breaking news
Kodada Urban
-
కాపాడబోయి.. కాళ్లు విరగ్గొట్టుకున్నాడు..!
సాక్షి, కోదాడ: ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న మహిళను కాపాడబోయిన ఓ యువకుడు తన రెండు కాళ్లు విరగ్గొట్టుకున్న ఘటన బుధవారం ఉదయం పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం శ్రీనవాసనగర్లోని తిపిరిశెట్టి రాజు ఇంట్లో కింది పోర్షన్లో తాటిపల్లి రమాదేవి (55) కొంత కాలంగా అద్దెకు నివాసం ఉంటుంది. భర్తతో దూరంగా ఉంటున్న ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం ఉదయం తన ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ విషయాన్ని గమనించి పై అంతస్తులో ఉన్న రాజు కుమారుడు ఆమెను కాపాడేందుకు పై అంతస్తు నుంచి కిందకు దూకి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. ఒకేసారి దూకడంతో ఆయన రెండు కాళ్లు విరిగాయి. రమాదేవి అప్పటికే 90 శాతం కాలిపోవడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమె పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పవన్‌ను కోదాడలో ఓ పైవేట్ వైద్యశాలకు తరలించి విరిగిన రెండు కాళ్లకు కట్లు వేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కోదాడ పట్టణ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గొలుసు కోసం గొంతు కోశారు..
సాక్షి, నల్గొండ/కోదాడ: పట్టణంలో గురువారం దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. స్థానికంగా బాలాజీ నగర్లో నివాసముండే లక్ష్మీ (50) అనే మహిళను గొంతుకోసి హతమార్చారు. మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలో ఉన్న బంగారు నగలను చోరీకి యత్నించారు. అయితే మహిళ మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లే క్రమంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో గొంతు కోసి ఈ అఘయిత్యానికి పాల్పడ్డారు. రక్తపు మడుగులో పడివున్న లక్ష్మీని కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించగా దారిలోనే ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు మాట్లాడుతూ.. తమకు ఎవరిపై అనుమానం లేదని, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదంటూ విలపిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
దోపిడీ దొంగలు రెచ్చిపోయారు
-
మాయమైన రేషన్‌కార్డులు
కోదాడఅర్బన్, న్యూస్‌లైన్ :ఎన్నికల ముందు ప్రభుత్వాలు లెక్కకు మించి తెల్లరేషన్ కార్డుల జారీకి ఆమోదం తెలుపుతుంటాయి. కానీ, ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో కొత్తకార్డులు ఇవ్వనేలేదు. ఉన్న కార్డులే ఎగిరిపోవడంతో ఎందరో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. కోదాడ నియోజకవర్గంలోనే సుమారు 2000 రేషన్ కార్డులు గల్లంతయ్యాయి. ప్రస్తుతం వాటి వివరాలు ఆన్లైన్లో కూడా లభించడం లేదు. కోదాడ పట్టణం, మండలం తో పాటు నడిగూడెం మండలాల్లో అధిక సంఖ్యలో రేష న్ కార్డుల వివరాలు లేకుండాపోయాయి. ఒక్క కోదాడ పట్టణంలోనే సుమారు 1200 కార్డులు మాయమయ్యాయి. కోదాడ, నడిగూడెం మండలాల్లో సుమారు 300 చొప్పున గల్లంతయ్యాయి. చిలుకూరు, మునగా ల, మోతె మండలాల్లో కూడా కొద్ది మొత్తంలో కార్డుల వివరాలు గల్లంతయ్యాయి. ఏప్రిల్ నెలలో రేషన్ బియ్యాన్ని పొందిన కొన్ని కార్డులకు అధికారులు మేనెలలో బియ్యం, ఇతర సరుకుల పంపిణీని నిలిపివేశారు. కాగా రద్దయిన వాటిలో తెల్లరేషన్ కార్డులతో పాటు అంత్యోదయ అన్న యోజన కార్డులు అధిక మొత్తంలో ఉన్నాయి. మేనెలలో రేషన్ డీలర్లు బియ్యం ఇవ్వకపోవడంతో రేషన్ బియ్యాన్ని నమ్ముకున్న పేదలు తీవ్ర ఇబ్బ ందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల వల్లే తమ కార్డులు రద్దయ్యాయని కార్డుదారులు ఆరోపిస్తుండగా, రేషన్ కార్డులు ఎందుకు రద్దయ్యాయో తమకు తెలియదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తామంతా సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో నిమగ్నమయ్యామని, తమకు ఈ విషయం తెలియదని అధికారులు చెబుతున్నారు. దీనితో కార్డులు రద్దయిన వారు మరింతగా ఆందోళన చెందుతున్నారు. ఆధార్ అనుసంధానం కార్డులే ఎక్కువ.. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం నిర్వహణలో భాగంగా తెల్లరేషన్ కార్డులతోపాటు ఇతర కార్డుదారులంతా ఆధార్ నంబర్‌తో తమకార్డులను అనుసంధానం చేసుకోవాలని అధికారులు కోరారు. తొలుత 2013, డిసె ంబర్ 31 వరకు గడువు విధించిన అధికారులు, తర్వాత మరోనెల గడువు పెంచారు. అయినా జిల్లాలో పూర్తిస్థాయిలో కార్డుదారులు ఆధార్‌తో కార్డులను అనుసంధానం చేసుకోలేకపోయారు. దీంతో ఫిబ్రవరి నెలలో ఆధార్ కార్డులు ఇవ్వని వారికి రేషన్ ఇవ్వలేదు. ఆందోళన చెందిన కార్డుదారులు అధికారులను ఆశ్రయించారు. దీనికి స్పందించిన డీఎస్ఓ ఆధార్ కార్డులతో సం బంధం లేకుండా కార్డుదారులందరికీ రేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. దీని తర్వాత రెండునెలలు సక్రమంగా నడిచినా ఇప్పుడు మళ్లీ కొన్ని రద్దయ్యాయి. రద్దయిన వాటిలో ఆధార్ అనుసంధానం జరిగినవే ఎక్కువగా ఉన్నాయని రేషన్ డీలర్లు పేర్కొంటున్నారు. తాము ఆధార్ నంబర్ అనుసంధానం చేయి స్తే, తమ రేషన్ కార్డులు ఎందుకు రద్దయ్యాయో చెప్పాలని వారు తమతో వాగ్వాదానికి దిగుతున్నారని డీలర్లు వాపోతున్నారు. అధికారులు స్పందించి కార్డుదారులకు జూన్ నెలలో రేషన్ సక్రమంగా అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. బియ్యం ఇవ్వక పస్తులుంటున్నం మా కుటుంబానికి అంత్యోదయ కార్డు ద్వారా రేషన్ బియ్యం వచ్చేయి. నిరుపేదలైన మాకు ఆ బియ్యమే దిక్కు. మాకార్డు రద్దయిందని ఈనెలలో బియ్యం ఇవ్వలేదు. దీంతో మేము పస్తులుండాల్సి వస్తుంది. - పొదిల సామ్రాజ్యం, కోదాడ