breaking news
Inter student Bhavani
-
భవానీ మృతికి కారణమైన లెక్చరర్ అరెస్ట్
నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థిని భవానీ ఆత్మహత్యకు కారణమైన ఫిజిక్స్ లెక్చరర్ శ్రీనివాస్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శనివారం విలేకరులకు తెలిపారు. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. మొదట తనకేమీ తెలీదని బుకాయించిన టీచకుడు.. చివరికి బాలికతో అసభ్యంగా వ్యవహరించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో సదరు వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఈ రోజు పోలీసులు తెలిపారు. -
నిందితుడిని ఉరితీయాలి
నల్లగొండ క్రైం : ఇంటర్ విద్యార్థిని భవానికి మృతికి కారణమైన ఫిజిక్స్ లెక్చరర్ శ్రీనివాస్‌ను ఉరితీయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ విద్యార్థి సంఘం శుక్రవారం వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు ఎస్పీ కార్యాలయం నిరసన ర్యాలీ నిర్వహించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డి ఎస్పీ కార్యాలయం వద్ద ధ ర్నాకు దిగడం, కార్యాలయంలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో విద్యార్థులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలిస్తున్నామని కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ రాములునాయక్ విద్యార్థులకు నచ్చజెప్పారు. అయినా విద్యార్థులు ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు చెదరగొట్టారు. 15 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి, సాయంత్రం వదిలిపెట్టారు. నగర కార్యదర్శి లింగరాజు, సంతోష్‌నాయక్, ఏడుకొండల్, గణేష్, రాహుల్, రాంరెడ్డి, అనిల్ , మహేందర్, నవీన్, రంజిత్, ప్రశాంత్, ప్రసన్న, పవన్,అశోక్ పాల్గొన్నారు.