breaking news
Kadapa arts college
-
నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్ కదా జగనూ..!
ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడం ఇష్టం లేని చంద్రబాబుకు సంక్షేమం అంటే ఏంటో నేర్పిస్తండావు. మీ నాయన ఆయనకి పాలన అంటే ఏంటో చూపిస్తే,ఇప్పుడు నువ్వు నేర్పించినావు కదా... తండ్రికి మించిన తనయుడువు అయితివి అబ్బా.. ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. అంటూ కడప ఆర్ట్స్ కాలేజీ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ప్లెక్సీ అటుగా వెళ్లే వారిని ఆకర్షిస్తుంది. అక్కడే కాసేపు నిలబడి ఆ ఫ్లెక్సీలోని పాయింట్లన్నీ ఆమూలాగ్రం చదివేలా చేస్తోంది.. ఆ తండ్రీకొడుకులిద్దరూ కళ్లు మూసుకుని నిన్ను ఫాలో అయ్యే పరిస్థితి తీసుకొచ్చావ్ కదయ్యా!. నిత్యం నిన్ను అవమానించే వాళ్ళు, నీ ఇమేజ్‌కు డామేజ్ చేసే వాళ్లు కూడా.. కిక్కురు మనకుండా నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్ కదయ్యా. ఎంత పని చేశావయ్యా జగన్..!! అంటూ అందులో రాసి ఉంది.. .. వాస్తవానికి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్‌కు పేదలంటే ఇష్టం ఉండదు!. అదొక అసహ్యమనే భావనలో ఉంటారు వాళ్లు. సర్కారు బడుల్లో, ప్రభుత్వ ఆసుపత్రులు, పథకాలు, సంక్షేమం వగైరా అంటే వారికి అసలు గిట్టదు. కానీ ప్రభుత్వం అంటే ప్రజలు అని.. ప్రజలతో మమేకం కాకుండా పరిపాలన చేసిన అది నిజమైన ప్రభుత్వం కాదు అని వైఎస్ జగన్ నిరూపించారు. ఐదేళ్ల పరిపాలనలో నిత్యం ఆయన ధ్యాస తపన ఆలోచన ప్రజల చుట్టూనే ఉండేది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అమలు చేయాల్సిందే అని పట్టుబట్టిన ఆయన వాటి జాబితాను తన కార్యాలయ గోడలకు అతికించి నిత్యం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటి అమలుకు ముందడుగు వేస్తూ ఉండేవారు. అయితే.. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత నేడు చంద్రబాబు కూడా వైయస్ జగన్ వేసిన బాటలోనే నడుస్తున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు తొలిసారిగా తల్లికి వందనం అంటూ ఓ పథకాన్ని ఇచ్చారు. వాస్తవానికి అది గతంలో జగన్ ‘అమ్మ ఒడి’ పేరిట ఇచ్చిన పథకమే. కానీ దాన్ని తామే కొత్తగా కనిపెట్టినట్లుగా ప్రజలను నమ్మిస్తూ వస్తున్నారు. జగన్ తన పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు పేరిట ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్ మీడియం. సబ్జెక్ట్ టీచర్లు ఇలా రకరకాల కాన్సెప్ట్‌లతో ప్రభుత్వ విద్య విధానంలో నాణ్యత పెంచారు. ఇప్పుడు అదే పాఠశాలల్లో చంద్రబాబు లోకేష్ ఫోటోలు దిగి పిల్లలతో ముచ్చట్లు చెబుతూ అదంతా తమ ఘనతగా పత్రికల్లో రాయించుకుంటున్నారు. ఇలా ఎన్నో అంశాలను సదర్ ఫ్లెక్సీలో పేర్కొన్న రహస్య అభిమాని.. ‘‘ఎంత పని చేసావు జగన్’’ అంటూ జగన్ అభినందిస్తూనే చంద్రబాబు పడుతున్న తిప్పలను హాస్యపూరితంగా వివరించారు.నీ ఒత్తిడి భరించలేక పేద పిల్లలకు చంద్రబాబు తనకి ఇష్టం లేకపోయినా తల్లికి వందనం ఇచ్చాడు. నువ్వు అప్పట్లో అగ్రిమెంట్ చేసుకున్న పరిశ్రమలు ప్రాజెక్టులు పథకాలనే చంద్రబాబు లోకేష్ ఇప్పుడు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. నువ్వు గతంలో ప్రజలతో మమేకం అయినట్లుగానే ఇప్పుడు చంద్రబాబు కోరికన్నా ముందు నిద్రలేచి టీ స్టాళ్ళు.. చేపల బజార్లు.. సందులు.. గొందుల్లో తిరుగుతూ జనంతో కలిసి ఫోటోలు దిగుతున్నారు.. ఇవన్నీ గతంలో నువ్వు చేసినవి కాక మరేమిటి జగనూ!. .. నీ పర్యటనలకు తండోపతండాలుగా వస్తున్న జనాన్ని ఆపలేక చంద్రబాబు ఆఖరుకు తన కడుపు మంటను మంత్రుల మీదకు వెళ్ళగకుతున్నారు.. ఇది కూడా నువ్వే చేశావు జగనూ!. కూటమిలోని మూడు పార్టీలకు ఒకరంటే ఒకరికి పసగకపోయినా నీ భయంతో అందరూ చేతులు పట్టుకొని జట్లు పట్టుకొని ఒకరినొకరు పొగుడుకునేలాగా చేశావు.. విడిపోతే ముగ్గురూ అస్సామే అనే పరిస్థితి తీసుకొచ్చావు జగనూ!. నువ్వు ఏ ఊరికి పర్యటనక పోతే అక్కడ ముందుగానే పరిస్థితులు చక్కపెట్టేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అక్కడి సమస్యలపై ఉరుకున పరుగున స్పందించే ప్రయత్నమూ చేస్తున్నారు.. ఎంత పని చేసావు జగనూ!.నువ్వు ఓడిపోయినా.. రాష్ట్రంలో మీ పరిపాలనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని ఈ తండ్రి కొడుకులు కచ్చితంగా చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చావ్.. ఎంత పని చేశావు జగనూ! అంటూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ అందర్నీ ఆలోచింపజేస్తోంది.::సిమ్మాదిరప్పన్న -
నిధుల స్వాహా పర్వం పయనమెటో?
కడప అర్బన్ : కడప ఆర్ట్స్ కళాశాలలో నిధుల స్వాహా పర్వం వెనుక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థుల స్కాలర్షిప్పులు, ఇతర ఫీజుల నిధులు దాదాపు రూ. 60 లక్షలకు పైగా నగరంలోని వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. ఈ నిధులపై కళాశాలలోని సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రఘురామిరెడ్డి కన్నేశారు. తన చేతికి మట్టి అంటకుండా మారుతీనగర్‌లో మ్యారేజ్‌బ్యూరో నిర్వహిస్తున్న కవిత అనే మహిళను సహాయపడాలని కోరారు. ఆమెకు ప్రముఖ వ్యక్తులతో పరిచయం ఉండడంతో వారిలో కొందరిని నిధుల స్వాహాకు పాత్రధారులుగా ఉపయోగించుకుంది. రఘురామిరెడ్డి ద్వారా అతని స్నేహితుడు ఎంఎం మహమ్మద్ అలియాస్ చిన్నా ద్వారా రూ. 4,600 చెక్కును ట్రైలర్‌గా ఎస్బీఐ ఖాతా ద్వారా డ్రా చేయించారు. తన పథకం ఫలించడంతో స్వాహా పర్వానికి పూనుకున్నాడు. రఘురామిరెడ్డి విద్యార్థుల స్కాలర్‌షిప్పుల చెక్‌బుక్‌లోని నాలుగు చెక్కులను మార్చుకునేందుకు ప్రయత్నించి సఫలీకృతులయ్యాడు. మారుతీనగర్‌కు చెందిన షారోన్ కృపాకర్ ద్వారా రూ. 4.30 లక్షలను సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చెక్కును పంపించి ఖాతాలో జమ అయ్యేలా చూశారు. ఈ క్రమంలో సదరు బ్యాంకు మేనేజర్ అథారిటీ లెటర్ తీసుకు రావాలని కృపాకర్‌ను కోరారు. తమ గుట్టు రట్టవుతుందని రఘురామిరెడ్డి, కవితతో కలసి ప్రిన్సిపాల్ వెంకటలక్షుమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేసి అథారిటీ లెటర్‌ను పంపించారు. అథారిటీ లెటర్‌ను బ్యాంకు మేనేజర్ ప్రిన్సిపాల్ వెంకట లక్షుమ్మ వద్దకు పంపారు. ఆమె తన సంతకం ఫోర్జరీ అయిందని గమనించి వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రంగనాయకులు కేసు నమోదు చేశారు.