breaking news
ILC
-
లోన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : రైతు రుణమాఫీ తరహాలోనే భిన్న వర్గాలకు రుణ భారం నుంచి ప్రభుత్వాలు ఊరట కల్పిస్తున్న నేపథ్యంలో వ్యక్తులకు సైతం రుణ బాధల నుంచి విముక్తి కల్పించే పధకానికి అధికారులు తుదిరూపు ఇస్తున్నారు. రూ 60,000లోపు రుణాలను తిరిగి చెల్లించేందుకు ఇబ్బందులు పడే వ్యక్తులు రుణ మాఫీకి అర్హులుగా ప్రభుత్వం గుర్తించనుంది. అల్పాదాయ వర్గాలకు చెందిన వ్యక్తుల కోసం ఈ నూతన రుణమాఫీ పధకాన్ని దివాళా చట్టం అమలు తీరును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ఇన్సాల్వెన్సీ లా కమిటీ (ఐఎల్సీ) ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం కొత్తగా కొలువుతీరే ప్రభుత్వానికి ఐఎల్సీ తన ప్రతిపాదనలను సమర్పించనుంది. కాగా ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలకే దివాళా చట్టం వర్తిస్తుండటంతో మలిదశలో ఈ ప్ర్రక్రియను భాగస్వామ్య సంస్ధలు, వ్యక్తులకూ వర్తింపచేయనున్నారు. కార్పొరేట్ దిగ్గజాలకు ఇచ్చిన రుణాలను హెయిర్ కట్ పేరుతో కుదిస్తున్న క్రమంలో ఆర్ధిక సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులకూ ఇన్సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇక వ్యక్తులకు గరిష్టంగా రూ 60,000 వరకూ రుణ మాఫీని వర్తింపచేస్తారు. చెల్లించాల్సిన రుణం రూ 60,000కు మించడంతో పాటు వార్షికాదాయం మెరుగ్గా ఉంటే అలాంటి వ్యక్తుల రుణ మాఫీ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. -
టీసీఎల్ నుంచి ఐఫాల్కన్ స్మార్ట్ టీవీలు
చైనాకు చెందిన టీసీఎల్ మల్టీమీడియా తాజాగా భారత మార్కెట్లోకి ఐఫాల్కన్ బ్రాండ్ కింద స్మార్ట్ టీవీలు ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఆఖరు నాటికి 2 లక్షల టీవీలు విక్రయించాలని నిర్దేశించుకుంది. అమ్మకాల కోసం ప్రధానంగా ఆన్లైన్ వ్యూహాన్నే అనుసరించనున్నట్లు ఫాల్కన్ టెక్నాలజీ గ్లోబల్ సీఈవో టోనీ గో తెలిపారు. ఇందులో భాగంగా ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ప్రత్యేకంగా విక్రయ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం టీవీలను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నామని, అమ్మకాలను బట్టి ఏడాది తర్వాత స్థానికంగా కూడా తయారు చేసే అవకాశాలు ఉన్నాయని టోనీ వివరించారు. ప్రస్తుతం షావోమి, వ్యు, థామ్సన్ తదితర సంస్థలు చౌకగా స్మార్ట్ టీవీలను విక్రయిస్తున్నాయి. -
కార్మిక నేతలతో ప్రధాని చాయ్ పే చర్చ
న్యూఢిల్లీ: 46వ భారత కార్మిక సదస్సు(ఐఎల్సీ) సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర కార్మిక సంఘ నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. కార్మిక చట్టాలు, ప్రభుత్వ ఆర్థిక విధానాలపై వారి అభిప్రాయాలను విన్నారు. భేటీ అనంతరం.. తమ డిమాండ్లకు సంబంధించి ప్రధాని నుంచి తమకెలాంటి హామీ లభించనందున, సెప్టెంబర్ 2న తాము తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె విషయంలో వెనక్కు తగ్గకూడదని నిర్ణయించినట్లు కార్మికసంఘాల నేతలు తెలిపారు. వీరితో చర్చలు జరిపేందుకు మోదీ మంత్రుల బృందా న్ని ఏర్పాటు చేశారు. కార్మిక నేతలతో మోదీ జరిపిన తేనీటి భేటీలో ఆ బృందం సభ్యులైన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్, పీఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ హాజరయ్యారు. ‘మేం చెప్పిందంతా విన్నారు. ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారని మేం వారికి స్పష్టంగా చెప్పాం. ఏ విషయంలోనూ మాకెలాంటి హామీ ఇవ్వలేదు. అందుకే సమ్మె విషయంలో ముందుకే వెళ్లాలని నిర్ణయించాం. ఈ విషయంలో కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ఉన్నాయి’ అని ప్రధానితో భేటీ అనంతరం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి గురుదాస్ దాస్‌గుప్తా స్పష్టం చేశారు. ఈ భేటీలో సీఐటీ యూ, బీఎంఎస్, ఐఎన్టీయూసీ, హెచ్ఎం ఎస్ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఐఎల్సీని సోమవారం మోదీ ప్రారంభిస్తారు. చర్చలు అసంపూర్ణం: ఆ తరువాత కేంద్ర కార్మిక సంఘాల నేతలు, కేంద్ర మంత్రుల బృందం మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కాంట్రాక్ట్ కార్మికులు, కనీస వేతనం అంశాలు మినహా మిగిలిన అంశాలైన కార్మిక సంఘాల గుర్తింపు, బోనస్ చట్ట సవరణ, కార్మికులకు మరిన్ని సామాజిక భద్రత పథకాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని ప్రభుత్వం పేర్కొనగా.. ఏ అంశంపైనా ఏకాభిప్రాయం కుదరలేదని ఏఐటీయూసీ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెపై వెనక్కు తగ్గలేదని తేల్చి చెప్పింది. ప్రధానమంత్రి మోదీతో కార్మిక సంఘాల తేనీటి భేటీ అనంతరం.. ఆదివారం కార్మిక సంఘాల ప్రతినిధులతో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, జితేంద్రసింగ్ పలు వివాదాస్పద అంశాలపై దాదాపు 3 గంటలపాటు చర్చలు జరిపారు. అనంతరం బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులు, కనీస వేతనం అంశాలకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయన్నారు. బోనస్ చట్టం, కార్మికుల సామాజిక భద్రతకు సంబంధించిన అంశాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు. భేటీలో ఆర్థికమంత్రి జైట్లీ సూచనలకు, పలు సమస్యలకు ఆయన చూపిన పరిష్కార మార్గాలకు కార్మిక సంఘాల నేతల నుంచి సానుకూలత వ్యక్తమైందన్నారు.