breaking news
illegal land acquisition
-
పా‘పాల’ ధూళిపాళ్ల..‘అవినీతి అనకొండ’
ఆధ్యాత్మిక తరంగాలతో పులకించే పొన్నూరును అవినీతి ‘ధూళి’ కమ్మేసింది. వరుసగా ఐదుసార్లు ప్రజా ప్రతినిధిగా గెలిపించిన అక్కడి ప్రజలను అడ్డంగా దోచుకున్నారు. ఇసుక, గ్రావెల్, మెటల్ దేన్నీ వదల్లేదు. ‘సంగం డెయిరీ’ని సొంత ఆస్తిలా మార్చుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన సొంత పార్టీ వారిపైనా దాడులకు తెగబడ్డారు. నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఎమ్మెల్యే కిలారి రోశయ్యపై శ్వేతపత్రం అంటూ హంగామా సృష్టిస్తున్నారు. ఇదీ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అవినీతి చిట్టా. సాక్షి ప్రతినిధి, గుంటూరు: నరేంద్ర ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్వారీలు, రీచ్‌ల్లో అక్రమాలకు పాల్పడి కోట్లు దండుకున్నారు. తుళ్లూరు మండలం అనంతవరం పంచాయతీ పరిధిలో మెటల్ సరఫరాకు ప్రభుత్వం అనుమతులు ఇస్తే వాటిని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి కాసులు కాజేశారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం, పెనుమాక సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల్లో ఈయన సోదరులే కీలకం. ఇసుక రీచ్‌లపైనే ఆయన సుమారు రూ.500 కోట్లు సంపాదించారంటే ఆయన అవినీతి ఏ స్థాయిదో అర్థమవుతుంది. కొలనుకొండలో అటవీశాఖ భూమిలో ఒక వ్యక్తి మైనింగ్ కోసం అనుమతులు తీసుకుంటే ఆయన్ను బెదిరించి లాభాల్లో 40 శాతం వాటా దక్కించుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు క్వారీ మొత్తాన్నీ కొట్టేశారు. ఆత్మకూరు చెరువులో 80 ఎకరాల్లో గ్రావెల్ తవ్వుకుంటున్న లీజుదారుడిని బెదిరించి దాన్నీ కబళించారు. గుంటూరు నుంచి తెనాలి మధ్య జరుగుతున్న రైల్వే డబ్లింగ్ వర్క్ పనులకు గ్రావెల్ తరలించే కాంట్రాక్టు దక్కించుకుని చేబ్రోలు మండలంలోని శేకూరు, చేబ్రోలు చెరువుల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. వడ్లమూడి, చేబ్రోలు, శేకూరు గ్రామాల్లో ఎమ్మెల్యే సోదరుడు, అతని బినామీలు కలిపి అక్రమ క్వారీయింగ్ చేశారు. చేబ్రోలు మండల పరిధిలోని సుద్దపల్లిలో 25 ఎకరాల పెద్ద చెరువును క్వారీగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకుంటే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. సంగం ఆస్తులు స్వాహా.. ► పాడి రైతుల కష్టార్జితంతో ఏర్పాటు చేసిన సంగం డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల స్వాహా చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా డెయిరీ ప్రాంగణంలో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్మించారు. ► చేబ్రోలు మండలం వడ్లమూడిలో 1977లో స్థాపించిన గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (సంగం డెయిరీ) మొదట్లో 1964 సహకార చట్టం ప్రకారం పూర్తిగా ప్రభుత్వ ఆ«దీనంలో కొనసాగింది. తరువాత 1995లో చంద్రబాబు హయాంలో మ్యాక్స్ చట్టంలోకి వచ్చిన తరువాత కొంతమేర ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించారు. ఈ చట్ట ప్రకారం గుత్తాధిపత్యం పాలకవర్గం అజమాయిïÙలో ఉండేది. ► 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కంపెనీ యాక్ట్‌లోకి మార్చారు. అప్పటి నుంచి నరేంద్ర తన చేతుల్లోకి తీసుకుని ఆయనే చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 1994లో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పది ఎకరాల డెయిరీ స్థలాన్ని ట్రస్టుకు బదలాయించారు. విలువైన భూములూ హాంఫట్... అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రాంతంలో రూ. కోట్లు విలువైన పోరంబోకు భూములను అడ్డగోలుగా ఆక్రమించేశారు. పెదకాకాని మండలం నంబూరు వాగు పోరంబోకు భూములను తమ బంధువు పేరుతో ఆక్రమించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రెండు, మూడు చేతులు మార్చినట్లుగా డాక్యుమెంటు నంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజి్రస్టేషన్ చేయించారు. పొన్నూరు దేవదాయ శాఖ భూముల్ని ఆక్రమించి తన తండ్రి పేరుతో కాలనీలు ఏర్పాటు చేశారు. కేవలం తమ సామాజికవర్గం ఉండే ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోలేదు. 2019 లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే రోశయ్య నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతుంటే ఏం చేయాలో పాలుపోక ఆయనపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. కల్యాణ మండపం నిర్వహణతో కాసుల వేట పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో పాడి రైతులు తమ సంఘం నిధులతో రోడ్డుపక్కన 30 సెంట్ల స్థలం కొన్నారు. ఈ స్థలంలో ధూళిపాళ్ల తన తండ్రి పేరుతో కల్యాణ మండపాన్ని 2003లో నిర్మించారు. ఆ సమయంలో నలుగురు ఎంపీలు ఈ కల్యాణ మండప నిర్మాణానికి వారి ఎంపీ నిధులు కింద రూ. 23 కోట్లు మంజూరు చేశారు. సాధారణంగా ఎంపీ, ఎమ్మెల్యే నిధుల ద్వారా నిర్మించిన ఏ నిర్మాణాలైనా పంచాయతీ, మున్సిపాలిటీ ఆధీనంలోనే ఉండాలి. కల్యాణ మండపానికి నరేంద్ర తల్లి చైర్మన్‌గా వ్యవహరిస్తూ భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. ఏసీబీ కేసులో అరెస్ట్ ► సంగం డెయిరీలో జరిగిన అవకతవకలపై క్రైం నెంబర్– 02/ ఖఇౖ– ఎNఖీ– అఇఆ/2021తో 408, 409, 418, 420, 465, 471, 120–బి రెడ్‌విత్ 34 ఐపీసీ, సెక్షన్ 13 (1) ( ఛి)( ఛీ) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఏసీబీ కేసు నమోదు చేసింది. పొన్నూరు నియోజకవర్గ చింతలపూడి గ్రామంలో ఆయన స్వగృహంలో ఉండగా ఏసీబీ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసింది. ► సంగం డెయిరీలో పాలవిక్రయాలపై 14% బోనస్ చెల్లించాలని కోరిన పాడి రైతులపై దాడి చేసినందుకు చేబ్రోలు పోలీస్ స్టేషన్లో 15–11–2023న ఎఫ్ఐఆర్ నెంబర్ 286/2023తో ధూళిపాళ్లపై 143,147,148, 427,324,384,506,109,307 ట/ఠీ149 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. దీనిలో ఆయన 14వ ముద్దాయిగా ఉన్నారు. ► పెదకాకాని శివాలయంలో మాంసాహారం వంటకాలపై టీడీపీ ఆందోళన చేపట్టింది. ఈఓ కార్యాలయం వద్ద ధూళిపాళ్ల నరేంద్ర బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనపై దేవదాయ శాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు.అనుమతి లేకుండా వచ్చి ఆందోళనలకు దిగారని ఈవో ధూళిపాళ్ల నరేంద్రపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ► కర్ఫ్యూ, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సంగం డెయిరీకి చెందిన 20 మందితో కలిసి హోటల్లో మీటింగ్ నిర్వహించినందుకు గుంటూరు ఎస్ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
భూములు మింగే రాబందులు
కందుకూరు అర్బన్: కందుకూరు పట్టణంలో ఎక్కడైనా కాస్త ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ఆక్రమణదారులు రాబందుల్లా వాలిపోతున్నారు. పదేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ కృష్ణబాబు కందుకూరు పట్టణంలో ఆక్రమణలకు గురైన స్థలాలను గుర్తించి బోర్డులు పెట్టి కంచె ఏర్పాటు చేశారు. కలెక్టరు ఆదేశాలను బేఖాతరు చేసి కంచెను పీకేసి ఆ స్థలాల్లో ధనవంతులు ఇప్పుడు పెద్దపెద్ద భవనాలు కట్టారు. డొంకపోరంబోకు భూమి 2.15 సెంట్లు ఆక్రమించి ఓ పెద్దమనిషి కళాశాల నిర్మించారు. అదే వ్యక్తి కోవూరు రోడ్డులోని పుష్పాలంకరణ ఇనాం భూమి 8 ఎకరాలు ఆక్రమించి పట్టాలు పొందారు. రామన్నకుంట చలివేంద్రం మాన్యం భూమి 1.53 ఎకరాలను ఓ అధికారపార్టీ నాయకుడు ఆక్రమించి మట్టితో చదును చేసి వినియోగించుకుంటున్నారు. ఈ భూమిని కూడా మరో కలెక్టర్ కాంతిలాల్ దండే స్వయంగా పరిశీలించి ప్రభుత్వ భూములుగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఏడాదిన్నర క్రితం కందుకూరు సబ్‌కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున గుండంకట్టను సర్వేచేసి 6 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. సర్వే నంబర్ 865లో గ్రామకంఠం భూమి 56 సెంట్లు ఆక్రమించి లారీ స్టాండుకు ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులు కోర్టును ఆశ్రయించగా, దానిని స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా నేటికీ చర్యలు తీసుకోలేదు. ఇటీవల కాలంలో ఓ వ్యక్తి ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఎదురుగా మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మించాలనుకున్న స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నాడు. ఇలా పట్టణంలో సెంటు భూమిని కూడా వదలకుండా ధనవంతులు రాబందుల్లా రూ.100 కోట్లకు పైగా విలువచేసే ప్రభుత్వ భూములను ఆక్రమించారు. వారిపై చర్యలు తీసుకోని రెవెన్యూ అధికారులు, పేదలు చిన్న పాటి గుడిసెను వేసుకుంటే ఉరుకులు పరుగులు తీసి వాటిని కూలదోస్తున్నారు. బలహీనుల ఇళ్లు కూలగొట్టి..పెద్దలకు కట్టబెట్టి.. పట్టణంలోని ఓ వ్యక్తి రూ.14 లక్షలకు ఇంటిని కొనుగోలు చేసి 11 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ఒక వ్యక్తి తనకు దారి ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు ఆ ఇంటిని కూలదోసి, ఎవరైతే దారి అడిగారో వారికే రూ.2.4 లక్షలకు మార్కెట్ ధరకు కట్టబెట్టిన రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని సర్వే నంబర్ 271లో ఉన్న డొంక పోరంబోకు భూమిని (ప్రస్తుత 30 వార్డులోని 60 అడుగుల రోడ్డు) గాలేటి కాంతమ్మకి మూడున్నర సెంట్లు, భవనాసి నాగరాజమ్మకు 2 సెంట్లు మొత్తం కలిపి ఐదున్నర సెంట్ల ప్రభుత్వ భూమిని నివాస స్థలాల కోసం 1985లో ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది. వారిద్దరి వద్ద చిర్రవెంకటేశ్వర్లు ఒక సెంటు, సరస్వతి అనే మహిళ ఒకటిన్నర సెంట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నారు. దాంట్లో మిగిలి ఉన్న మూడున్నర సెంట్ల భూమిని భార్యాభర్తలు కల్లూరి ఈశ్వరమ్మ, తిరుపతయ్య 2006లో రూ.14 లక్షలకు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. అయితే వీరి ఇంటి వెనుక భాగంలో ఉన్న ఒక రిటైర్డు తహసీల్దారు తన ఇంటికి రాకపోకలకు దారి ఇవ్వాలని అడిగారు. దానికి తిరుపతయ్య నిరాకరించాడు. దాంతో ఆ రిటైర్డు తహసీల్దారు ప్రభుత్వ భూమి ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారని 2013లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు రెవెన్యూ అధికారులను ఆ స్థలాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా గుర్తించి నివేదిక అందజేశారు. కోర్టు పీఓటీ యాక్ట్ ప్రకారం ఆక్రమణలను తొలగించి స్థలాలను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఆ మేరకు 2016లో అధికారులు ఆక్రమణలను తొలగించడానికి వెళ్లగా ఇప్పటికిప్పుడు ఇంటిని స్వాధీనం చేసుకుంటే మేం ఎక్కడ ఉండాలని అధికారులను అడిగారు. దీంతో అధికారులు తిరుపతయ్య ఇంటికి సంబంధించిన కొంత భాగం, చిర్ర వెంకటేశ్వర్లు ఇంటిని కూల్చివేసి, ఇంటిని ఖాళీ చేయాలని తిరుపతయ్యను ఆదేశించారు. ఆ తరువాత తిరుపతయ్య మళ్లీ కోర్టును ఆశ్రయించగా ఆర్డీఓ కోర్టుకి ఆ కేసును బదిలీ చేసింది. విచారించిన ఆర్డీఓ ఇంటిని ఖాళీ చేయాలని సెప్టెంబర్ 9వ తేదీన అతనికి నోటీసులు జారీ చేశారు. ఆయన ఖాళీ చేయకపోవడంతో గత నెల 22న రెవెన్యూ అధికారులు తిరుపతయ్య ఇంటికి చేరుకొని ఎవరూ లేకపోవడంతో కెమెరా దగ్గర పెట్టుకొని ఇంట్లోని సామానులను మినీలారీకి ఎక్కించి, ఇంటిని జేసీబీతో కూల్చివేశారు. ఇంత వరకు బాగానే ఉంది. తిరుపతయ్య ఇంటి సగభాగాన్ని 2016లో కూల్చిన అధికారులు అదే స్థలాన్ని మార్కెట్ ధరకు 85 స్కైర్మీటర్ల స్థలాన్ని రిటైర్డు తహసీల్దారుకు రూ.2.4 లక్షలకు అమ్మటం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. 11 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తిరుపతయ్య ఇంటిని కూల్చి ఇతరులకు ఇవ్వడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బాధితుడు ఆ స్థలాన్ని తనకే మార్కెట్ ధరకు ఇవ్వమని ప్రాధేయపడినా అధికారులు నిరాకరించారు. పీఓటీ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ స్థలాలు అమ్మినవారిపై, కొన్నవారిపై చర్యలు తీసుకోవాల్సిందే. స్వాధీనం చేసుకున్న స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలి. కానీ అధికారులు ఈ యాక్ట్‌ను బేఖాతరు చేస్తూ అధికారపార్టీ నాయకులకు, వారి అనుయాయులకు ప్రభుత్వ భూములు ధారదత్తం చేస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారు. పట్టణంలో కోట్లు విలువైన భూములను ధనవంతులు యథేచ్ఛగా ఆక్రమించుకుంటుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కందుకూరు పట్టణంలో ఎక్కడైనా కాస్త ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ఆక్రమణదారులు రాబందుల్లా వాలిపోతున్నారు. పదేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ కృష్ణబాబు కందుకూరు పట్టణంలో ఆక్రమణలకు గురైన స్థలాలను గుర్తించి బోర్డులు పెట్టి కంచె ఏర్పాటు చేశారు. కలెక్టరు ఆదేశాలను బేఖాతరు చేసి కంచెను పీకేసి ఆ స్థలాల్లో ధనవంతులు ఇప్పుడు పెద్దపెద్ద భవనాలు కట్టారు. డొంకపోరంబోకు భూమి 2.15 సెంట్లు ఆక్రమించి ఓ పెద్దమనిషి కళాశాల నిర్మించారు. అదే వ్యక్తి కోవూరు రోడ్డులోని పుష్పాలంకరణ ఇనాం భూమి 8 ఎకరాలు ఆక్రమించి పట్టాలు పొందారు. రామన్నకుంట చలివేంద్రం మాన్యం భూమి 1.53 ఎకరాలను ఓ అధికారపార్టీ నాయకుడు ఆక్రమించి మట్టితో చదును చేసి వినియోగించుకుంటున్నారు. ఈ భూమిని కూడా మరో కలెక్టర్ కాంతిలాల్ దండే స్వయంగా పరిశీలించి ప్రభుత్వ భూములుగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఏడాదిన్నర క్రితం కందుకూరు సబ్‌కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున గుండంకట్టను సర్వేచేసి 6 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. సర్వే నంబర్ 865లో గ్రామకంఠం భూమి 56 సెంట్లు ఆక్రమించి లారీ స్టాండుకు ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులు కోర్టును ఆశ్రయించగా, దానిని స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా నేటికీ చర్యలు తీసుకోలేదు. ఇటీవల కాలంలో ఓ వ్యక్తి ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఎదురుగా మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మించాలనుకున్న స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నాడు. ఇలా పట్టణంలో సెంటు భూమిని కూడా వదలకుండా ధనవంతులు రాబందుల్లా రూ.100 కోట్లకు పైగా విలువచేసే ప్రభుత్వ భూములను ఆక్రమించారు. వారిపై చర్యలు తీసుకోని రెవెన్యూ అధికారులు, పేదలు చిన్న పాటి గుడిసెను వేసుకుంటే ఉరుకులు పరుగులు తీసి వాటిని కూలదోస్తున్నారు. బలహీనుల ఇళ్లు కూలగొట్టి..పెద్దలకు కట్టబెట్టి.. పట్టణంలోని ఓ వ్యక్తి రూ.14 లక్షలకు ఇంటిని కొనుగోలు చేసి 11 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ఒక వ్యక్తి తనకు దారి ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు ఆ ఇంటిని కూలదోసి, ఎవరైతే దారి అడిగారో వారికే రూ.2.4 లక్షలకు మార్కెట్ ధరకు కట్టబెట్టిన రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని సర్వే నంబర్ 271లో ఉన్న డొంక పోరంబోకు భూమిని (ప్రస్తుత 30 వార్డులోని 60 అడుగుల రోడ్డు) గాలేటి కాంతమ్మకి మూడున్నర సెంట్లు, భవనాసి నాగరాజమ్మకు 2 సెంట్లు మొత్తం కలిపి ఐదున్నర సెంట్ల ప్రభుత్వ భూమిని నివాస స్థలాల కోసం 1985లో ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది. వారిద్దరి వద్ద చిర్రవెంకటేశ్వర్లు ఒక సెంటు, సరస్వతి అనే మహిళ ఒకటిన్నర సెంట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నారు. దాంట్లో మిగిలి ఉన్న మూడున్నర సెంట్ల భూమిని భార్యాభర్తలు కల్లూరి ఈశ్వరమ్మ, తిరుపతయ్య 2006లో రూ.14 లక్షలకు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. అయితే వీరి ఇంటి వెనుక భాగంలో ఉన్న ఒక రిటైర్డు తహసీల్దారు తన ఇంటికి రాకపోకలకు దారి ఇవ్వాలని అడిగారు. దానికి తిరుపతయ్య నిరాకరించాడు. దాంతో ఆ రిటైర్డు తహసీల్దారు ప్రభుత్వ భూమి ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారని 2013లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు రెవెన్యూ అధికారులను ఆ స్థలాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా గుర్తించి నివేదిక అందజేశారు. కోర్టు పీఓటీ యాక్ట్ ప్రకారం ఆక్రమణలను తొలగించి స్థలాలను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఆ మేరకు 2016లో అధికారులు ఆక్రమణలను తొలగించడానికి వెళ్లగా ఇప్పటికిప్పుడు ఇంటిని స్వాధీనం చేసుకుంటే మేం ఎక్కడ ఉండాలని అధికారులను అడిగారు. దీంతో అధికారులు తిరుపతయ్య ఇంటికి సంబంధించిన కొంత భాగం, చిర్ర వెంకటేశ్వర్లు ఇంటిని కూల్చివేసి, ఇంటిని ఖాళీ చేయాలని తిరుపతయ్యను ఆదేశించారు. ఆ తరువాత తిరుపతయ్య మళ్లీ కోర్టును ఆశ్రయించగా ఆర్డీఓ కోర్టుకి ఆ కేసును బదిలీ చేసింది. విచారించిన ఆర్డీఓ ఇంటిని ఖాళీ చేయాలని సెప్టెంబర్ 9వ తేదీన అతనికి నోటీసులు జారీ చేశారు. ఆయన ఖాళీ చేయకపోవడంతో గత నెల 22న రెవెన్యూ అధికారులు తిరుపతయ్య ఇంటికి చేరుకొని ఎవరూ లేకపోవడంతో కెమెరా దగ్గర పెట్టుకొని ఇంట్లోని సామానులను మినీలారీకి ఎక్కించి, ఇంటిని జేసీబీతో కూల్చివేశారు. ఇంత వరకు బాగానే ఉంది. తిరుపతయ్య ఇంటి సగభాగాన్ని 2016లో కూల్చిన అధికారులు అదే స్థలాన్ని మార్కెట్ ధరకు 85 స్కైర్మీటర్ల స్థలాన్ని రిటైర్డు తహసీల్దారుకు రూ.2.4 లక్షలకు అమ్మటం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. 11 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తిరుపతయ్య ఇంటిని కూల్చి ఇతరులకు ఇవ్వడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బాధితుడు ఆ స్థలాన్ని తనకే మార్కెట్ ధరకు ఇవ్వమని ప్రాధేయపడినా అధికారులు నిరాకరించారు. పీఓటీ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ స్థలాలు అమ్మినవారిపై, కొన్నవారిపై చర్యలు తీసుకోవాల్సిందే. స్వాధీనం చేసుకున్న స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలి. కానీ అధికారులు ఈ యాక్ట్‌ను బేఖాతరు చేస్తూ అధికారపార్టీ నాయకులకు, వారి అనుయాయులకు ప్రభుత్వ భూములు ధారదత్తం చేస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారు. పట్టణంలో కోట్లు విలువైన భూములను ధనవంతులు యథేచ్ఛగా ఆక్రమించుకుంటుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కందుకూరు పట్టణంలో ఎక్కడైనా కాస్త ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ఆక్రమణదారులు రాబందుల్లా వాలిపోతున్నారు. పదేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ కృష్ణబాబు కందుకూరు పట్టణంలో ఆక్రమణలకు గురైన స్థలాలను గుర్తించి బోర్డులు పెట్టి కంచె ఏర్పాటు చేశారు. కలెక్టరు ఆదేశాలను బేఖాతరు చేసి కంచెను పీకేసి ఆ స్థలాల్లో ధనవంతులు ఇప్పుడు పెద్దపెద్ద భవనాలు కట్టారు. డొంకపోరంబోకు భూమి 2.15 సెంట్లు ఆక్రమించి ఓ పెద్దమనిషి కళాశాల నిర్మించారు. అదే వ్యక్తి కోవూరు రోడ్డులోని పుష్పాలంకరణ ఇనాం భూమి 8 ఎకరాలు ఆక్రమించి పట్టాలు పొందారు. రామన్నకుంట చలివేంద్రం మాన్యం భూమి 1.53 ఎకరాలను ఓ అధికారపార్టీ నాయకుడు ఆక్రమించి మట్టితో చదును చేసి వినియోగించుకుంటున్నారు. ఈ భూమిని కూడా మరో కలెక్టర్ కాంతిలాల్ దండే స్వయంగా పరిశీలించి ప్రభుత్వ భూములుగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఏడాదిన్నర క్రితం కందుకూరు సబ్‌కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున గుండంకట్టను సర్వేచేసి 6 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. సర్వే నంబర్ 865లో గ్రామకంఠం భూమి 56 సెంట్లు ఆక్రమించి లారీ స్టాండుకు ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులు కోర్టును ఆశ్రయించగా, దానిని స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా నేటికీ చర్యలు తీసుకోలేదు. ఇటీవల కాలంలో ఓ వ్యక్తి ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఎదురుగా మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మించాలనుకున్న స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నాడు. ఇలా పట్టణంలో సెంటు భూమిని కూడా వదలకుండా ధనవంతులు రాబందుల్లా రూ.100 కోట్లకు పైగా విలువచేసే ప్రభుత్వ భూములను ఆక్రమించారు. వారిపై చర్యలు తీసుకోని రెవెన్యూ అధికారులు, పేదలు చిన్న పాటి గుడిసెను వేసుకుంటే ఉరుకులు పరుగులు తీసి వాటిని కూలదోస్తున్నారు. బలహీనుల ఇళ్లు కూలగొట్టి..పెద్దలకు కట్టబెట్టి.. పట్టణంలోని ఓ వ్యక్తి రూ.14 లక్షలకు ఇంటిని కొనుగోలు చేసి 11 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ఒక వ్యక్తి తనకు దారి ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు ఆ ఇంటిని కూలదోసి, ఎవరైతే దారి అడిగారో వారికే రూ.2.4 లక్షలకు మార్కెట్ ధరకు కట్టబెట్టిన రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని సర్వే నంబర్ 271లో ఉన్న డొంక పోరంబోకు భూమిని (ప్రస్తుత 30 వార్డులోని 60 అడుగుల రోడ్డు) గాలేటి కాంతమ్మకి మూడున్నర సెంట్లు, భవనాసి నాగరాజమ్మకు 2 సెంట్లు మొత్తం కలిపి ఐదున్నర సెంట్ల ప్రభుత్వ భూమిని నివాస స్థలాల కోసం 1985లో ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది. వారిద్దరి వద్ద చిర్రవెంకటేశ్వర్లు ఒక సెంటు, సరస్వతి అనే మహిళ ఒకటిన్నర సెంట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నారు. దాంట్లో మిగిలి ఉన్న మూడున్నర సెంట్ల భూమిని భార్యాభర్తలు కల్లూరి ఈశ్వరమ్మ, తిరుపతయ్య 2006లో రూ.14 లక్షలకు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. అయితే వీరి ఇంటి వెనుక భాగంలో ఉన్న ఒక రిటైర్డు తహసీల్దారు తన ఇంటికి రాకపోకలకు దారి ఇవ్వాలని అడిగారు. దానికి తిరుపతయ్య నిరాకరించాడు. దాంతో ఆ రిటైర్డు తహసీల్దారు ప్రభుత్వ భూమి ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారని 2013లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు రెవెన్యూ అధికారులను ఆ స్థలాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా గుర్తించి నివేదిక అందజేశారు. కోర్టు పీఓటీ యాక్ట్ ప్రకారం ఆక్రమణలను తొలగించి స్థలాలను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఆ మేరకు 2016లో అధికారులు ఆక్రమణలను తొలగించడానికి వెళ్లగా ఇప్పటికిప్పుడు ఇంటిని స్వాధీనం చేసుకుంటే మేం ఎక్కడ ఉండాలని అధికారులను అడిగారు. దీంతో అధికారులు తిరుపతయ్య ఇంటికి సంబంధించిన కొంత భాగం, చిర్ర వెంకటేశ్వర్లు ఇంటిని కూల్చివేసి, ఇంటిని ఖాళీ చేయాలని తిరుపతయ్యను ఆదేశించారు. ఆ తరువాత తిరుపతయ్య మళ్లీ కోర్టును ఆశ్రయించగా ఆర్డీఓ కోర్టుకి ఆ కేసును బదిలీ చేసింది. విచారించిన ఆర్డీఓ ఇంటిని ఖాళీ చేయాలని సెప్టెంబర్ 9వ తేదీన అతనికి నోటీసులు జారీ చేశారు. ఆయన ఖాళీ చేయకపోవడంతో గత నెల 22న రెవెన్యూ అధికారులు తిరుపతయ్య ఇంటికి చేరుకొని ఎవరూ లేకపోవడంతో కెమెరా దగ్గర పెట్టుకొని ఇంట్లోని సామానులను మినీలారీకి ఎక్కించి, ఇంటిని జేసీబీతో కూల్చివేశారు. ఇంత వరకు బాగానే ఉంది. తిరుపతయ్య ఇంటి సగభాగాన్ని 2016లో కూల్చిన అధికారులు అదే స్థలాన్ని మార్కెట్ ధరకు 85 స్కైర్మీటర్ల స్థలాన్ని రిటైర్డు తహసీల్దారుకు రూ.2.4 లక్షలకు అమ్మటం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. 11 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తిరుపతయ్య ఇంటిని కూల్చి ఇతరులకు ఇవ్వడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బాధితుడు ఆ స్థలాన్ని తనకే మార్కెట్ ధరకు ఇవ్వమని ప్రాధేయపడినా అధికారులు నిరాకరించారు. పీఓటీ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ స్థలాలు అమ్మినవారిపై, కొన్నవారిపై చర్యలు తీసుకోవాల్సిందే. స్వాధీనం చేసుకున్న స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలి. కానీ అధికారులు ఈ యాక్ట్‌ను బేఖాతరు చేస్తూ అధికారపార్టీ నాయకులకు, వారి అనుయాయులకు ప్రభుత్వ భూములు ధారదత్తం చేస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారు. పట్టణంలో కోట్లు విలువైన భూములను ధనవంతులు యథేచ్ఛగా ఆక్రమించుకుంటుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘కృష్ణ’లో అడుగు పెడితే తాటతీస్తాం
-
'మోసం చేసి ల్యాండ్ పూలింగ్'
హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు కొన్న భూముల వివరాలు వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. భూ దందా గురించి మాట్లాడకుండా భూములు కొంటే తప్పేంటని చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నారని వాపోయారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అమాయక రైతులను మోసం చేసి రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ చేశారని ఆరోపించారు. రాజధాని పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. టీడీపీ నేతలు భూములు కొని పేద ప్రజలను మోసం చేశారని, దీన్ని 'సాక్షి' వెలుగులోకి తెస్తే తప్పా అని ప్రశ్నించారు. -
కేసులు పెట్టించి వేధిస్తారా?
హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రాంతంలో అధికార టీడీపీ నేతల భూ అక్రమాలను 'సాక్షి' ఆధారాలతో వెలుగులోకి తెచ్చిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాజధాని విషయంలో ముందే లీకులిచ్చి టీడీపీ నేతలు భూములు కొనేలా చేశారని, అదే విషయాన్ని 'సాక్షి' వెలుగులోకి తెచ్చిందని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వాస్తవాలు వెలుగులోకి తెస్తే ప్రాసిక్యూట్ చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసులతో కేసులు పెట్టించి వేధిస్తారా అని నిలదీశారు. తప్పు చేయకుంటే చంద్రబాబు విచారణకు ఎందుకు సిద్ధపడడం లేదని అడిగారు. ఏపీ రాజధానిలో టీడీపీ నేతల భూ దందాపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. విలేకరులను బెదిరించడం మాని విచారణకు సిద్ధపడాలని హితవు పలికారు. ఏపీ రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు భూములు కొన్నారని, వీటిని ల్యాండ్ పూలింగ్ లోకి రాకుండా చూసుకున్నారని ఆరోపించారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, చంద్రబాబు భూసేకరణకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. -
ఏపీ కేబినెట్ లో 'భూ దందా' ప్రకంపనలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో అధికార టీడీపీ నాయకుల భూదందాపై 'సాక్షి' వెలువరించిన కథనం సంచలనం సృష్టిస్తోంది. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డగోలుగా భూ దోపిడీకి పాల్పడిన వైనాన్ని సవివరంగా సాక్ష్యాలతో 'సాక్షి' ప్రజల ముందుంచింది. తమ బండారం బయటపడడంతో అధికార పార్టీ నాయకులు ఉలిక్కి పడ్డారు. బుధవారం విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. సాక్షి పత్రికలను మంత్రులు కేబినెట్ లోకి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ ఉదయమే మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ సమావేశమై 'భూ దందా' కథనాలపై చర్చించినట్టు తెలిసింది. ఇతర మంత్రులు కూడా దీనిపై చర్చించుకుంటున్నట్టు సమాచారం. 'సాక్షి' కథనంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. తమపై అసత్య కథనాలు ప్రచురించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభాండాలు వేశారని వాపోయారు.