breaking news
Industrial Training
-
పారిశ్రామిక శిక్షణ సంస్థకు దరఖాస్తులు
కందుకూరు అర్బన్: స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో 2016–17 సంత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి రెండో విడత దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ ఏ.రాజేశ్వరరావు తెలిపారు. డ్రాఫ్ట్‌మెన్ సివిల్, ఫిట్టర్ తదితర ఖాళీలను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులన్నారు. రూ.10 చెల్లించి స్థానిక ఐటీఐ కళాశాలలో 20 నుంచి దరఖాస్తులు పొందాలన్నారు. దరఖాస్తులను వచ్చే నెల 10 లోపు అందజేయాలన్నారు. వివరాలకు ఫోన్:08598 224497 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. -
డిగ్రీ సిలబస్‌లో మార్పు
- 10 కొత్త కోర్సులు - సెమిస్టర్ విధానం - ఇండస్ట్రియల్ ట్రైనింగ్ - ప్రాజెక్ట్ వర్క్ - ఉపాధి లక్ష్యంగా కోర్సులు యూనివర్సిటీక్యాంపస్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కోర్సుల్లో పెనుమార్పులు తీసుకొస్తున్నట్టు ఎస్వీయూ వీసీ రాజేంద్ర తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిగ్రీ స్థాయిలో సిలబస్ మార్పుచేసి వృత్తినైపుణ్యం కల్గిన విద్యను అందించే లక్ష్యంగా డిగ్రీలో మార్పులు చేస్తున్నామన్నారు. ఉన్నత విద్యామండలి సూచన మేరకు కరికులమ్ అప్‌గ్రేడేషన్, నైపుణ్యాల అభివృద్ధి, ప్రాజెక్ట్ వర్క్, అప్రెంటీస్ విధానం, నెట్ ఆధారిత కోర్సులు ప్రవేశ పెడుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఎస్వీయూ నూతన సిలబస్‌ను రూపొందించే బాధ్యత తీసుకుందన్నారు. ఇందులో భాగంగా వారం రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, సీడీసీ డీన్లతో సమీక్షించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ బుధవారం ప్రారంభమై ఈనెల 10వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ స్థాయిలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్టు తెలిపారు. రెగ్యులర్ సబ్జెక్ట్లతో పాటు 10 కొత్త సబ్జెక్ట్‌లను ప్రవేశ పెడుతున్నామన్నారు. నూతన సబ్జెక్టులు ఇవే.. 1. ఇండియన్ హెరిటేజ్ కల్చర్, 2. హూమన్ వ్యాల్యూస్ అండ్ ఎథిక్స్, 3.ఎన్విరాన్మెంటల్ స్టడీస్, 4. ఫండమెంటల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, 5. బిల్డింగ్ వొకాబులరీ, 6. ప్రొపెషనల్ లైప్ స్కిల్స్-1, 7. కమ్యూనికేషన్ ప్రాక్టీస్-1, 8.కమ్యూనికేషన్ ప్రాక్టీస్-2, 9. ప్రొపెషనల్ లైప్ స్కిల్స్-2, 10. కమ్యూనికేషన్ ప్రాక్టీస్-3 (రైటింగ్స్కిల్స్)లను ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. విద్యార్థులకు ప్రాజెక్ట్ కోర్సులో భాగంగా విద్యార్థులు ప్రాక్టికల్ అనుభవం కోసం ప్రాజెక్ట్ వర్క్‌ను తప్పని సరిగా చేయాల్సి ఉంటుందన్నారు. మూక్స్ పేరిట ఇంటర్నెట్ బేస్డ్ కోర్సులు, పరీక్షలు ఉంటాయన్నారు. ఎంటర్ ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్, సీబీసీఎస్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నామన్నారు. వివిధ విశ్వవిద్యాలయాలు ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసుకొని స్థానిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఎస్వీయూలో 3 సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్ర యత్నిస్తున్నామని, ఈ ప్రక్రియను ఎస్వీయూ డెరైక్టర్లు కిరణ్ కాంత్ చౌదరి, గోవిందరాజులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.