breaking news
kid missing
-
ఓరి.. భడవా! అమ్మ తిట్టిందని..18 కి.మీ నడిచి వెళ్లి..
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో శుక్రవారం అదృశ్యమైన 9 ఏళ్ల బాలుడు విష్ణువర్ధన్ ఆచూకీ లభించింది. పోలీసులు శనివారం బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. అయితే ఘటనలో బాలుడు ఎక్కడకు వెళ్లాడు? ఏమయ్యాడు? ఎలా దొరికాడనే విషయాలు తెలిస్తే.. వీడు పిల్లాడు కాదు.. పిడుగు అనిపిస్తుంది. టూటౌన్ సీఐ యుగంధర్ తెలిపిన వివరాలు.. ప్రశాంత్‌నగర్‌కు చెందిన గీత పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ పక్కింటి అబ్బాయితో గొడవపడటంతో తల్లి మందలించింది. దీంతో శుక్రవారం ఉదయం స్కూల్‌కు వెళుతున్నట్టు చెప్పి కనిపించకుండాపోయాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గాలింపు చేపట్టారు. ఇంటి నుంచి వెళ్లిన రోజు ఉదయం 9 గంటలకు ప్రశాంత్‌నగర్ నుంచి నడుచుకుంటూ గిరింపేట దుర్గమ్మ గుడి దాటినట్టుగా సీసీ కెమెరాల్లో గుర్తించారు. తవణంపల్లె మండలం దిగువ తడకరలో ఉంటున్న గీత తల్లిదండ్రులు కూడా శనివారం చిత్తూరుకు చేరుకుని పిల్లాడి కోసం వెతకసాగారు. ఇదిలా ఉండగా, విష్ణువర్దన్ నిన్న సాయంత్రానికే చిత్తూరు నుంచి దాదాపు 18 కి.మీ దూరంలో ఉన్న తవణంపల్లెలో దిగువ తడకర సమీపంలోని ఓ గ్రామానికి చేరుకున్నాడు. చీకటి పడడంతో అక్కడే ఓ ఇంటి వద్ద పడుకుని.. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దిగువ తడకరకు చేరుకున్నాడు. బాలుడిని చూసిన స్థానికులు వెంటనే విషయాన్ని గీత తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో పోలీసులు దిగువ తడకరకు వెళ్లి బాలుడిని సురక్షితంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లిపై కోపంతో విష్ణువర్ధన్ అంతదూరం నడుచుకుంటూ తన అమ్మమ్మ, తాత ఇంటికి ఎవరి సాయం లేకుండా వెళ్లడంపై పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. రెండుసార్లు తడకరకు బస్సులో వెళ్లిన విష్ణువర్దన్.. అక్కడక్కడా చూసిన కొండగుర్తులతో దిగువ తడకరకు నడిచి వెళ్లడం విశేషం. -
విశాఖలో చిన్నారి అదృశ్యం కలకలం
విశాఖపట్నం: విశాఖలో చిన్నారి(6) అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని దేవరాపల్లికి చెందిన ఆరేళ్ల చిన్నారి దివ్య మంగళవారం స్కూలుకు వెళ్లింది. అయితే సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు చిన్నారి కోసం తెలిసిన వారి ఇళ్లల్లో, బంధువుల దగ్గర వాకబు చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో చేసేదేం లేక కుమార్తె అదృశ్యంపై కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిన్న స్కూలుకు వెళ్లిన తమ చిన్నారి దివ్య ఇప్పటివరకూ ఇంటికి తిరిగిరాలేదంటూ తమ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దివ్య మేనమామ శేఖర్‌ను అనుమానిస్తున్నారు. దాంతో అతడిని అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవరాపల్లిలో పాప ఆచూకీ కోసం జాగిలాలతో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. -
విశాఖలో చిన్నారి అదృశ్యం కలకలం
-
పాప అదృశ్యం.. బంధువుల ఆందోళన
నిజామాబాద్ టౌన్: నిజామాబాద్ టౌన్ లోని పవన్నగర్కు చెందిన అనిత అనే మహిళ తన పాపకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆ పాపను ఎత్తుకెళ్లి పోయారు. డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ పాప అదృశ్యమైందని బంధువులు శుక్రవారం నాడు ఆందోళనకు దిగారు. పాప కనిపించకుండా పోయినప్పటి నుంచి వారి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఆరురోజుల పాప నిన్న(గురువారం) సాయంత్రం అదృశ్యమైన సంగతి తెల్సిందే.