కుంగ్‌ ఫూలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ | Tallent in kungphu | Sakshi
Sakshi News home page

కుంగ్‌ ఫూలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

Sep 29 2016 8:22 PM | Updated on Sep 4 2017 3:31 PM

కుంగ్‌ ఫూలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

కుంగ్‌ ఫూలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

గుంటూరు స్పోర్ట్స్‌: జాతీయ స్థాయి ఉషూ కుంగ్‌ ఫూ పోటీలలో తమ అకాడమి క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించారని ది షావలిన్‌ కుంగ్‌ ఫూ అకాడమి మాస్టర్‌ సి.హెచ్‌ మస్తాన్‌ చెప్పారు.

  
గుంటూరు స్పోర్ట్స్‌: జాతీయ స్థాయి ఉషూ కుంగ్‌ ఫూ పోటీలలో తమ అకాడమి క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించారని ది షావలిన్‌ కుంగ్‌ ఫూ అకాడమి మాస్టర్‌ సి.హెచ్‌ మస్తాన్‌ చెప్పారు.  జాతీయ స్థాయి కుంగ్‌ ఫూ పోటీలలో బంగారు పతకాలు సాధించిన బి.దినేష్, ఎస్‌.సాయి శాండిల్య, కె.సాయి మౌళిలను గురువార  స్థానిక లాడ్జి సెంటర్‌లోని ఏఎల్‌ బీఈడీ కళాశాల ఆవరణలోఅభినందించారు. ఈ సందర్భంగా కుంగ్‌ ఫూ మాస్టార్‌ మస్తాన్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 24, 25 తేదీలలో గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన ఉషూ కుంగ్‌ ఫూ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలలో రాష్ట్ర జట్టులో పాల్గొన్న వీరు బంగారు పతకాలు సాధించారని వివరించారు. విజేతలను కుంగ్‌ ఫూ మాస్టర్‌ షేక్‌ సంధాని, క్రీడాకారులు తదితరులు అభినందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement