breaking news
jeep roll
-
బాకూరు ఘాట్‌లో జీపు బోల్తా
హుకుంపేట(అరకులోయ): మండలంలోని బాకూరు ఘాట్‌లోని డోగులజోరు సమీపంలోని మలుపు వద్ద ఓ జీపు అదుపుతప్పి లోయలోకి బోల్తా పడిన ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు.మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మరికొందరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయట పడ్డారు. సూకూరు పంచాయతీలోని బిరిసింగి గ్రామం నుంచి సుమారు 15 మంది ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం వెళ్తున్న సర్వీసు జీపునకు ఘాట్‌లోని డోగులజోరు సమీపంలో బ్రేక్ ఫెయిలైంది. దీంతో అదుపు తప్పి,లోయలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బాకూరు గ్రామానికి చెందిన గెమ్మెలి సంజయ్‌భార్గవ్(4),బాకూరు వెంకటలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొంత మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పరిస్థితి విషమంగా ఉన్న సంజయ్‌భార్గవ్‌ను పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మృతదేహాన్ని శవపరీక్షల గదిలో భద్రపరిచారు.తీవ్ర గాయాలపాలైన వెంకటలక్ష్మికి వైద్యసేవలు అందించారు. కుమారుడు తమ కళ్లముందే మృతిచెందడంతో తల్లిదండ్రులు కుమారి,సత్తిబాబు కన్నీరుమున్నీరుగా విలపించారు.బరిసింగి గ్రామంలోని ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి, తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బిరిసింగి,బాకూరు గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. హుకుంపేట పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు అందడంతో ఎస్ఐ నాగకార్తీక్ కేసు నమోదు చేసి, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
పాపవినాశనం వద్ద జీపు బోల్తా
నలుగురు భక్తులకు తీవ్రగాయాలు మరో 13 మందికి స్వల్ప గాయాలు తిరుమల : తిరుమలలో పాపవిశానం వద్ద జీపు బోల్తా పడి నలుగురు భక్తులకు తీవ్ర గాయాలు కాగా, మరో 13 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా పెద్దపేట గ్రామం, కరీంనగర్‌కు చెందిన మొత్తం 16 మంది ఒకే జీపులో తిరుమలకు వచ్చారు. స్వామిని దర్శించుకుని శుక్రవారం ఉదయం 8 గంటలకు భక్తులంద రూ పాపవినాశనం సమీపానికి వెళ్లగానే జీపు పక్కనే ఉన్న చెట్టును ఢీకొని లోయలోకి బోల్తా పడింది. దీంతో వాహనంలోని వారందరూ ఆ అడవిలో చెల్లాచెదురుగా ఎగిరి పడ్డారు. ఇతర వాహనదారుల సహకారంతో అంబులెన్స్‌లో క్షతగాత్రులు మహేం ద్ర (32), భారతి (28), అభిరాం(5), భూమేష్ (30)లను తిరుమలలోని అశ్వని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వీరిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. మరో 8 మంది భక్తులతోపాటు డ్రైవర్‌కు కూడా అశ్వని ఆస్పత్రిలోకి చికిత్సను అందించారు. అతివేగంతోపాటు పరిమితికి మించి భక్తులను వాహనంలో ఎక్కించడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.