breaking news
IT law
-
సోషల్ మీడియాకు సంకెళ్లు
గత ఏడాది ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో షికార్లు చేసిన పుకార్లు.. దేశంలో పలుచోట్ల అల్లర్లు, మూక హత్యలకు అసలు కారణంగా నిలిచాయి. దీంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, పుకార్లను కట్టడిచేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు కదిలింది. కొత్త సంవత్సరంలో ఈ దిశగా ఐటీ చట్టాన్ని సవరిస్తోంది. భారీగా జరిమానాలు వేసి అసత్యవార్తలు, అశ్లీల సమాచారాన్ని వ్యాప్తి చేసే మాధ్యమాలను నియంత్రించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలకు భారత్‌లో ఖాతాదారులు చాలా ఎక్కువ. గత ఏడాది అనుభవాలతో ఇవి కొన్ని నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ఫేక్ న్యూస్‌పై ప్రజలకు అవగాహన కలిగిస్తూ, హెచ్చరిస్తూ భారీస్థాయిలో ప్రకటనలు ఇస్తున్నాయి. అసభ్య, అసత్య సందేశాలు, సమాచారం పంపకుండా ఖాతాదారులను కట్టడి చేసేందుకు యత్నిస్తున్నాయి. కేంద్రం హెచ్చరికలు ఖాతాదారుల సమాచారాన్ని దొంగిలించి తద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీ మంత్రి రవి శంకర్ ఫేస్బుక్, వాట్సాప్‌లను హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో తమ మాధ్యమం ద్వారా అనైతిక సమాచారం వ్యాప్తి కాకుండా ఫేస్బుక్ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో ఎన్నికల ప్రకటనలు పోస్టుచేసే వారు వారి వివరాలు, ఎక్కడ నుంచి పోస్టు చేస్తున్నారనేవి విధిగా వెల్లడించాల్సిందే. 15 కోట్ల వరకు జరిమానా వదంతులు, అశ్లీల సమాచారాన్ని, దృశ్యాలను నియం త్రించడంలో విఫలమైన వెబ్సైట్లు, యాప్‌లపై భారీ జరిమానా విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ‘ డేటా ప్రొటెక్షన్ బిల్లు’ పేరుతో ముసాయిదాను ఖరారు చేసింది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, గూగుల్ వంటి సోషల్ మీడియా, ఇంటర్నెట్ సంస్థల అధిపతులతో ఐటీ శాఖ అధికారులు సమావేశమయ్యారు. మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టి, వాటి జవాబుదారీతనాన్ని పెంచే మార్గాలపై చర్చించారు. ‘అసత్య, అశ్లీల సమాచా రం సోషల్ మీడియాలోకి ఎక్కడ నుంచి వస్తోందో గుర్తించాలి, దాన్ని తొలగించాలి. ఈ దిశగా ప్రభుత్వం చట్టాన్ని సవరించనుంది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండాలి’ అని ఓ ఉన్నతాధికారి అన్నారు. నిబంధలను ఉల్లంఘించిన కంపెనీలపై రూ. 15 కోట్లు లేదా వాటి ప్రపంచవ్యాప్త టర్నోవర్‌లో 4శాతం ఈ రెండింటిలో ఏది ఎక్కువయితే దాన్ని జరిమానాగా విధించాలని ప్రతిపాదించారు. -
నెట్లో అశ్లీలతను అడ్డుకుంటాం
ఐటీ చట్టాలనూ కఠినతరం చేస్తాం రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ సిటీబ్యూరో: మహిళలు, పిల్లలపై పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ఐటీ చట్టాలను మరింత కఠినతరం చేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లలో అశ్లీలతను వీలైనంత వరకు తగ్గించాల్సి ఉందన్నారు. ఇందుకోసం ఐటీ నిపుణులు, పోలీసు అధికారులు కృషి చేయాలన్నారు. మహిళలు, పిల్లల భద్రత, రక్షణ చర్యలపై గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో శనివారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హోంశాఖ అదనపు కార్యదర్శి సౌమ్యామిశ్రా, ఐటీ కార్యదర్శి హరిప్రీత్‌సింగ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ప్రముఖ ఐటీ నిపుణులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా భద్రతా కమిటీ చైర్పర్సన్ పూనం మాలకొండయ్య సిఫార్సులను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా నివారణ.. స్మార్ట్ ఫోన్లలో అశ్లీలత వెబ్సైట్లను అరికట్టేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నామని సైబరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు. ఇందుకు సెల్‌ఫోన్ తయారీదారుల సహాయాన్ని కోరుతున్నామన్నారు. అశ్లీలతను నిరోధించడానికి మీడియాను కూడా భాగస్వామ్యం చేస్తామన్నారు. సమావేశంలో డీసీపీలు రమారాజేశ్వరీ, కార్తీకేయ, ఇన్స్పెక్టర్ రమేశ్‌కుమార్ పాల్గొన్నారు.