breaking news
jc brothers gang halchal
-
పచ్చనేతల బరితెగింపు
తాడిపత్రి అర్బన్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పచ్చ నేతలు మరోసారి బరితెగించారు. అభివృద్ధి పనులు చేసేందుకు వెళ్లిన వారిపై తెలుగుదేశం పార్టీకి చెందిన జేసీ బ్రదర్స్ వర్గీయులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఓ కౌన్సిలర్‌కు, వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గత పాలకులు, కాంట్రాక్టర్ల నిర్వాకం వల్ల ఎస్టీపీ – 1కు వెళ్లే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్లు పాడయ్యాయి. తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. వీటిని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రత్యేక చొరవతో మరమ్మతులు చేయిస్తున్నారు. శనివారం ఎస్టీపీ–1 వద్ద మరమ్మతు పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. 31వ వార్డు కౌన్సిలర్ కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, 35వ వార్డు కౌన్సిలర్ రాఘవేంద్రతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మరమ్మతులు చేసే సిబ్బంది పనులు ప్రారంభించేందుకు ఉదయం అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఎస్టీపీ – 1 వద్దకు కొందరు టీడీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు చేరుకున్నారు. వారి వద్ద సరైన సామగ్రి లేకుండానే పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఫొటోలకు పోజులిచ్చారు. అంతటితో ఆగకుండా టీడీపీ కౌన్సిలర్లు మల్లికార్జున, విజయ్, జింకా లక్ష్మిదేవితో పాటు ఆ పార్టీ నేతలు పప్పూరు రఘునాథరెడ్డి, మల్లికార్జునరెడ్డి కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ వర్గీయుల దాడిలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ రాఘవేంద్ర, కార్యకర్త సునీల్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఉన్న రూరల్ సీఐ చిన్నపెద్దయ్య, పోలీసు సిబ్బంది ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా ఈ దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ దళిత నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. జేసీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఓటమిని జీర్ణించుకోలేక కక్ష సాధింపు చర్యలు గత సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో ఓడిపోయిన జేసీ కుటుంబీకులు ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తపనతో ఇప్పటి నుంచే కక్షలు, గొడవలకు ఆజ్యం పోస్తున్నారని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి తన వర్గీయులను రెచ్చగొడుతూ వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడులకు పాల్పడుతున్నారు. -
తాడిపత్రి : ప్రతీకార దిశగా జేసీ గ్యాంగ్
సాక్షి, తాడిపత్రి(అనంతపురం) : వైఎస్సార్సీపీలో క్రీయాశీలకంగా పనిచేయడమే కాకుండా ఎన్నికల్లో తమ ఓటమికి కారణమయ్యారనే అక్కసుతో టీడీపీ నేతలు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఓటమికి కారకులైన వారిని ఓ పథకం ప్రకారం తుదముట్టించి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. కనీసం కుటుంబంలో ఎవరినో ఒకరినైనా అంతమొందించాలనే జేసీ వర్గీయుల పన్నాగం తెలుసుకున్న ఓ బ్యాంకు ఉద్యోగి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని పోలీసులను ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. వివరాల్లోకి వెళితే.. వీరాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వంశీమోహన్‌రెడ్డి సోదరుడు అనీల్‌కుమార్‌రెడ్డి అనంతపురంలోని రామ్‌నగర్ ఏడీసీ బ్యాంకు మేనేజర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం అనిల్‌కుమార్ తన వాహనంలో వైఎస్సార్ జిల్లాలోని ఆర్ఎస్.కొండాపురానికి పని నిమిత్తం వెళ్లి తిరిగి తాడిపత్రికి బయలుదేరాడు. అయితే అనిల్ ప్రయాణిస్తున్న మారుతి ఎర్టీగా వాహనాన్ని వెనుకవైపు నుంచి బొలెరో వాహనం వెంబడిస్తూ వచ్చింది. టిఫిన్ చేసేందుకని అనిల్ తాళ్ళప్రొద్దుటూరు సమీపంలోని సుగుమంచిపల్లి సమీపంలోని బైపాస్‌లో కృష్ణా హోటల్ వద్ద తన వాహనాన్ని ఆపి వెళ్లాడు. అయితే అప్పటికే తాడిపత్రి మండలంలోని టెక్ కళాశాల సమీపంలో పథకం ప్రకారం వీరాపురం గ్రామానికి చెందిన జేసీ వర్గీయులు శివశంకర్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, రామాంజులరెడ్డి మరికొందరు బొలెరో వాహనంలో మాటేశారు. అనిల్ ప్రయాణిస్తున్న వాహనం అక్కడికి చేరుకోగానే ఢీకొట్టేందుకు యత్నించగా చాకచక్యంగా తప్పించుకుని తాడిపత్రి రూరల్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో వంశీమోహన్‌రెడ్డిపై దాడికి యత్నం బ్యాంకు మేనేజర్ అనిల్‌కుమార్‌రెడ్డి సోదరుడు వంశీమోహన్‌రెడ్డి వైఎస్సార్సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల పోలింగ్ సందర్భంగా జేసీ వర్గీయులు వంశీమోహన్‌రెడ్డిపై దాడి చేసేందుకు యత్నించారు. అయితే అప్పట్లో ఇరువార్గాల పరస్పరదాడుల్లో జేసీ వర్గీయుడు మృతి చెందాడు. ఘటన జరిగిన రోజే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అతని కుమారుడు అస్మిత్‌రెడ్డిపై వంశీమోహన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినా అప్పట్లో పోలీసుల నుంచి స్పందన లేకపోయింది. -
అరాచకం
జేసీ పీఏ రవీంద్రరెడ్డి, మరో నలుగురి నుంచి ప్రాణహాని - ఉన్నతాధికారులకు గుత్తి విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు - తాడిపత్రి గ్రానైట్ దందాపై ఏడాదిగా ఉక్కుపాదం - బుజ్జగించినా.. బెదిరించినా లొంగని అధికారి - చివరకు బదిలీ చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు - ఏడీకి నిజాయితీకి అండగా నిలిచిన సొంత శాఖ ‘‘ విధి నిర్వహణలో భాగంగా పగలు, రాత్రి కష్టపడుతున్నా. అనంతపురంతో పాటు కర్నూలు జిల్లా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. తాడిపత్రి గ్రానైట్ మాఫియాతో నాకు ప్రాణహాని ఉంది. అందుకే మీకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తున్నా. – భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌కు రాసిన లేఖలో విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి తాడిపత్రిలో గ్రానైట్ మాఫియా కొన్నేళ్లుగా అరాచకం సృష్టిస్తోంది. వ్యాపారులను గుప్పిట్లో పెట్టుకుని ఓ పెద్దమనిషి సాగిస్తున్న దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. విషయం తెలిసినా అనంతపురం, తాడిపత్రి మైనింగ్ అధికారులు చోద్యం చూడటమే తప్పిస్తే అడ్డుకోలేకపోయారు. ఓ రకంగా కీలుబొమ్మగా మారిపోయారు. సరిగ్గా రెండేళ్ల క్రితం గుత్తి విజిలెన్స్ ఏడీగా ప్రతాప్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్రమార్కుల గుండెల్లో దడ మొదలయింది. ఇక తమ ఆటలు సాగవని తెలిసి.. ఆ పెద్దమనిషి బదిలీ చేయించేందుకు సిద్ధపడిన తీరు ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, అనంతపురం: తాడిపత్రిలో 600 పైగా గ్రానైట్ పాలిష్ మిషన్లు ఉన్నాయి. వీటికి 20–30మంది ట్రాన్స్పోర్టర్లు 70 లారీలను ఏర్పాటు చేసి గ్రానైట్ రాళ్లను సరఫరా చేస్తున్నారు. తాడిపత్రి చుట్టపక్కల ఎక్కడా క్వారీలు లేవు. చిత్తూరు, మడకశిర, కర్నూలు జిల్లాల నుంచి గ్రానైట్ సరఫరా అవుతోంది. ఒకలోడు గ్రానైట్ క్వారీ నుంచి తాడిపత్రికి చేరాలంటే రూ.45వేల నుంచి రూ.50వేల రాయల్టీ చెల్లించాలి. రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్ చేర్చేలా క్వారీ, తాడిపత్రి పాలిష్ మిషన్ వ్యాపారులతో ఒప్పందం చేసుకుంటారు. గ్రానైట్లారీ క్వారీ నుంచి బయలుదేరగానే ముందు నాలుగు పైలెట్ వాహనాలు ఉంటాయి. విజిలెన్స్ అధికారులు వస్తే అప్రమత్తమై వారి నుంచి దారి తప్పించే చర్యలకు ‘పైలెట్లు’ ఉపక్రమిస్తారు. అలాగే లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణానికి, బిల్లులో తక్కువ చూపించి రవాణా చేస్తారు. ఒకే బిల్లుతో పదుల సంఖ్యలో 5–6లోడ్లను తరలిస్తారు. ఈ మొత్తం తతంగంలో అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి బాగోగులు చూసుకునేవారు. జోరోబిజినెస్ చేసేందుకు క్వారీ, మిషన్ వ్యాపారులతో బేరం కుదుర్చుకుని ఆ డబ్బును ‘తాడిపత్రి పెద్దమనిషి’కి కప్పం రూపంలో ఇచ్చేవారు. ఆయన తన పీఏ ద్వారా ‘గ్రానైట్ మాఫియా’కు కొద్దిమేర చిల్లర విదిల్చి తక్కిన డబ్బును పోగుచేసుకునేవారు. ఇలా రోజూ లక్షల రూపాయలను అప్పనంగా అర్జించారు. ప్రతాప్‌రెడ్డి రాకతో ఇబ్బందులు భూగర్భ గనుల శాఖ విజిలెన్స్ ఏడీగా ప్రతాప్‌రెడ్డి 2015 ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రిలో జరుగుతున్న అక్రమాలు చూసి నివ్వెరపోయారు. లారీలను ఆపి బిల్లులు అడిగితే లేవని చెప్పేవారు. దీంతో పెనాల్టీ రాయడం మొదలయింది. ఆ వెంటనే ‘పెద్దమనిషి పీఏ’ నుంచి ఏడీకి ఫోన్ వచ్చేది. ‘తాడిపత్రి వెహికల్స్‌పై స్టిక్కర్ చూడలేదా? అవి ఎవరివో తెలియదా? పెనాల్టీ వేశావు, నువ్వే చెల్లించి రశీదు తీసుకో!’ అని దబాయించేవారు. అయినప్పటికీ విజిలెన్స్ ఏడీ బెదరకుండా వాహనాలను సీజ్ చేయసాగారు. ఇలా రెండేళ్లలో గ్రానైట్ అక్రమ దందాపై ఉక్కపాదం మోపారు. 2015కు ముందు ఏటా కోటి రూపాయలు కూడా పెనాల్టీ డబ్బులు వచ్చేవి కాదు. కానీ 2015–16లో రూ.5.40కోట్లు, 2016–17లో రూ.5.55కోట్లు రాబట్టారు. ఇతన్ని మొదట దారికి తెచ్చుకోవాలని చూశారు. ఆ తర్వాత బెదిరించారు. చివరకు అవినీతి ఆరోపణలతో డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఏడీపై విచారణకు ఓ బృందం వచ్చి తాడిపత్రి గ్రానైట్ వ్యాపారులతో మామూళ్లు తీసుకుంటున్నారా? అని ఆరా తీశారు. ఎవ్వరూ ఏడీఏకు వ్యతిరేకంగా సమాధానం చెప్పలేదు. పైగా పెనాల్టీలు భారీగా రావడంతో అధికారులు కూడా ఏడీ వైపు నిలిచారు. అనంతపురంతో పాటు కర్నూలు జిల్లా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ఏడీఏ ఫిర్యాదుతో కలకలం తాడిపత్రి గ్రానైట్ మాఫియాతో ప్రాణహాని ఉందని భూగర్భ గనులశాఖ డైరెక్టర్‌కు గుత్తి విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి గత బుధవారం లేఖ రాయడం కలకలం సృష్టిస్తోంది. ఐదుగురి పేర్లు కూడా ఫిర్యాదులో పొందుపరిచారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పీఏ రవీంద్రారెడ్డిని నెంబర్–1గా పేర్కొన్నారు. ఇతనిపై బోలెడు క్రిమినల్ కేసులు ఉన్నాయని, స్టీఫెన్ రవీంద్ర హయాంలో ఇతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తాడిపత్రి గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు, సూర్యముని, ఎం.సుబ్బారావు అనే వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. వీరందరిపై కేసులు ఉన్నాయని కూడా ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ మాఫియా బరితెగించి గ్రానైట్ అక్రమ రవాణా సాగిస్తోందని, వీరిని కట్టడి చేసేందుకు యత్నిస్తే గ్రానైట్ మాఫియాతో పాటు రాజకీయనేతలు బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. గ్రానైట్ ఏడీఏ తనకు ప్రాణహాని ఉందని ఏకంగా పేర్లతో సహా ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.