breaking news
jaipur plant
-
కరెంటు కోతలు లేని రాష్ర్టంగా తెలంగాణ
►ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ►తేజావత్ రామచంద్రు ►జైపూర్ ప్లాంట్‌లో పనుల పరిశీలన ►ఎస్టీపీపీ సందర్శన జైపూర్ : తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకోవడం మూలంగానే ప్రస్తుత వేసవిలోనూ నిమిషం కరెంటు కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు తేజావ త్ రామచంద్రు తెలిపారు. జైపూర్‌లో సింగరేణి సం స్థ నిర్మిస్తున్న 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాం టును మంగళవారం ఆయన సందర్శించారు. పవర్‌ప్లాంటులోని మొదటి, రెండో యూనిట్ బాయిలర్ టర్బైన్ జనరేటర్(బీటీజీ) పనులు పరిశీలించారు. ప్లాంటు పనుల పురోగతిపై ఎస్టీపీపీ జీఎం సుధాకర్‌రెడ్డితో మాట్లాడారు. నిర్మాణ పనుల ప్రగతి వివరాలను అడిగి తెలుకుసున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పట్టణాల నుంచి మొదలుకు ని పల్లెల్లో కూడా నిరంతరం కరెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. మరికొద్ది రోజుల్లో జైపూర్ సింగరేణి ప్లాం టు ద్వారా మరో 1200 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తద్వారా మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. సింగరేణి అధికారుల కృషి అభినందనీయమని అన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు రాజ్‌కుమార్‌నాయక్, ఎస్టీపీపీ ఏజీఎం శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు. -
నేడు జైపూర్ ప్లాంటుకు సీఎం శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్/జగదేవ్‌పూర్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి నిర్మించనున్న 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుకు సీఎం కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. సింగరేణి ఆధ్వర్యంలో జైపూర్‌లో ప్రస్తుతం 1200 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ల నిర్మిస్తున్నారు. ఫాంహౌస్‌కు చేరుకున్న కేసీఆర్ సీఎం కేసీఆర్ సోమవారం కరీంనగర్ జిల్లాలో పర్యటన అనంతరం హెలికాప్టర్లో మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. సాయంత్రం వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు. కాగా, మంగళవారం సీఎం బాన్సువాడకు వెళ్లనున్నట్లు సమాచారం