breaking news
the international film festivals
-
ఇఫీకి అంతా సిద్ధం
ఈ ఏడాది జరగనున్న ‘ది ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ)కి రంగం సిద్ధం అయింది. 53వ ఇఫీ వేడుకలు గోవాలో నవంబరు 20 నుంచి 28 వరకు జరగనున్నాయి. పన్నెండుమంది సభ్యులున్న జ్యూరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 25 సినిమాలను, ఆరుగురు సభ్యుల జ్యూరీ నాన్ – ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 20 సినిమాలను ఎంపిక చేసింది. ఇండియన్ పనోరమ సెక్షన్ కింద ఈ 45 చిత్రాలు ప్రదర్శించబడతాయి. ఇందులో పది హిందీ చిత్రాలు, ఐదు మరాఠీ చిత్రాలు, నాలుగేసి చొప్పన తెలుగు, తమిళ సినిమాలు, ఇంకా ఇతర భాషల చిత్రాలు ఉన్నాయి. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం..రణం..రుధిరం), బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’, హిందీ నుంచి అడివి శేష్ ‘మేజర్’, అనుపమ్ ఖేర్ – పల్లవీ జోషి భాగమైన ‘ది కశ్మీరీ ఫైల్స్’, ఆర్ఏ వెంకట్ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తమిళ చిత్రం ‘కిడ’ వంటివి ఉన్నాయి. నాన్–ఫీచర్ విభాగంలో ‘టాంగ్’, ‘రే– ఆర్ట్ ఆఫ్ సత్యజిత్ రే’, ‘క్లింటన్ అండ్ ఫాతిమా’ వంటి సినిమాలు ఉన్నాయి. కాగా మెయిన్‌స్ట్రీమ్ సెక్షన్లో ‘ది కశ్మీరీ ఫైల్స్’ (హిందీ), ‘ఆర్ఆర్ఆర్’ (తెలుగు), ‘అఖండ’ (తెలుగు), ‘టానిక్’ (బెంగాలీ), ‘ధర్మవీర్: ముక్కమ్ పోస్ట్’ (మరాఠీ) చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇండియన్ పనోరమ సెక్షన్లో తెలుగు చిత్రాలు ‘సినిమా బండి’ (దర్శకుడు కంద్రేగుల ప్రవీణ్), ‘ఖుదీరామ్ బోస్’ (దర్శకుడు విద్యాసాగర్ రాజు) ఉన్నాయి. -
రష్యన్ సినిమాకు ‘గోల్డెన్ పీకాక్’
పణజి: భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో(ఇఫీ) రష్యన్ సినిమా ‘లెవియాథన్’కు ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కింది. రైతు ఆత్మహత్య నేపథ్యంతో సాగే మరాఠీ సినిమా ‘ఏక్ హజారాచీ నోట్’ ఉత్తమ చిత్రంగా సెంటినరీ ట్రోఫీని కైవసం చేసుకుంది. 45వ ఇఫీ అవార్డుల కార్యక్రమం ఆదివారమిక్కడ ముగిసింది. తన భూమికోసం పోరాడే వ్యక్తి కథతో తెరకెక్కిన ‘లెవియాథన్’ హీరో అలెక్సెల్ సెరెబ్రియాకోవ్, సర్కస్‌లో పనిచేసే మరుగుజ్జుల జీవితాన్ని చిత్రించిన బెంగాలీ సినిమా ‘చోటోదర్ చోబీ’ నటుడు దులాల్ సర్కార్లకు ఉత్తమ నటుడి పురస్కారాన్ని సంయుక్తంగా అందించారు. వారికి దీన్ని కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్, నటుడు జాకీ ష్రాఫ్‌లు ప్రదానం చేశారు. క్యూబన్-స్పానిష్ సినిమా ‘బిహేవియర్’లో నటించిన క్యూబన్ నటి ఎరీనా రోడ్రిగ్, ఇజ్రాయెల్ సినిమా ‘కిండర్‌గార్టెన్ టీచర్’ నటి సరిత్ లారీలు ఉత్తమ నటి పురస్కారాన్ని సంయుక్తంగా అందుకున్నారు. వీరికి కేంద్ర మంత్రి మనోహర్ పారికర్, నటుడు నానా పటేకర్లు అవార్డు అందించారు. ‘కిండర్‌గార్టెన్ టీచర్’ దర్శకుడు నదాఫ్ లాపిడ్‌కు ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. హాంకాంగ్ దర్శకనిర్మాత వాంగ్ కారవాయ్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.