breaking news
Indian author
-
టాప్–100 రచయితల్లో మనవాళ్లు
లండన్: ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఇంగ్లిష్ నవలలు రాసిన మొదటి 100 మందిలో.. ప్రముఖ భారతీయ రచయితలు ఆర్కే నారాయణ్, అరుంధతి రాయ్, సల్మాన్ రష్దీ, విక్రమ్ సేత్లకు చోటు దక్కింది. బీబీసీ నిపుణులు ఎంపిక చేసిన ప్రపంచ ప్రఖ్యాత రచయితల జాబితాలో వీరి పేర్లున్నాయి. బీబీసీ నియమించిన నిపుణుల కమిటీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సంప్రదాయ సాహిత్యం నుంచి సమకాలీన సాహిత్యం వరకు 100 రచనల్ని ఎంపిక చేసి వాటిని ప్రేమ, రాజకీయం, అధికారం, బాలసాహిత్యం, సమాజం వంటి పది కేటగిరీలుగా విభజించింది. ఒక్కో కేటగిరీ కింద ఏడాది పాటు శ్రమించి కొన్ని పుస్తకాలను ఈ బృందం ఎంపిక చేసింది. ఇందులో అరుంధతి రాయ్ రాసిన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్’పుస్తకం ఐడెంటిటీ కేటగిరీలోను, ఆర్కే నారాయణ్ ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’కమింగ్ ఆఫ్ ఏజ్ సెక్షన్లో, సల్మాన్ రష్దీ రాసిన ‘ది మూర్స్ లాస్ట్ సై’రూల్ బ్రేకర్స్ విభాగంలో ఎంపికయ్యాయి. విక్రమ్ సేథ్ రాసిన నవల ‘ఎ స్యూటబుల్ బోయ్’ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్షిప్ కేటగిరీ, వీఎస్ నైపాల్ రచించిన ‘ఎ హౌస్ ఆఫ్ మిస్టర్ బిశ్వాస్’కు క్లాస్ అండ్ సొసైటీ విభాగంలో చోటు దక్కింది. పాక్ రచయితలు మొహ్సీన్ హమీద్, కమిలా షమ్సీలు రాసిన ది రిలక్టాంట్ ఫండమెంటలిస్ట్, హోం ఫైర్, అఫ్గాన్–అమెరికన్ రచయిత ఖలేద్ హొస్సైనీ రాసిన ఎ థౌజెండ్ స్లె్పండిడ్ సన్స్ నవలకు చోటు దక్కింది. ఆంగ్లంలో తొలి నవలగా భావించే ‘రాబిన్సన్ క్రూసో ’ప్రచురితమై 300 ఏళ్లు పూర్తవడంతో ఈ జాబితా తెచ్చారు. -
ఇంగ్లిష్... ఆరి దేవుడా!
సాహితీ వ్యాఖ్య ఇంగ్లిష్లో రాస్తున్న ప్రతి భారతీయ రచయితనూ పాశ్చాత్య ప్రపంచం గమనిస్తూ ఇతనేనేమో సరైన ప్రతినిధి ఇతనేనేమో భారతీయ సాహిత్యానికి కచ్చితమైన ప్రతినిధి అని బేరీజు వేస్తోంది. దురదృష్టం ఏమిటంటే అలాంటి ఒక్క రచయితా లేకపోవడం. ఆఖరుకు మనం నాసిరకం విషయాలను రాసే చేతన్ భగత్ లాంటివాళ్లను సృష్టించుకున్నాం. ఇంగ్లిష్లో రాసే నాలాంటి వాళ్లతో సహా ఏమి రాస్తాం అనేది కాకుండా ‘ఏది వారికి పనికొస్తుంది’ అనే రంధిలో పడ్డాం. ఫలితంగా మేము ఏమి రాసినా అందులో నిజాయితీ, నిజమైన భారతీయ ప్రాతినిధ్యం ఉండే అవకాశం లేదు. భారతీయ సాహితీ సమాజం ఇంగ్లిష్ అనే ఒక చక్రబంధంలో ఇరుక్కుని ఉంది. గతంలో రవీంద్రనాథ్ టాగోర్, ప్రేమ్చంద్, ఇక్బాల్ వంటి వారు ఒకటి కంటే ఎక్కువ భాషల్లో రాసేవారు. ఇప్పుడు అది ఒక భాషకు పడిపోయింది. ఆ ఒక భాష ఇంగ్లిష్ కావడం విషాదం.... - ఆతిష్ తాసిన్ ‘నూన్’ నవలా రచయిత; జర్నలిస్ట్ తవ్లీన్ సింగ్ కుమారుడు