బాలీవుడ్ నిర్మాతల హత్యకు మాఫియా కుట్ర
ముంబై: ఒకప్పుడు ముంబై మహానగరాన్ని, ముఖ్యంగా బాలీవుడ్‌ను వణికించిన మాఫియా మరోసారి పడగ విప్పింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలను చంపేందుకు కుట్ర పన్నింది. పోలీసులు ఈ కుట్రను ఛేదించడంతో ముప్పు తప్పింది.
బాలీవుడ్లో ప్రముఖ నిర్మాతలైన సోదర ద్వయాన్ని హత్య చేసేందుకు రవి పూజారి గ్యాంగ్ కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. రవి పూజారి గ్యాంగ్‌కు చెందిన 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.