Kavitha Kalvakuntla tweet
-
వైఎస్ జగన్‌కు ప్రముఖుల శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టినరోజు సందర్భంగా వైఎస్ జగన్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు న్నా’ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం ట్వీట్ చేశారు. ‘ వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా నా శుభాకాంక్షలు’ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు, ‘యువనేత వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. ‘జగన్ ఆయురారోగ్యాలతో, నిండునూరేళ్లు జీవించాలని మనçస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని మంత్రి గంటా ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత ‘జగనన్నా.. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిడే’ అని శుభాకాంక్షలు తెలిపారు. ‘వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు, మీకు ఆ దేవుడు సుఖసంతోషాలతో కూడిన దీర్ఘాయుష్షును ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని ఇండియా టీవీ చీఫ్ ఎడిటర్, చైర్మన్ రజత్ శర్మ ట్వీట్ చేశారు. సినీ హీరో సుమంత్ కూడా వైఎస్ జగన్‌కు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ‘వైఎస్ జగన్ గారూ మీకు జన్మదిన శుభాకాంక్షలు.. మీకు ఏపీ ప్రజ లకు ఈ ఏడాది ప్రత్యేకంగా ఉంటుందని నేను చెబుతున్నాను’ అని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ తనకు శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ, సినీ ప్రముఖులకు, పార్టీ నాయకులకు, శ్రేణులకు, మీడియా సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఇంత ప్రేమ, ఆదరాభిమానాలు చూపించడం అదృష్టంగా భావిస్తున్నానని ట్వీట్ చేశారు. -
ఆంధ్ర పాలకుల పెత్తనం అవసరమా?
బోధన్‌రూరల్(బోధన్): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పర్కిరించకుండా తెలంగాణకు వచ్చి ఇక్కడ పెత్తనం చేయడం ఏమిటని నిజామాబాద్ ఎంపీ కవిత మండిపడ్డారు. తెలంగాణలో ఆంధ్రా పాలకుల పెత్తనం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు మద్దతుగా ఆమె ఆదివారం బోధన్ మండలంలోని అమ్దాపూర్, సంగం, కల్దుర్కి, జాడీజమాల్‌పూర్, సాలంపాడ్, సాలూర, హున్స, ఖజాపూర్, మందర్న, సాలూర క్యాంప్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ళల్లో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసి పాలనలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్నివర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమైందని కవిత చెప్పారు. గత ప్రభుత్వాలు రైతుల అభివృద్ధిని పట్టించుకోలేదని, కానీ, టీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం 24 గంటల కరెంట్, సకాలంలో విత్తనాలు, ఎరువుల సరఫరా, రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేసి అన్నదాతలకు అండగా నిలిచామన్నారు. మహిళా సంక్షేమం కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, అమ్మఒడి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు తీసుకొచ్చామని వివరించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో జాప్యమైందని, ఈసారి అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేస్తామని, స్థలాలు ఉన్న వారికి ఇళ్లు కట్టుకునేందుకు అర్థిక సాయం అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని కవిత పేర్కొన్నారు. చెరుకు రైతులకు రవాణా చార్జీలతో పాటు అదనంగా ధర చెల్లించామని, శనిగ పంటను సర్కారే కొని గిట్టుబాటు ధర కల్పించిందని చెప్పారు. కూటమికి బుద్ధి చెప్పాలి.. రైతుల అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్, టీడీపీ ఇప్పుడు మహాకూటమి పేరుతో రూ.2 లక్షల రుణమాఫీ అంటు మభ్యపెట్టాలని చూ స్తున్నారని ఎంపీ విమర్శించారు. చంద్రబా బును వెనకెసుకొని వస్తున్న కాంగ్రెస్‌కు ప్రజ లు ఓటుతో సరైన బుద్ధి చెప్పాలన్నారు. టిఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ నాయకత్వం ను బలపరచాలని ఆమె కోరారు. డీసీసీబీ చైర్మన్ గంగాధర్ పట్వారి, జెడ్పీ వైస్ చైర్పర్సన్ సుమనారెడ్డి, టీఆర్ఎస్ నేతలు మోహన్‌రెడ్డి, గిర్ధావర్ గంగారెడ్డి, సంజీవ్, షకీల్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర పాలకుల పెత్తనం అవసరమా? ఎడపల్లి: తెలంగాణలో ఆంధ్ర పాలకుల పెత్తనం అవసరమా అని ఎంపీ కవిత ప్రశ్నించారు. ఆదివారం కుర్నాపల్లి, ఎడపల్లిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె మాట్లాడుతూ.. 70 ఏళ్లలో చేయని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసుకున్నామని చెప్పారు. మహా కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు తెలంగాణకు నీళ్లు రానిస్తాడా? అని ప్రశ్నించారు. నేతలు ఉప్పు సంతోష్, మోహన్‌రెడ్డి, శ్రీరాం, ఎంపీపీ రజిత, రవీందర్‌గౌడ్, జక్కుపోశెట్టి, శ్రీనివాస్, ఇర్ఫాన్, మల్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గీత వచ్చేసింది
-
గీత వచ్చేసింది
న్యూఢిల్లీ: ఏడేళ్ల వయసులో పొరపాటున భారత్ సరిహద్దు దాటి దశాబ్ద కాలంగా పాకిస్తాన్లో నివసిస్తున్న మూగ, చెవిటి యువతి గీత(23) ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ విమాశ్రయానికి చేరుకుంది. స్వదేశానికి చేరుకున్న గీతకు ఆనందోత్సాహాల నడుమ ఘనస్వాగతం లభించింది. బాలికలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఎయిర్ పోర్ట్ కు తరలివచ్చి ఆమెకు స్వాగతం పలికారు. గీత తల్లిదండ్రులు, బంధువులు విమానాశ్రయానికి తరలివచ్చారు. గీత రాక పట్ల వారంతా సంతోషం వ్యక్తం చేశారు. కాసేపట్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కలవనుంది. పాక్‌లో ఆమె బాగోగులు చూస్తున్న స్వచ్ఛంద సంస్థలోని ఐదుగురు సభ్యులు కూడా భారత్‌కు వచ్చారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి అవి సరిపోలితే గీతను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. ఇస్లామాబాద్‌లోని భారత్ కార్యాలయం పంపిన ఫోటోలో నుంచి తన తండ్రి, తల్లి, సోదరీమణులను గీత గుర్తించడంతో ఆమెను స్వదేశానికి తీసుకువచ్చారు. కాగా, పాకిస్థాన్ నుంచి వచ్చిన గీతను రాజకీయ నేతలు స్వాగతించారు. గీత స్వదేశం చేరుకోవడం ఆనందకర పరిణామమని, ఆమెకు మంచి జరగాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.