breaking news
jipmer
-
జిప్మర్లో హిందీ రగడ
సాక్షి, చెన్నై: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్ (జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చి)లో పాలనా వ్యవహారాలన్నీ హిందీలోనే జరగాలన్న ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ హిందీ, సంస్కృత భాషలను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిప్మర్ ఇచ్చిన హిందీ ఉత్తర్వులపై తమిళాభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బలవంతంగా హిందీని రుద్దాలన్న కేంద్ర ప్రభుత్వ యత్నాలను అడ్డుకుంటామని డీఎంకే ఎంపీ కనిమొళి హెచ్చరించారు. పుదుచ్చేరిలో బీజేపీ– ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. -
‘నీట్’తోనే ఎయిమ్స్, జిప్మర్ ప్రవేశాలు
న్యూఢిల్లీ చెన్నై: ఆల్ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)లో ప్రవేశాలను వచ్చే ఏడాది నుంచి నీట్ ద్వారానే చేపట్టనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు మినహా మిగతా అన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలను నీట్ ద్వారా చేపడుతున్నారు. జాతీయ మెడికల్ కమిషన్ యాక్ట్ ప్రకారం వచ్చే ఏడాది నుంచి అన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలను నీట్ ద్వారానే జరపనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో అన్ని కాలేజీలకు ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించే వీలు ఉంటుందన్నారు. తమ మంత్రిత్వశాఖ కింద పనిచేసే ఎయిమ్స్, జిప్మర్లో ప్రవేశానికి ఇకపై ప్రత్యేక పరీక్ష ఉండదని వెల్లడించారు. ఎన్ఎంసీ ప్రకారం పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు, ప్రాక్టీస్ లైసెన్స్ పొందడానికి ‘నెక్ట్స్’పరీక్ష నిర్వహించే ఆలోచనలో ఉన్నామన్నారు. దేశమంతటా నీట్ కుంభకోణం నీట్ ఎంట్రెన్స్‌లో అవకతవకలకు పాల్పడి తప్పుడు మార్గంలో మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు పొందిన వ్యవహారంపై కేంద్రానికి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కుంభకోణం తమిళనాడుకే పరిమితంకాదని, దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేసింది. కేవీ ఉదిత్ సూర్య అనే విద్యార్థి అక్రమంగా మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందారంటూ సూర్యతోపాటు ఆయన తండ్రి డాక్టర్ వీకే వెంకటేశన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంపై హైకోర్టు కేంద్ర ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ప్రతిస్పందించాలని పేర్కొంది. ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థులు తమ తరఫున వేరే వారితో ఎంట్రెన్స్ రాయించారని తేలింది. -
పదో తరగతితో కేంద్ర ప్రభుత్వోద్యోగం
-
పదో తరగతితో కేంద్ర ప్రభుత్వోద్యోగం
కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ).. సెక్యూరిటీ అసిస్టెంట్ల (మోటర్ ట్రాన్స్పోర్ట్) నియామకానికి ప్రకటనను విడుదల చేసింది. దీని ద్వారా పదో తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అందుకోవచ్చు. నోటిఫికేషన్ వివరాలు.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 209 పోస్టులు ఖాళీల వివరాలు: మొత్తం పోస్టులు 209 (ఓపెన్ కేటగిరీ-106, ఓబీసీ-45, ఎస్సీ-30, ఎస్టీ-28). దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల వారీగా పోస్టుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్‌లో 4 (ఓపెన్-2, ఓబీసీ-1, ఎస్సీ-1), విజయవాడలో 4 (ఓపెన్-2, ఓబీసీ-1, ఎస్సీ-1) పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా ఢిల్లీలో 45 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను జనరల్ సెంట్రల్ సర్వీస్‌లోని గ్రూప్-సీ (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) కేటగిరీగా పేర్కొన్నారు. వేతనం: రూ.5,200-20,200 ప్లస్ గ్రేడ్ పే రూ.2000 (పీబీ-1). వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఇతర అలవెన్సులు. విద్యార్హత-పరిజ్ఞానం: పదో తరగతి/తత్సమానం. మోటర్ మెకానిజం తెలిసుండాలి. వాహనంలో తలెత్తే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించగలగాలి. అనుభవం: లైట్ మోటర్ వెహికిల్ డ్రైవింగ్ లెసైన్స్ తీసుకున్న తేదీ నుంచి కనీసం ఏడాది పాటు కారు నడిపిన అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు; ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. గమనిక: వయసు, విద్యార్హతలు, డ్రైవింగ్ లెసైన్స్, అనుభవం తదితరాలకు కటాఫ్ తేదీగా 2016 ఆగస్టు 6ను పరిగణనలోకి తీసుకుంటారు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా విధులను నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: 100 మార్కులకు నిర్వహించే స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో 50 మార్కులను డ్రైవింగ్ టెస్ట్‌కు, 50 మార్కులను మోటర్ మెకానిజం టెస్ట్‌కు కేటాయించారు. డ్రైవింగ్ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థులు ఇన్స్ట్రక్టర్ సూచనల మేరకు వాహనం నడపాలి. మోటర్ మెకానిజం టెస్ట్‌లో భాగంగా వాహనం నిర్వహణ, అందులో తలెత్తే తేలికపాటి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైనవారికి క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ (ప్రవర్తన, పూర్వాపరాల తనిఖీ), వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 6, 2016 పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.50 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఇచ్చారు. చివరి తేదీ (ఆగస్టు 6)న అప్లై చేసేవాళ్లు 8, 9 తేదీల్లో కూడా ఎగ్జామ్ ఫీజు చెల్లించొచ్చు. వెబ్సైట్: దరఖాస్తు చేసుకునేందుకు, వివరాలకు http://mha.nic.in/vacanciesను చూడొచ్చు. .................................... నేవీలో 262 పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) నియామకానికి భారత నావికా దళం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి విద్యార్హతతోనే ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించుకునేందుకు బాటలు వేసే ఈ కొలువులు ఉద్యోగార్థులకు సువర్ణావకాశం లాంటివి. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టులు 262. ఇందులో ఎంటీఎస్ (మినిస్టీరియల్)-246, ఎంటీఎస్ (నాన్ ఇండస్ట్రియల్)-16. కేటగిరీల వారీగా చూస్తే.. 1. ఎంటీఎస్ (మినిస్టీరియల్) మొత్తం పోస్టుల్లో ఎక్స్సర్వీస్మెన్లకు 25, అంధులకు 5, బధిరులకు 7, క్రీడాకారులకు 12 పోస్టులను రిజర్వ్ చేశారు. 2. ఎంటీఎస్ (నాన్-ఇండస్ట్రియల్) మొత్తం పోస్టుల్లో ఎక్స్సర్వీస్మెన్లకు 2, క్రీడాకారులకు 1 పోస్టును రిజర్వ్ చేశారు. వేతనం: రూ.5,200-20,200 ప్లస్ గ్రేడ్ పే రూ.1800 విద్యార్హత: మినిస్టీరియల్ పోస్టులకు పదో తరగతి/తత్సమాన విద్యార్హత, నాన్ ఇండస్ట్రియల్ పోస్టులకు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్లలో నైపుణ్యం ఉండాలి. వయసు: మినిస్టీరియల్ పోస్టులకు 18-27 ఏళ్లు. నాన్ ఇండస్ట్రియల్ పోస్టులకు 18-25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీలు, ప్రభుత్వోద్యోగులు, డిపార్ట్మెంట్ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విధులు: మినిస్టీరియల్ సిబ్బంది కింది విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. అవి.. 1. సంబంధిత సెక్షన్లు/యూనిట్లలో రికార్డుల నిర్వహణ 2. సెక్షన్లు/యూనిట్లలో పరిశుభ్రత 3. కార్యాలయ భవనాల్లో ఫైల్స్, ఇతర పత్రాల బట్వాడా 4. డాక్యుమెంట్లను జిరాక్స్ తీయడం, ఫ్యాక్స్ చేయడం 5. సెక్షన్లు/యూనిట్లలో ఇతర నాన్ క్లరికల్ పనులు 6. ఉత్తరాల బట్వాడా 7. పహారా, రక్షణ 8. ప్రారంభ, ముగింపు విధులు (ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డ్యూటీస్) 9. రూమ్‌లు, వాష్ రూమ్‌ల క్లీనింగ్ 10. కార్యాలయ సామగ్రి దుమ్ము దులపడం 11. సంబంధిత పోస్టుకు తగిన పనులు 12. పైఅధికారులు చెప్పే ఇతర పనులు నాన్ ఇండస్ట్రియల్ సిబ్బంది కూడా సంబంధిత పోస్టులకు తగిన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంపిక విధానం: దరఖాస్తులు భారీగా వస్తే అందరికీ రాత పరీక్ష నిర్వహించడం కష్టంతో కూడిన పని. అందువల్ల పదో తరగతి మార్కుల ఆధారంగా సముచిత సంఖ్యలో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష విధానం: అన్నీ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలే ఇస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. సబ్జెక్టుల వారీగా ప్రశ్నల సంఖ్యను పరిశీలిస్తే.. పరీక్ష తేదీ: రాత పరీక్షను 2016 సెప్టెంబర్ 25న (లేదా) అక్టోబర్ 1న నిర్వహించే అవకాశం ఉంది. ఖచ్చితమైన తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వివరాలను అడ్మిట్ కార్డ్పైన, నేవీ వెబ్సైట్లో కొద్ది రోజుల తర్వాత పొందుపరుస్తారు. తుది ఎంపిక: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయినవారికి సర్టిఫికెట్ల తనిఖీ, వైద్య పరీక్షలు నిర్వహించి, అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును పూర్తి చేసి, సెల్ఫ్ అటెస్ట్ చేసిన ధృవీకరణ పత్రాల జిరాక్స్‌లను జత చేసి రిజిస్టర్ పోస్ట్‌లో/స్పీడ్ పోస్ట్‌లో పంపాలి. దరఖాస్తు ఉన్న ఎన్వలప్ కవర్‌పై ‘అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మినిస్టీరియల్/ నాన్ ఇండస్ట్రియల్) ‘‘...........’’, కేటగిరీ (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ యూఆర్/ఈఎస్ఎం/ పీడబ్ల్యూడీ) ‘‘......’’ రాయాలి. చిరునామా: ది ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, ((ఫర్ స్టాఫ్ ఆఫీసర్(సివిలియన్ రిక్రూట్మెంట్ సెల్)), హెడ్ క్వార్టర్స్ సదరన్ నావల్ కమాండ్, కొచ్చి, 682004. దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 5 వెబ్సైట్: దరఖాస్తులు, వివరాలకు www.indiannavy.nic.in/content/civilian చూడొచ్చు. ........................... హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో 171 అప్రెంటీస్ పోస్టులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ తన పరిధిలోని వివిధ ప్లాంట్లలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 171 కాగా ఇందులో 101 పోస్టులు రాజస్థాన్‌లోని ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌కు, 42 పోస్టులు జార్ఖండ్‌లోని ఘట్సిలా ప్రాంతంలో గల ఇండియన్ కాపర్ కాంప్లెక్స్‌కు, 28 పోస్టులు గుజరాత్ కాపర్ ప్రాజెక్టుకు సంబంధించినవి. ప్లాంట్లు, ట్రేడ్లు, కేటగిరీల వారీగా వేకెన్సీలు.. 1. ఖేత్రి కాపర్ కాంప్లెక్స్ ఇందులో బ్లాస్టర్(మైన్స్) ట్రేడ్ శిక్షణ కాల వ్యవధి రెండేళ్లు, మేట్(మైన్స్) ట్రేడ్‌కు మూడేళ్లు, మిగిలిన అన్నిటికి ఏడాది. 2. ఘట్సిలాలోని ఇండియన్ కాపర్ కాంప్లెక్స్ ఈ ట్రేడ్లు అన్నిటికీ శిక్షణ కాల వ్యవధి ఏడాది 3. గుజరాత్ కాపర్ ప్లాంట్ ఇందులో ప్లంబర్ ట్రేడ్ శిక్షణ కాల వ్యవధి రెండేళ్లు. మిగిలినవాటికి ఏడాది. విద్యార్హతలు 1.ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు మెట్రిక్/సెకండరీ/టెన్త్ (10+2 సిస్టమ్) పాస్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణత. 2014కు ముందు ఐటీఐ పాసైనవారు ఈ మధ్య కాలంలో ఏ సంస్థలోనూ అప్రెంటీస్ చేయలేదని/ఎక్కడా ఉద్యోగంలో చేరలేదని ప్రమాణపత్రాన్ని దాఖలు చేయాలి. బ్లాస్టర్ (మైన్స్), మేట్ (మైన్స్) ట్రేడ్లకు ఐటీఐ, ప్రమాణపత్రాలు అవసరంలేదు. 2.ఘట్సిలా కాంప్లెక్స్‌లోని పోస్టులకు హైస్కూల్/తత్సమాన విద్యార్హతతోపాటు 60 శాతం మార్కులతో సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ (ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం). 3.గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టుల్లో వెల్డర్, వైర్‌మ్యాన్ ట్రేడ్లకు 8వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణత. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్లకు సైన్స్, మ్యాథమెటిక్స్‌లతో టెన్త్ (10+2 సిస్టమ్) పాస్ లేదా తత్సమానం. దీంతోపాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణత. ప్లంబర్ ట్రేడ్‌కు టెన్త్ పాస్/ఫెయిల్తోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. వయసు 1.ఖేత్రి కాంప్లెక్స్‌లోని పోస్టుల విషయంలో వయో పరిమితి, విద్యార్హతలకు 2016 జూలై 20వ తేదీని కటాఫ్ డేట్‌గా పరిగణిస్తారు. 2.ఘట్సిలా కాంప్లెక్స్‌లో పోస్టులకు కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 42 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. అర్హతల పరిశీలనకు 2016 ఆగస్టు 31ని కటాఫ్ డేట్‌గా పరిగణిస్తారు. 3.గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు 2016 జూలై 1 నాటికి 18-25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. స్టైపెండ్ 1.ఘట్సిలా కాంప్లెక్స్‌లోని పోస్టులకు మొదటి ఏడాది రూ.4004; రెండో ఏడాది రూ.4576; మూడు, నాలుగో ఏడాది రూ.5148 ఉపకారవేతనం ఇస్తారు. ఖేత్రి కాంప్లెక్స్, గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు నిబంధనల మేరకు స్టైపెండ్ ఇస్తారు. ఎంపిక విధానం 1.ఖేత్రి కాంప్లెక్స్‌లోని పోస్టులకు రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తే అందరినీ రాత పరీక్షకు ఎంపిక చేయరు. సాధారణ/సాంకేతిక విద్యలో పొందిన మార్కుల ఆధారంగా కొందరినే రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఎంపికైన అభ్యర్థుల ఫిజికల్ ఫిట్నెస్ను పరిశీలిస్తారు. 2.ఘట్సిలా కాపర్ కాంప్లెక్స్, గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు కూడా రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీలు 1.ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 11 2.ఘట్సిలా కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 25 3.గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు రాత పరీక్ష తేదీని పేర్కొనలేదు. దరఖాస్తు విధానం 1.ఆయా ప్లాంట్లలోని పోస్టులకు నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులకు సెల్ఫ్ అటెస్ట్ చేసిన అర్హతల ధృవీకరణ పత్రాల జిరాక్స్‌లను జత చేసి ఆయా సంస్థల అడ్రస్‌కు స్పీడ్ పోస్ట్/రిజిస్టర్ పోస్ట్‌లో పంపాలి. దరఖాస్తులకు చివరి తేదీలు 1. ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు: ఆగస్టు 16. 2. ఘట్సిలా కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు: సెప్టెంబర్ 10. 3. గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు: ఆగస్టు 13. వెబ్సైట్: www.hindustancopper.com ......................... జిప్మర్లో 82 నర్సు పోస్టులు జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 92. వాటిలో సింహ భాగం (82 పోస్టులు) స్టాఫ్ నర్సులు కాగా మరో మూడు రకాల జాబ్‌లు (10 పోస్టులు) ఉన్నాయి. వాటిని కేటగిరీల వారీగా పరిశీలిస్తే.. వేతనం: అన్ని పోస్టులకూ రూ.9300-34,800 ప్లస్ గ్రేడ్ పే రూ.4,200. స్టాఫ్ నర్సు పోస్టులకు మాత్రం గ్రేడ్ పే రూ.400 అదనం. అంటే మొత్తం గ్రేడ్ పే రూ.4,600. విద్యార్హత: 1.స్టాఫ్ నర్సుకు జీఎన్ఎంలో డిగ్రీ/డిప్లొమా/తత్సమాన అర్హతతోపాటు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సు అండ్ మిడ్ వైఫ్‌గా రిజిస్టరై ఉండాలి. 2.ఎక్స్‌రే టెక్నీషియన్(ఆర్డీ)కి ఇంటర్/సైన్స్ సబ్జెక్టులతో తత్సమాన విద్యార్హత. దీంతోపాటు బీఎస్సీ(మెడికల్ రేడియేషన్ టెక్నాలజీ). రేడియో డయాగ్నోసిస్(ఆర్డీ) /రేడియోథెరపీలో రెండేళ్ల అనుభవం (లేదా) రేడియోలజీలో రెండేళ్ల డిప్లొమా/ తత్సమానంతోపాటు ఆర్డీ/రేడియోథెరపీలో మూడేళ్ల అనుభవం. 3.ఎక్స్‌రే టెక్నీషియన్(ఆర్టీ)కి ఇంటర్/సైన్స్ సబ్జెక్టులతో తత్సమాన విద్యార్హత. దీంతోపాటు బీఎస్సీ(ఆర్టీ: రేడియోథెరపీ)/బీఎస్సీ ఇన్ మెడికల్ టెక్నాలజీ(ఆర్టీ)/ బీఎస్సీ(మెడికల్ రేడియేషన్ టెక్నాలజీ)తోపాటు ఆర్టీలో రెండేళ్ల అనుభవం (లేదా) రేడియోథెరపీ టెక్నాలజీలో రెండేళ్ల పీజీ డిప్లొమా/డిప్లొమాతోపాటు ఆర్టీలో మూడేళ్ల అనుభవం. 4.ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్‌కు ఇంటర్‌తోపాటు బీపీఈడీ, రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: అన్ని పోస్టులకూ 2016 ఆగస్టు 16 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల వారికి నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష రుసుం: ఓసీ, ఓబీసీలు రూ.500; ఎస్సీ/ఎస్టీలు రూ.250 చెల్లించాలి. పీడబ్ల్యూడీలకు మినహాయింపు ఉంది. ఫీజును ‘ది డెరైక్టర్, జిప్మర్’ పేరిట పుదుచ్చేరి (ఎస్బీఐ జిప్మర్ బ్రాంచ్)లో చెల్లుబాటు అయ్యేలా డీడీ తీయాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకునేవారు వేర్వేరు దరఖాస్తులు, డీడీలు పంపాలి. దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనా దరఖాస్తును పూర్తి చేసి, విద్యార్హత ధృవీకరణ పత్రాల జిరాక్స్‌లను జత చేసి, ‘ది డెరైక్టర్, జిప్మర్, పుదుచ్చెరి, 605006’ అడ్రస్‌కు పంపాలి. దరఖాస్తును పంపే కవర్‌పై ‘అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్....... (కోడ్ నంబర్.......)’ అని రాయాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 2016 ఆగస్టు 16. వెబ్సైట్: దరఖాస్తులకు, వివరాలకు http://jipmer.edu.in/category/jobs/ను చూడొచ్చు. -
డాక్టర్ కావాలనేది.. చిన్ననాటి కోరిక!
సక్సెస్ స్పీక్స్: దేశంలోని వైద్య విద్య, పరిశోధనలో ప్రఖ్యాత విద్యా సంస్థ జిప్మర్ (జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్). ఇది ఆఫర్ చేసే మూడేళ్ల ఎండీ/ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే జాతీయ స్థాయిలో తీవ్ర పోటీని ఎదుర్కొని, జిప్మర్ పీజీ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించాల్సిందే. ఇలాంటి పరీక్షలో ఖమ్మం జిల్లాకు చెందిన సూరంపల్లి విజయ్ మూడో ర్యాంకును సొంతం చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమంటున్న విజయ్ తన అనుభవాలను సాక్షి ‘భవిత’తో పంచుకున్నారు. ఆ వివరాలు.. ఈ ఏడాది మార్చిలో ఎంబీబీఎస్ ‘హౌజ్ సర్జన్’ పూర్తి చేశాను. అత్యుత్తమ కళాశాలలో జనరల్ మెడిసిన్‌లో పీజీ చేయాలనే సంకల్పంతో ముందడుగు వేశాను. దేశంలోని ప్రతిష్టాత్మక మెడికల్ విద్యాసంస్థల ప్రవేశ పరీక్షలపై దృష్టి సారించాను. వాటిలో జనరల్ మెడిసిన్ సీటు సాధించాలంటే టాప్‌టెన్ ర్యాంకు తప్పనిసరి. అందుకనుగుణంగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని, పట్టుదలతో చదివాను. జిప్మర్ పీజీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యాను. ఇందులో మూడో ర్యాంకు రావడం ఆనందం కలిగిస్తోంది. నాన్న ప్రోత్సాహం: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రం నా స్వస్థలం. అమ్మ శిరోమణి, నాన్న నరసింహరావు. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న ఏడో తరగతి వరకే చదువుకున్నారు. అందుకే నన్ను ఉన్నత చదువులు చదివించాలని కోరుకునేవారు. నాన్న దృష్టిలో పెద్ద చదువంటే డాక్టర్ చదువే. చిన్నతనంలో నాకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడే.. డాక్టర్ కావాలనే ఆశయాన్ని ఏర్పరచుకున్నాను. పదోతరగతిలో స్నేహితులతో కలిసి చిన్న నాటకం ప్రదర్శించే సందర్భంలో నేను కోరికోరి డాక్టర్ పాత్రను ఎంచుకున్నా. పాఠశాల విద్య: పాఠశాల స్థాయిలో తరగతిలో టాపర్ కానప్పటికీ మంచి మార్కులే సాధించేవాడిని. అప్పటివరకు చదివే పాఠశాలలో బోధన సంతృప్తికరంగా లేకపోవ డంతో తొమ్మిదో తరగతిలో ఊరికి దూరంగా ఉన్న పాఠశాలలో చేరాను. అమ్మానాన్నలతోపాటు అక్క, బావల ప్రోత్సాహంతో చదువులో మంచి ప్రతిభ చూపగలిగాను. పదోతరగతిలో 554 మార్కులు, ఇంటర్మీడియెట్‌లో 95.1 శాతం మార్కులు సాధించా. ఎంసెట్‌లో తొలిసారి 2000 ర్యాంకు లభించింది. దాంతో ఏడాది దీర్ఘకాల శిక్షణ తీసుకున్నాను. 620 ర్యాంకు సాధించి ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో సీటు లభించింది. ఎంబీబీఎస్‌లో 73.3 శాతం మార్కులు వచ్చాయి. మెడిసిన్ చదువు: కలలు కన్న డాక్టర్ వృత్తి కళ్లముందు కనిపిస్తుంటే... కొత్త కళాశాల, కొత్త పరిచయాలు.. ఇవేవీ నన్ను ఆందోళనకు గురిచేయలేదు. ఎంబీబీఎస్ ఆహ్లాదంగా గడిచిపోయింది. మంచి స్నేహితులు పరిచయమయ్యారు. క్లాస్ రూం బోధన, ప్రాక్టికల్స్, స్నేహితులతో స్టడీస్, సబ్జెక్ట్ డిస్కషన్, చిట్‌చాట్ ఇదే రోజువారీ దినచర్యగా మారిపోయింది. నా స్నేహితుడు నాగేశ్వరరావు సబ్జెక్టులో సందేహాలతోపాటు వ్యక్తిగతంగానూ నాకు ఎంతో సహకారాన్ని అందించాడు. స్వామి వివేకానంద పుస్తకాలు చదివేలా నన్ను ప్రోత్సహించి, స్ఫూర్తిని నింపాడు. పూర్తి ఆసక్తితో చదివి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో అనాటమీలో గోల్డ్‌మెడల్ కూడా సాధించాను. జిప్మర్ ప్రిపరేషన్: ఎంబీబీఎస్ పూర్తయ్యాక పీజీ ప్రవేశ పరీక్షలపై దృష్టి సారించాను. అందుకోసం హైదరాబాద్‌కు వచ్చి ప్రిపరేషన్ కొనసాగించాను. ఓ ప్రైవేటు శిక్షణ సంస్థలో ఆర్నెల్ల పాటు కోచింగ్ తీసుకున్నాను. వారానికి రెండు రోజులు మాత్రమే తరగతులు ఉండేవి. మిగిలిన రోజుల్లో రివిజన్ చేసుకుంటూ సొంతంగా ప్రిపేరయ్యాను. మొదట ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) రాత పరీక్షకు హాజరై 66వ ర్యాంకు సాధించాను. చంఢీగఢ్లోని పీజీఐఎంఈఆర్(పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) ప్రవేశ పరీక్షలోనూ 60వ ర్యాంకు సాధించాను. జనరల్ మెడిసిన్ సీటు లభించే అవకాశం లేనందున ప్రిపరేషన్‌కు మరింత పదును పెట్టాను. జిప్మర్ పీజీ ప్రవేశ పరీక్ష రాసి మూడో ర్యాంకు సాధించాను. ఈ ఏడాది వివిధ విభాగాల్లో అందుబాటులో ఉన్న 108 సీట్ల కోసం సుమారు 16,000 మంది పరీక్షకు హాజరయ్యారు. సలహా: జిప్మర్ తదితర ప్రతిష్టాత్మక మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే ఎంబీబీఎస్ నుంచే కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా చదవాలి. అకడమిక్ పరీక్షలతో పాటు పోటీ ప్రవేశ పరీక్షలను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నలు కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షించే కోణంలో కాకుండా... విశ్లేషణాత్మక శక్తిని జోడించి సాధించేలా అడుగుతారు. జిప్మర్లో మొత్తం 250 ప్రశ్నలకు మూడు గంటల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. కాబట్టి వేగంగా సమాధానాలు గుర్తించడం కూడా ప్రధానం. చదివిన అంశాలను ఎక్కువసార్లు రివిజన్ చేయడం తప్పనిసరి. చదువు పూర్తయ్యాక వైద్య రంగంలో నాకంటూ మంచి గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తాను. ఎంబీఏ కోర్సును అందిస్తున్న ఐఐటీలు.. ఎంబీఏ కోర్సును అందిస్తున్న ఐఐటీలేవి? -ఆదిత్య, వరంగల్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు ఇంజనీరింగ్ కోర్సులతోపాటు మేనేజ్మెంట్ విభాగంలో కూడా పలు కోర్సులను అందిస్తున్నాయి. వాటి వివరాలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఖరగ్‌పూర్, వినోద్గుప్తా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంబీఏ కోర్సును అందిస్తోంది. అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రవేశాల సమయంలో ప్రాధాన్యతనిస్తారు. వివరాలకు: www.som.iit-kgp.ernet.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఢిల్లీ, డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఎంబీఏ కోర్సును పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ రెండు విధాలుగా అందిస్తోంది. అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/ఫార్మసీ) లేదా బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా ఏదైనా మాస్టర్స్ డిగ్రీ లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇన్స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా పార్ట్ టైమ్ ఎంబీఏ కోర్సులో అడ్మిషన్ ఇస్తారు. వివరాలకు: http://dms.iitd.ac.in ఐఐటీ-మద్రాస్ (వివరాలకు: www.doms.iitm. ac.in/domsnew), ఐఐటీ-బాంబే (వివరాలకు: www.som.iitb.ac.in), ఐఐటీ-రూర్కీ (వివరాలకు: www.iitr.ac.in), ఐఐటీ-కాన్పూర్ (వివరాలకు: www.iitk.ac.in) కూడా ఎంబీఏ కోర్సును అందిస్తున్నాయి. ఎకనోమెట్రిక్స్ కోర్సును అందిస్తున్న యూనివర్సిటీలేవి? - శ్వేత, నిర్మల్. ఆర్థిక రంగానికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడానికి ఎకనోమెట్రిక్స్ తోడ్పడుతుంది. ఆర్థిక, గణాంక శాస్త్రాలకు చెందిన ఇంటర్‌డిసిప్లినరీ కోర్సు ఎకనోమెట్రిక్స్. దీన్ని పీజీ స్థాయిలో ఎకనామిక్స్ కోర్సులో భాగంగా బోధిస్తారు. కొన్ని యూనివర్సిటీలు మాత్రం ఎకనోమెట్రిక్స్ స్పెషలైజేషన్‌గా పీజీ కోర్సులను అందిస్తున్నాయి. అవి.. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి కోర్సు: ఎంఏ (ఎకనోమెట్రిక్స్) వివరాలకు: www.svuniversity.ac.in ఎస్ఆర్ఎం యూనివర్సిటీ-తమిళనాడు కోర్సు: ఎంఎస్సీ (ఎకనోమెట్రిక్స్) వివరాలకు: www.srmuniv.ac.in భారతీయార్ యూనివర్సిటీ-తమిళనాడు కోర్సు: ఎంఎస్సీ (ఎకనోమెట్రిక్స్) వివరాలకు: www.bu.ac.in ఇంటర్మీడియెట్ చదువుతున్నాను. బీడీఎస్ చేయాలని ఉంది. వివరాలు తెలపగలరు? -ప్రవీణ్, సూల్తానాబాద్. బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్).. ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా అత్యధిక మంది విద్యార్థులు ఎంపిక చేసుకునే కోర్సు. బీడీఎస్ కోర్సు చేసిన వారు దంత సంబంధిత వ్యాధులకు చికిత్సలను అందిస్తారు. వీరిని డెంటిస్ట్లుగా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 23 కాలేజీల్లో మొత్తం 2,140 బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. అర్హత: ఓపెన్ కేటగిరీ 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (బైపీసీ) ఉత్తీర్ణత (బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులు 40 శాతం; ఓసీ వికలాంగ విద్యార్థులు 45 శాతం మార్కులు సాధించాలి). ఎంసెట్‌లో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం (80 మార్కులు); బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం (64మార్కులు); ఓసీ పీహెచ్ అభ్యర్థులు 45 శాతం (72 మార్కులు) పొంది ఉండాలి. వ యసు: ప్రవేశ ప్రక్రియ చేపట్టే సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. బీడీఎస్ తర్వాత పీజీ చేయొచ్చు. ఈ కోర్సును ఎండీఎస్(మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ)గా వ్యవహరిస్తారు. ఇందులో కూడా పలు స్పెషలైజేషన్స్ ఉంటాయి. బయోటెక్నాలజీకి సంబంధించి అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్స్ ఏవి? -నితిన్, కొత్తగూడెం. బయోటెక్నాలజీకి సంబంధించి పలు రకాల స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి.. ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ: దీన్ని పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. పెయింట్లు, కెమికల్, డిటర్జెంట్లు, టెక్స్టైల్స్ వంటి ఉత్పత్తుల్లో ఇది తోడ్పడుతుంది. మెడికల్ బయోటెక్నాలజీ: ఫార్మాస్యూటికల్, డయోగ్నోసిస్ ప్రొడక్ట్‌ల తయారీకి సంబంధించిన పరిశోధనల్లో మెడికల్ బయోటెక్నాలజీని ఉపయోగిస్తారు. ఫుడ్ బయోటెక్నాలజీ: ఆహార ఉత్పత్తుల పెంపు, నాణ్యతను మెరుగుపరిచే సాంకేతికతలో ఫుడ్ బయోటెక్నాలజీ తోడ్పడుతుంది. బయోఇన్ఫర్మాటిక్స్: వివిధ పరిశోధనల ద్వారా లభించిన సమాచారాన్ని కంప్యూటర్ ద్వారా నిక్షిప్తం చేయడానికి బయోఇన్ఫర్మాటిక్స్ ఉపయోగపడుతుంది. ఎంబీఏ (బయోటెక్నాలజీ): బయోటెక్ పరిశ్రమల వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షించడానికి రూపొందించిన స్పెషలైజేషన్ ఎంబీఏ (బయోటెక్నాలజీ). ఆయా స్పెలైజేషన్స్ను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఐఐఐటీ-హైదరాబాద్ (వెబ్సైట్: http://biotech. iith. ac.in), ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ-ముంబై (వెబ్సైట్: www.ictmumbai.edu.in), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (వెబ్సైట్: www.uohyd.ernet. in), ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్-హైదరాబాద్ (వెబ్సైట్: www. ipeindia.org) - టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ -
జిప్మర్లో భాష్యం విద్యార్థికి సీటు
గుంటూరు: పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)లో భాష్యం మెడెక్స్ విద్యార్థి షేక్ నబీ దరియావలి సీటు పొందాడని భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ శనివారం గుంటూరులో ఒక ప్రకటనలో తెలిపారు. జిప్మర్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో ఓపెన్ కేటగిరీలో 19వ ర్యాంకు సాధించాడని వివరించారు. ఎంసెట్‌లో 35వ ర్యాంకుతో పాటు అఖిల భారతస్థాయి ప్రీ-మెడికల్ ప్రవేశ పరీక్షలో ఓపెన్ కేటగిరీలో 11వ ర్యాంకు సాధించి, జాతీయస్థాయిలో భాష్యం కీర్తి, ప్రతిష్టలను ఇనుమడింపజేశారని ప్రశంసించారు.