breaking news
janagarjana
-
కేసీఆర్‌ను గద్దె దించండి: అమిత్‌షా
Amit Sha Adilabad Public Meeting Updates సాక్షి ఆదిలాబాద్: జనగర్జన వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. ఆదిలాబాద్‌లో నినాదిస్తే.. హైదరాబాద్‌లో కేసీఆర్‌కు వినిపించాలన్న అమిత్‌షా.. డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాల్లో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని అమిత్ షా ప్రకటించారు. కోమరం భీం పేరు విని రోమాలు నిక్కబోడుచుకుంటాయన్న ఆయన.. పదేళ్ల కేసీఆర్ పాలనలో సామాన్యులు, రైతులు, ఆదివాసీల సమస్యలు తీరలేదన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమన్నారు. ‘‘పదేళ్లలో కేటీఆర్‌ను సీఎం ఎలా చేయాలనే ఆలోచన మాత్రమే చేశారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడమే కేసీఆర్ లక్ష్యం. కేసీఆర్ కేవలం తన కుటుంబం కోసమేపని చేశారు. కేసీఆర్ తన కుమార్తె, కుమారుడి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ప్రధాని మోదీ ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేశారుజ ఆదివాసీల అభివృద్ధి కోసం బీజేపీ ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు’’ అంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. ‘‘తెలంగాణలో ఆధునిక రజాకర్ల నుంచి ప్రజలను బీజేపీ మాత్రమే రక్షిస్తుంది. గులాబీ పార్టీ కారు స్టీరింగ్ అసదుద్దీన్ దగ్గర ఉంది. మజ్లిస్ పార్టీ ఆదేశాలతో బీఆర్ఎస్ పనిచేస్తుంది. బీఆర్ఎస్ను ఇంటికి పంపి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి. తెలంగాణలో జనతా సర్కార్ రావాలి. కొడుకు, కూతురు కోసం పనిచేసే ప్రభుత్వం కాదు. పేదలు, రైతులు, ఆదివాసీల కోసం పనిచేసే ప్రభుత్వం రావాలి. 2024లో మరోసారి మోదీని ప్రధానిని చేయాలి. కేసీఆర్‌ను గద్దె దించి.. బీజేపీకి అధికారం ఇచ్చేందుకు పిడికిలి బిగించండి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అక్కడా.. ఇక్కడా మోదీయే. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు కాబోతుంది. రూ.200 కోట్లతో ఆదివాసీ వీరుల స్మారక మ్యూజియాలు నిర్మిస్తున్నాం’’ అని అమిత్‌షా తెలిపారు. బీఆర్ఎస్ ఏం చేసిందని ఓటు వేయాలి ►ఇప్పటి వరకు ఒక్క గ్రూప్ 1కి నోటిఫికేషన్ ఇవ్వలేదు ►యువతకి ఉద్యోగాలు ఇచ్చారా? ►బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రజలు ఓటేయాలి? ►కర్ణాటకలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ ►మోదీ రాజ్యం కావాలా? ఎంఐఎం రాజ్యం రావాలా? ►ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు అధికారం పంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి ►రాష్ట్రంలో బీజేపీని గెలిపించుకుని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ::: బండి సంజయ్ కామెంట్స్ ఐదు రాష్ట్రాల్లో అధికారం బీజేపీదే ►తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం ► తెలంగాణలోనే కాదు.. ఐదురాష్ట్రాలలో బీజేపీ విజయం సాధిస్తుంది ► ఆదిలాబాద్ టూ అర్మూర్ రైల్వే లైన్ మంజూరు చేయించా ►త్వరలో ఐదువేల కోట్లతో రైల్వే పనులు చేయిస్తా :::ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావు ► జనగర్జన సభా ప్రాంగణానికి చేరుకున్న అమిత్ షా ►ఆదిలాబాద్‌కు చేరుకున్న అమిత్ షా ► నాగపూర్ నుంచి హెలికాప్టర్లో ఆదిలాబాద్‌కు చేరిక ► స్వాగతం పలికిన కిషన్‌రెడ్డి, ఎంపీ సోయంబాపురావు.. బీజేపీ శ్రేణులు ►కాసేపట్లో జనగర్జన సభా స్థలికి అమిత్ షా చేరిక ► ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యాక రాష్ట్రంలో బీజేపీ నిర్వహించనున్న తొలి బహిరంగ సభ కావడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ►బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆ పార్టీ జాతీయ స్థాయి కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఆదిలాబాద్ రానున్నారు. జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. జనగర్జనగా దీనికి నామకరణం చేశారు. ► తాజాగా.. ఎన్నికల షెడ్యూల్ జారీ కావడంతో ఈ సభ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) పరిధిలోకి వెళ్లనుంది. ► జనగర్జన నేపథ్యంలో బీజేపీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఆదిలాబాద్ పట్టణాన్ని కాషాయ జెండాలతో నింపేసింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర రాష్ట్ర నేతల ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. షా షెడ్యూల్ ఆదిలాబాద్ జనగర్జన తర్వాత.. నేరుగా హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఇంపీరియల్ గార్డెన్లో జరిగే మేధావుల సదస్సులో పాల్గొని.. ఆపై ITC కాకతీయలో ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం, డిన్నర్లో పాల్గొంటారు. రాత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఇది కూడా చదవండి: రాజకీయం గరం గరం ‘సాక్షి’ తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి -
జనగర్జన