్భంగా కుంగ్ ఫూ మాస్టార్ మస్తాన్ మాట్లాడుతూ సెప్టెంబర్ 24, 25 తేదీలలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన ఉషూ కుంగ్ ఫూ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలలో రాష్ట్ర జట్టులో పాల్గొన్న వీరు బంగారు పతకాలు సాధించారని వివరించారు. విజేతలను కుంగ్ ఫూ మాస్టర్ షేక్ సంధాని, క్రీడాకారులు తదితరులు అభినందించారు. -
కుంగ్ ఫూ బ్రదర్స్
♦ ఆత్మరక్షణకు నేర్చుకుని.. శిక్షకుల స్థాయికి ఎదిగిన సోదరులు ♦ మరిన్ని మెలకువల కోసం చైనా వెళ్లిన ‘నర్సాపూర్’వాసులు నర్సాపూర్: ఒకప్పుడు ఆత్మ రక్షణ కోసం నేర్చుకున్న విద్యే.. ఇప్పుడు ఆ సోదరులను హీరోల్ని చేసింది. ప్రస్తుతం కుంగ్‌ఫూలో శిక్షణ ఇవ్వడమే వృత్తిగా పెట్టుకుని మాస్టర్లుగా స్థిరపడ్డారు. ఈక్రమంలో బ్లాక్‌బెల్ట్‌లో పలు డిగ్రీలు పొందారు నర్సాపూర్‌కు చెందిన పాముల శ్రీనివాస్, పాముల వినోద్. వీరిద్దరు 1994లో నిజామాబాద్‌కు చెందిన భూంరెడ్డి మాస్టర్ వద్ద కుంగ్ఫూను నేర్చుకోనారంభించారు. ప్రతిభ కనబరచడంతో సోదరులను మాస్టర్లుగా ఎదగాలని భూంరెడ్డి సూచించారు. దీంతో కుంగ్‌ఫూలో బ్లాక్‌బెల్టు సాధించి నర్సాపూర్‌తో పాటు హైదరాబాద్, పరిసర ప్రాంతాలు, పుల్కల్, సంగారెడ్డిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచే శారు. ప్రాక్టీస్‌తో ఉన్నత స్థితి శిక్షణ కేంద్రంలో చేరినవారికి శిక్షణ ఇస్తూనే ఇన్నదమ్ములు ప్రాక్టీస్ చేస్తున్నారు. పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. గత ఏడాది నవంబరులో ముంబైలో యూఎస్ గ్రాండ్ మాస్టర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ డిష్ కుంగ్‌ఫూ ఫెడరేషన్ నిర్వహించిన పోటీల్లో అన్నదమ్ములు కుంగ్‌ఫూలో బ్లాక్‌బెల్టు విభాగంలో అవార్డులు పొందారు. శ్రీనివాస్ కుంగ్‌ఫూలో బ్లాక్బె ల్ట్ 9వ డిగ్రీ, వినోద్ 8వ డిగ్రీ కైవసం చేసుకున్నారు. తమ వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు సైతం ముంబై జరిగిన పోటీల్లో అవార్డులు సాధించారు. 9వ డిగ్రీ సాధించిన శ్రీనివాస్‌కు సీనియర్ కరాటే మాస్టర్ చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లో సర్టిఫికెట్ అందజేశారు. ఇటీవల చైనాకు పయనం కుంగ్‌ఫూలో మరిన్ని మెలకువలు నేర్చుకునేందుకు అన్నదమ్ములు ఇటీవల చైనాకు వెళ్లారు. తమ వద్ద కుంగ్‌ఫూ చేర్చుకొని బ్లాక్ బెల్టులో 4వ డిగ్రీ పొంది.. మాస్టర్‌గా స్థిరపడిన డి.సుబ్బు సైతం చైనా వస్తున్నాడని చెప్పారు. చైనాలో షావోలిన్ టెంపుల్ ఏరియాలో కుంగ్‌ఫూలోని క్వాన్దావ్, రోప్డాట్ తదితర వెపన్స్, ఇతర విద్యలు నేర్చుకుంటామని, 15 రోజుల పాటు అక్కడే ఉంటామని కుంగ్‌ఫూ బ్రదర్స్ చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు !
ఒకసారి తిరిగి చూసుకోండి..
పార్టీలు మారుతున్న అభ్యర్థులు.. ఎంపీలను మార్చేస్తున్న ఓటర్లు!
అలాంటి పాటలంటే నాకు ఇష్టం లేదు.. కానీ: సుకుమార్
కేరళలో విజృంభిస్తున్న వెస్ట్ నైలు జ్వరం కేసులు! ఎందువల్ల వస్తుందంటే..
రాయల్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ఢిల్లీ!
SRH Vs LSG: ప్లే ఆఫ్స్ రేసు.. రెండింటికీ కీలక మ్యాచ్
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం.. మండిపడ్డ బీజేపీ
ఇదే మరి మ్యాజిక్ అంటే.. 'జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్'
బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement