breaking news
ISL structures
-
పక్కా ప్రణాళికతో ‘స్వచ్ఛ సిరిసిల్ల’
26వరకు ఐఎస్ఎల్ నిర్మాణాలు పూర్తి ► వార్డుల్లో కౌన్సిలర్ల సహకారం అవసరం ► జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా ►సిరిసిల్ల మున్సిపల్ అత్యవసర సమావేశం సిరిసిల్ల టౌన్: జిల్లా కేంద్రాన్ని ‘స్వచ్ఛ సిరిసిల్ల’గా మార్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం పక్కా ప్రణాళికను అనుసరిస్తుందని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. జిల్లా ముఖచిత్రమైన సిరిసిల్లలో నూరుశాతం ఐఎస్ఎల్ సాధించాల్సిన అవసరం ఉందని ఇందుకు అన్ని వార్డుల్లో కౌన్సిలర్ల పాత్ర ఉండాలని సూచించారు. నూరుశాతం శానిటేషన్ కోసం గురువారం సాయంత్రం మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఆమె మాట్లాడారు. గతంలో 2వేల వరకు ఐఎస్ఎల్ నిర్మాణాలు చేపట్టాల్సినట్లుగా గుర్తించినా వివిధ కారణాలతో వాటి గణాంకాలు రెండింతలు పెరిగిందదన్నారు. ఈనెల 26వరకు పట్టణంలో పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఐఎస్ఎల్ నిర్మాణాలకు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందుతుందన్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో నూరుశాతం ఐఎస్ఎల్ ప్రకటించుకున్నాయని హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛ సిరిసిల్ల కోసం ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రజలతో సంఘటితంగా ముందుకెళ్లాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలోనే జిల్లాను అభివృద్ధి పథంలో ఉంచాలన్న మంత్రి కేటీఆర్ ఆశయానికి అందరూ సహకరించాలని కోరారు. నోట్లరద్దు తదితర ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాశయాన్ని అధికారులు, కౌన్సిలర్లు నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందరూ దృష్టి సారిస్తే నూరుశాతం శానిటేషన్ సాధన పెద్దసమస్య కాదని స్పష్టం చేశారు. స్థానికంగా పేరుకుపోయిన సమస్యలను కౌన్సిలర్లు ఆమె దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బడుగు సుమన్ రావు, ప్రత్యేకాధికారి శ్రీధర్, డీఈఈ ప్రభువర్ధన్ రెడ్డి, వైస్‌చైర్మన్ తౌటు కనుకయ్య, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐఎస్ఎల్.. నిల్!
* నత్తనడకన నిర్మాణాలు * ఇసుక కొరత, అవగాహన లేమి కారణం * ఏడాదిన్నర కాలంలో కేవలం 29 శాతమే పూర్తి మండపేట : నిధుల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్యం, స్థల సమస్య, ఇసుక కొరతలకు తోడు ప్రజల్లో అవగాహనలే మి ఇవన్నీ వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐఎస్ఎల్) నిర్మాణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో జిల్లాలో ఐఎస్ఎల్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం 29 శాతం మాత్రమే పూర్తయ్యాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. పదివేలు మంజూరు చేస్తోంది. ఈ మొత్తంలో ఎన్ఆర్ఈజీఎస్ నుంచి రూ.5,400, ఆర్డబ్ల్యూఎస్ నుంచి రూ.4,600 చెల్లిస్తోంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రభుత్వ సాయాన్ని రూ.12 వేలకు పెంచింది. అక్టోబరు రెండో తేదీ నుంచి మంజూరైన వాటికి మాత్రమే ఇది వర్తిస్తుందని సమాచారం. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు 1,53,835 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు కేవలం 44,532 మాత్రమే పూర్తయ్యాయి. 37,226 నిర్మాణ దశలో ఉన్నాయి. మిగిలినవి ఇంకా నిర్మాణ పనులకు నోచుకోలేదు. స్థల సమస్యతో అధిక శాతం నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఐఎస్ఎల్ పథకానికి లబ్ధిదారుడిగా ఎంపికైనా, నిర్మాణానికి సరైన స్థలం లేకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇసుక ధర పెరగడంతో... ఇసుక రీచ్‌లు మూతపడి ఇసుక ధర రెట్టింపు కావడంతో ఐఎస్ఎల్ నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. ప్రభుత్వసాయం ఇసుక ధర సరిపోక నిర్మాణంలో ఉన్నవి నిలిచిపోగా, కొత్తగా నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. మరోపక్క బహిరంగ మలవిసర్జన వల్ల కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్యవంతులుగా చేయడంలో యంత్రాంగం విఫలమవుతుందనే విమర్శలూ ఉన్నాయి. మరోవైపు నిర్మాణ పనులు పూర్తయినా సకాలంలో బిల్లులు అందడం లేదని తెలుస్తోంది. ఫలితంగా నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోతున్నాయని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం కోసం విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్నాం. అయితే ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్మాణం పూర్తయిన వాటికి సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం. - భవానీ, డ్వామా పీడీ