breaking news
Karbonn Mobiles
-
రూ.12000 లకే కొత్త స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయ్..!
దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కార్బన్ (Karbonn) మళ్లీ మొబైల్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. రెబెల్ 5జీ, రెబెల్ ప్రో పేర్లతో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను భారత్‌లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్లకు సంబంధించిన వివరాలు అమెజాన్ ఇండియా మైక్రోసైట్లో ఇప్పటికే వెల్లడయ్యాయి. 2021లో కార్బన్ ఎక్స్21ను విడుదల చేసిన తర్వాత స్మార్ట్‌ఫోన్ విభాగంలో పెద్దగా కనిపించని ఈ సంస్థ.. కొత్త రెబెల్ సిరీస్‌తో తిరిగి వినియోగదారులను ఆకట్టుకోవాలని చూస్తోంది.రెబెల్ 5జీ ఫీచర్లుకార్బన్ రెబెల్ 5జీలో 6.75 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 650 నిట్స్ గరిష్ఠ బ్రైట్నెస్ ఉన్నాయి. ఇందులో 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. 18 వాట్ల యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంటుంది. బ్లూ, గోల్డ్, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.రెబెల్ ప్రోలో 120Hz డిస్ప్లేరెబెల్ ప్రోలో 6.7 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 20W ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. బ్లూ, బర్గుండీ, గోల్డ్, గ్రే రంగుల్లో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది.ఆండ్రాయిడ్ 16తో క్లీన్ సాఫ్ట్వేర్రెండు ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. రెండేళ్ల ఆండ్రాయిడ్ అప్గ్రేడ్లు, రెండేళ్ల భద్రతా నవీకరణలను అందిస్తామని కార్బన్ హామీ ఇచ్చింది. ముందుగా ఇన్స్టాల్ చేసిన అనవసర యాప్‌లు లేకుండా క్లీన్ సాఫ్ట్వేర్ అనుభవాన్ని అందించనున్నట్లు తెలిపింది. బాక్స్‌లో ఛార్జర్, యూఎస్బీ టైప్-సీ కేబుల్‌తో పాటు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.ధరలుకార్బన్ రెబెల్ ప్రో ధర రూ .12,499 కాగా, స్టాండర్డ్ రెబెల్ ధర రూ .11,999. ఈ రెండు మోడళ్లు నవంబర్ 4 నుండి అమ్మకానికి రానున్నాయి. ఆసక్తి ఉన్నవారు అమెజాన్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.ఇదీ చదవండి: జియో కొత్త చౌక రీచార్జ్ ప్లాన్లు వచ్చేశాయ్.. -
బీఎస్ఎన్ఎల్ నుంచి 4జీ ఫోన్.. ఇక అంతా చవకే!
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సొంత 4జీ మొబైల్ ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కార్బన్ మొబైల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇతర టెలికాం సంస్థల కంటే చౌకగా ఉండే కొత్త ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ టారిఫ్ రేట్లను పెంచడంతో మొబైల్ యూజర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. బీఎస్ఎన్ఎల్లో రీఛార్జ్ ప్లాన్లు చవగ్గా ఉండటమే ఇందుకు కారణం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మరింత మంది వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది. తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. అంతటితో ఆగకుండా టైర్ 2, టైర్ 3 నగరాల్లోని వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి ఈ చవకైన 4జీ ఫోన్‌ను ప్రవేశపెడుతోంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ..దేశంలోని ప్రతి మూలకు సరసమైన 4జీ కనెక్టివిటీని తీసుకురావడానికి బీఎస్ఎన్ఎల్, కార్బన్ మొబైల్స్ చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి. దేశ "4జీ సాథీ పాలసీ" కింద ప్రత్యేక సిమ్ హ్యాండ్సెట్ బండ్లింగ్ ఆఫర్‌ను ప్రారంభించనున్నాయి. దేశవ్యాప్తంగా సరసమైన 4జీ కనెక్టివిటీని అందించడమే తమ లక్ష్యమని బీఎస్ఎన్ఎల్ ఒక పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఫోన్ బీఎస్ఎన్ఎల్ సిమ్‌తో వస్తుంది. వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. -
తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్‌తో కార్బన్ స్మార్ట్‌టీవీలు లాంచ్..!
Karbonn Launches Made In India Smart LED TVs In India: ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం కార్భన్ మొబైల్స్ స్మార్ట్‌టీవీ ఉత్పత్తుల తయారీలోకి అడుగుపెట్టింది. అందులో భాగంగా భారత మార్కెట్లలోకి మూడు స్మార్ట్‌టీవీ మోడళ్లను కార్భన్ లాంచ్ చేసింది. మేడ్ ఇన్ ఇండియా చొరవతో కంపెనీ స్మార్ట్‌టీవీలను తయారుచేసింది. కంపెనీ తన ఆఫ్‌లైన్ పరిధిని విస్తరించడానికి రిలయన్స్ డిజిటల్‌తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ స్మార్ట్‌టీవీలను రిలయన్స్ డిజిటల్లో కొనుగోలు చేయవచ్చును. చదవండి: గూగుల్‌పే మాదిరిగా...వాట్సాప్‌లో రూ. 255 వరకు క్యాష్‌బ్యాక్..! కార్బన్ స్మార్ట్‌టీవీ భాగంగా 32, 39, 24 అంగుళాల ఎల్ఈడీ టీవీలను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌టీవీలు క్వాలిటీ డిజైన్, ఇన్-బిల్ట్ యాప్ స్టోర్‌తో రానున్నాయి. స్మార్ట్‌ఫోన్‌తో ఈ టీవీలను కనెక్ట్ చేసుకోవచ్చును. స్మార్ట్‌టీవీ పోర్ట్‌ఫోలియోలో భాగంగా రాబోయే 2 సంవత్సరాలలో 15 మోడళ్లకు విస్తరించాలని కార్బన్ లక్ష్యంగా పెట్టుకుంది. కార్బన్ స్మార్ట్‌టీవీల ధరలు రూ. 7990 నుంచి ప్రారంభమవ్వనున్నాయి. కార్బన్ స్మార్ట్‌టీవీ ఫీచర్స్..! బెజెల్లేస్ డిజైన్ హెచ్డీ డిస్ప్లే క్వాడ్‌కోర్ ఏ53 1.5GHz ప్రాసెసర్ మాలి-G31 (డ్యూయల్ కోర్ గ్రాఫిక్స్) ఆండ్రాయిడ్ 9 సపోర్ట్ 1జీబీ ర్యామ్+8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ యూఎస్బీ సపోర్ట్ వీజీఏ, హెచ్డీఎమ్ఐ సపోర్ట్ మూవీ బాక్స్, స్మార్ట్‌టీవీ రిమోట్ ఇన్ బిల్ట్ యాప్స్ స్టోర్ 20వాట్ స్పీకర్స్ వైఫై, ఈథర్నెట్ సపోర్ట్ చదవండి: మిలిటరీ-గ్రేడ్ రేంజ్లో నోకియా స్మార్ట్‌ఫోన్..! కొనుగోలుపై ఇయర్‌బడ్స్ ఉచితం..! -
కార్బన్ మొబైల్స్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ కార్బన్.. మగువలకు ఆఫర్ ప్రకటించింది. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను మంగళవారం వనితలకు తక్కువ ధరలకు అందిస్తున్నట్టు తెలిపింది. క్వాట్రో ఎల్ 50 హెచ్ డీ రూ.7999, టిటానియం మాచ్ ఫైవ్ రూ. 5999, టిటానియం మొఘల్ రూ.5790, కే9 స్మార్ట్ ఫోన్ ను రూ.3999లకు విక్రయించనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇటీవలే విడుదల చేసిన క్వాట్రో ఎల్ 50 హెచ్ డీ స్మార్ట్ ఫోన్ తో వినియోగదారులకు స్థిరమైన, సురిక్షిత 4జీ అనుభవం సొంతమవుతుందని తెలిపింది. 127 సెంటీమీటర్ల హెచ్ డీ ఐపీఎస్ ఫుల్ లామినేషన్ స్క్రీన్, 1.3 జీహెచ్ జడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఆన్-బోర్డ్ మెమొరీ, 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాఫిక్సెల్ ఆటో ఫోకస్ రియర్ కెమెరా, 5 మెగాఫిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్లు ఇందులో ఉన్నాయని కార్బన్ మొబైల్స్ సంస్థ వెల్లడించింది.


