breaking news
Karnataka Public Service Commission (KPSC)
-
కర్ణాటకలో ఐఏఎస్ అధికారి గంగ్వార్ అరెస్ట్
బెంగళూరు: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్(కేపీఎస్సీ) నిర్వహించిన వెటర్ననీ ఉద్యోగుల నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర గంగ్వార్‌ను ఆదివారం సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. సోమవారం ఆయన్ను కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కోరనున్నారు. ఈ కేసులో సీఐడీ అధికారులు గంగ్వార్‌ను శుక్ర, శనివారాల్లో విచారణ జరిపారు. అయితే, విచారణకు ఆయన సహకరించడం లేదని కస్టడీలోకి తీసుకున్నారు. 2024–2026 సంవత్సరాల్లో గంగ్వార్ కేపీఎస్సీ పరీక్షల కంట్రోలర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల విభాగం డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల ఈడీ గంగ్వార్ నివాసాల్లో తనిఖీలు జరిపింది. ఇటీవల గంగ్వార్ కనిపించకుండా పోయారంటూ వచి్చన వార్తలు సంచలనం రేపాయి. అయితే, గంగ్వార్ తన తండ్రికి సీరియస్‌గా ఉండటంతో సొంతూరు వెళ్లారంటూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే వివరణ ఇవ్వడం గమనార్హం. -
కొత్త నోటిఫికేషన్ వద్దు
కేపీఎస్సీ పోస్టుల వివాదంపై యథా తథ స్థితికి క్యాట్ ఆదేశం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ) ద్వారా ప్రొబేషనరీ గెజిటెడ్ ఆఫీసర్లుగా 2011లో ఎంపికైన 362 మందిని పరిగణనలోకి తీసుకోరాదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టి వేయడానికి కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) నిరాకరించింది. దీనిపై దాఖలైన పిటిషన్‌ను బుధవారం విచారణకు స్వీకరించిన సందర్భంగా పలు ఆదేశాలను జారీ చేసింది. కొత్త నియామకాలను చేపట్టకూడదని, అలాగే కొత్తగా నోటిఫికేషన్‌ను కూడా జారీ చేయకూడదని ఆదేశించింది. మూడు వారాల తర్వాత తదుపరి విచారణను చేపట్టనున్నట్లు తెలిపింది. కాగా కేపీఎస్సీ సభ్యులు అవకతవకలకు పాల్పడడం ద్వారా 362 మందిని ఎంపిక చేశారని ఆరోపణలు రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎంపికలో అక్రమాలు జరిగాయని తేలడంతో రాష్ర్ట ప్రభుత్వం కేపీఎస్సీ పంపిన 362 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను తిరస్కరించింది. దీనిపై ఎంపికైన అభ్యర్థులు ఇక్కడి ఫ్రీడం పార్కులో దీర్ఘకాలం ఆందోళన చేపట్టారు. తదుపరి న్యాయ పోరాటానికి దిగారు.


