breaking news
ITR -1
-
ఐటీఆర్ ఫైలింగ్.. జూలై 31 లాస్ట్ డేట్!
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను మీరు వేయవలసిన ఆదాయపు రిటర్నులలో రెండు ఫారాలు ఉంటాయి. ఒకటి నంబర్ 1, రెండోది నంబర్ 4. వీటిని దాఖలు చేయడానికి డిపార్టుమెంటు వారి తరఫున ప్లాట్‌ఫాం రెడీ అయ్యింది. ఇందుకు అవసరమైన యుటిలిటీలను, సాధనాలను వారు సన్నద్ధం చేశారు. ఈ వారం ఐటీఆర్1 గురించి తెలుసుకుందాం. దీన్నే సహజ్ అని కూడా అంటారు. మీరు ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్‌లైన్ ద్వారా వేయొచ్చు.ఎవరు దాఖలు చేయొచ్చు..కేవలం రెసిడెంట్ వ్యక్తులైన వారు మాత్రమే ఈ ఫారం ఐటీఆర్–1 లేదా సహజ్ వేయగలరు. ఇతరులెవ్వరూ ఈ ఫారంను వేయడానికి లేదు. ఎంత ఆదాయం వచ్చే వారు వేయొచ్చు.. ఈ కింది మార్గాల్లో ఆదాయాలు వచ్చే వారు ఈ ఫారం వాడాలి. పెన్షన్జీతాలుఒకటి/రెండు ఇళ్ల మీద ఇంటద్దె వచ్చే వాళ్లుఇతర ఆదాయంవ్యవసాయ ఆదాయం రూ. 5000 లోపు ఉన్న వారుఇతర షరతులు..మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటిన వారు ఈ ఫారం కింద ఆదాయం డిక్లేర్ చేయకూడదు. భార్య ఆదాయం, పిల్లల ఆదాయం, భర్త కేసులో కలిపే సందర్భం ఏర్పడితే, రూ. 50,00,000 దాటనంత వరకు ఈ ఫారం వాడొచ్చు. రూ. 1,25,000 లోపల లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటే, అటువంటి వారు ఫారం 1 వాడొచ్చు.ఏయే కాగితాలు ఉండాలి..పాత చట్టం ప్రకారం 16, 16ఎ, ప్రీమియం మొదలైన వాటి రశీదులు, అద్దె రశీదులు, మొదలైనవి మీ ఫైల్లో ఉండాలి. రిటర్నుతో పాటు జతపరచనవసరం లేదు కానీ రెడీగా ఉంచుకోండి.ఎవరు ఫారం 1 దాఖలు చేయకూడదు..మీ మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటితే.వ్యవసాయం మీద నికర ఆదాయం రూ. 5,000 దాటితే.లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రూ. 1,25,000 దాటితే. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎలాగు రూ. 1,25,000 వరకు మినహాయింపు ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రూ. 1,250,000 వరకు పన్ను భారం ఉండదు. వృత్తి మీద ఆదాయం ఉన్నవారు.వ్యాపారం మీద ఆదాయం ఉన్నవారు.ఒకటి, రెండు దాటి .. అంటే మూడో ఇంటి మీద ఆదాయం వచ్చే వాళ్లు వేయకూడదు.ఏదైనా కంపెనీలో డైరెక్టర్ అయితేఅన్లిస్టెడ్ ఈక్విటీ షేర్ల మీద ఆదాయం ఉంటేవిదేశాల్లో ఆస్తులున్నా, వాటి మీద హక్కులున్నామీరు నాన్ రెసిడెంటు అయినావిదేశాల నుంచి ఆదాయం ఉన్నా194ఎన్ (పాత చట్టం) ప్రకారం టీడీఎస్ రికవరీ అయితే, అతి పెద్ద నగదు విత్‌డ్రాయల్స్ మీదఉద్యోగస్తుల స్టాక్ / షేర్ల మీద ఎటువంటి చెల్లింపులు, రికవరీలు ఉన్నాగత సంవత్సరపు సర్దుబాటు నష్టాలున్నాఏ ఆదాయం నుంచైనా సర్దుబాటు చేయాల్సిన నష్టాలున్నాచివరగా..ఫైలింగ్ చేయడానికి గడువు తేదీ 2026 జూలై 31. ఆన్లైన్లో వేయొచ్చు లేదా ఎక్సెల్లాంటి యుటిలిటీ ద్వారా డౌన్లోడ్ చేసి దాఖలు చేసుకోవచ్చు. ఎన్నెన్నో సాఫ్ట్వేర్లు ఉన్నాయి. మీరే స్వయంగా వేయొచ్చు లేదా వృత్తి నిపుణులు ఉన్నారు. సమాచారం సరైనది. సమగ్రమైనది. సంపూర్ణమైనది. రెడీగా ఉంటే సరైనదే, సమగ్రంగా, సంపూర్ణంగా, రెడీగా ఉంటే సులభతరంగా వేయొచ్చు. ఫారంలు చాలా స్నేహపూర్వకంగానే ఉంటాయి. -
రిటర్న్స్ ఫైలింగ్ మరింత సులభం
న్యూఢిల్లీ: రిటర్న్స్ ఫైలింగ్‌ను కేంద్రం మరింత సులభతరం చేసింది.ఉద్యోగులకు సంబంధించి ఐటీఆర్ ఫామ్‌ను మరింత సరళతరం చేసింది. క్లిష్టతతో ఉన్న కొన్ని కాలమ్‌లను సవరిస్తూ, అలాగే ‘డిడక్షన్స్ కోరడానికి సంబంధించి’ మరికొన్ని కాలమ్స్‌ను చేర్చుతూ, రూపొందించిన కొత్త ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ 1 ‘సహజ్’ ఏప్రిల్ 1 నుంచీ అమల్లోకి రానుంది. ప్రక్రియను సరళతరం చేసి, మరింత మంది రిటర్న్స్ దాఖలు చేయడాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా తాజా చొరవ తీసుకున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దాదాపు 29 కోట్ల మందికి పర్మినెంట్ అకౌంట్ నంబర్లు ఉంటే, వీరిలో కేవలం ఆరు కోట్ల మంది మాత్రమే రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. కాగా ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య ఆన్‌లైన్‌లోనూ ఐటీఆర్–1 ఫామ్‌ను దాఖలు చేసే వీలుంది. తోషిబా అమెరికా యూనిట్ దివాలా వాషింగ్టన్: తీవ్ర నష్టాల్లో ఉన్న తోషిబా అమెరికా నూక్లియర్ యూనిట్ ‘వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ’ న్యూయార్క్ కోర్టులో దివాళా రక్షణ పిటిషన్‌ను దాఖలు చేసింది. మోసపూరిత క్లెయిమ్‌లు, భారీ నష్టాలే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్, దాని అనుబంధ కంపెనీలు స్వచ్చందంగా అమెరికా దివాళా చట్టం చాప్టర్ 11 కింద ఈ పిటిషన్లు దాఖలు చేసినట్టు ప్రకటించింది.


