breaking news
Hush
-
ట్రంప్ దోషే కానీ... శిక్షేమీ విధించట్లేదు
న్యూయార్క్: హష్ మనీ కేసులో అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు శిక్ష నుంచి బేషరతుగా మినహాయింపు ఇస్తున్నట్టు (అన్‌కండిషనల్ డిశ్చార్జ్) న్యూయార్క్ కోర్టు ప్రకటించింది. మన్హాటన్ జడ్జి జువాన్ ఎం.మర్చన్ శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. ట్రంప్ దోషేనని ఆయన పునరుద్ఘాటించారు. అయినా ముందే ప్రకటించిన మేరకు ట్రంప్‌కు శిక్ష గానీ, జరిమానా గానీ విధంచడం లేదని స్పష్టం చేశారు. ‘‘అధ్యక్షునిగా ట్రంప్‌కు సంక్రమించబోయే అపరిమితమైన అధికారాలు, న్యాయపరమైన రక్షణలు శిక్ష నుంచి మినహాయింపు కల్పిస్తాయే తప్ప కోర్టు తీర్పును అడ్డుకోజాలవు. అధ్యక్షునిగా ఆయన పాలన పగ్గాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఒకవైపు. చట్టానికి ఎవరూ అతీతులు కారాదన్న ప్రజల ఆకాంక్షలు మరోవైపు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఇలా తీర్పు ఇవ్వాల్సి వచ్చింది’’ అని వివరించారు. దాంతో, ఇది తనకో దారుణమైన అనుభవమంటూ ట్రంప్ వాపోయారు. తన ఫ్లోరిడా నివాసం నుంచే లాయర్‌తో కలిసి ఆయన వర్చువల్‌గా విచారణలో పాల్గొన్నారు. తాను నిర్దోషినని పదేపదే వాదించారు. ‘‘ఈ కేసు నాపై రాజకీయ వేధింపుల్లో భాగం. ఇదంతా నా ప్రతిష్టను దెబ్బ తీసే ప్రయత్నం. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించా’’ అని చెప్పుకొచ్చారు. ఆయన లాయర్ సైతం అదే వాదన విన్పించారు. కానీ న్యాయమూర్తి వాటిని ఆలకించలేదు. దాంతో అమెరికా చరిత్రలో దోషిగా తేలి మరీ అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న తొలి నేతగా ట్రంప్ నిలిచారు. తీర్పుపై ప్రాసిక్యూటర్లు కూడా అభ్యంతరం తెలపలేదు. అయితే శిక్ష నుంచి తప్పించుకునేందుకు న్యాయవ్యవస్థపైనే ట్రంప్ పదేపదే దారుణ రీతిలో దాడికి దిగారంటూ ఆక్షేపించారు. ఇలాంటి కేసులో సాధారణంగా కనీసం నాలుగేళ్ల జైలు శిక్ష పడుతుంది. హష్ మనీ కేసు కారణంగా అమెరికా చరిత్రలో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షునిగా కూడా ట్రంప్ నిలవడం తెలిసిందే. ఏమిటీ కేసు? శృంగార చిత్రాల తార స్టార్మీ డేనియల్స్‌తో తన లైంగిక సంబంధాలపై నోరు విప్పకుండా 2016 అధ్యక్ష ఎన్నికల వేళ ప్రచార విరాళాల నుంచి ఆమెకు అక్రమంగా 1.3 లక్షలు డాలర్లు చెల్లించారని ట్రంప్‌పై ఆరోపణలొచ్చాయి. దీనికి సంబంధించి ఆయనపై ఏకంగా 34 రకాల అభియోగాలు నమోదయ్యాయి. వాటన్నింట్లోనూ ట్రంప్ దోషేనని ఆరు వారాల విచారణ అనంతరం 12 మంది జడ్జిల ధర్మాసనం గత మేలో తేల్చింది. నవంబర్లోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉండగా ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా గెలిచారు. ఈ నేపథ్యంలో క్రిమినల్ విచారణ నుంచి తనకు రక్షణ ఉంటుందని ఆయన వాదించారు. కానీ అలాంటిదేమీ ఉండబోదని న్యాయమూర్తి ఇటీవలే తేల్చారు. అయితే, ‘‘జనవరి 10న శిక్ష విధిస్తా. కాకపోతే బేషరతుగా వదిలేస్తూ నిర్ణయం తీసుకుంటా’’ అని చెప్పారు. ఆ తీర్పును అడ్డుకునేందుకు ట్రంప్ చివరిదాకా విఫలయత్నం చేశారు. గురువారం రాత్రి హుటాహుటిన సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. తీర్పు ప్రక్రియను ఆలస్యం చేసేలా జడ్జిని ఆదేశించలేమంటూ న్యాయమూర్తులు 5–4 మెజారిటీతో తీర్పు వెలువరించారు. ఆయనపై దాఖలైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదొకటి. అమెరికా అధ్యక్షునిగా జనవరి 20న ట్రంప్ రెండోసారి ప్రమాణస్వీకారం చేయనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా మూడు కేసులు విచారణకు వచ్చే అవకాశం లేదు. -
ట్రంప్‌కు బేడీలు
-
ట్రంప్‌నకు హష్ మనీ కేసులో ఎదురుదెబ్బ
-
ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
న్యూయార్క్: నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్‌తో సంబంధం విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆమెకు తన లాయర్ ద్వారా అనైతిక మార్గంలో నగదు పంపించిన(హష్ మనీ) కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. జడ్జీలు, సాక్షులపై వ్యాఖ్యానాలు చేయొద్దని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టొద్దన్న గ్యాగ్ ఉత్తర్వులను మళ్లీ ఉల్లంఘించినందుకు 1,000 డాలర్ల జరిమానాను న్యాయస్థానం విధించింది. మరోసారి ఉల్లంఘిస్తే జైల్లో పడేస్తామని సోమవారం జడ్జి జువాన్ ఎం.మెర్చాన్ హెచ్చరించారు. ఇప్పటికే తొమ్మిదిసార్లు ఉల్లంఘించినందుకు గత వారమే ట్రంప్‌నకు 9,000 డాలర్ల జరిమానా విధించడం విదితమే. -
‘హుష్’.. అది నిజం కాదు!
నయనతార ముఖ్య తారగా చక్రి తోలేటి దర్శకత్వంలో సంగీత దర్శకుడు యువన్‌శంకర్ రాజా నిర్మించనున్న సినిమా ‘కొలై ఉదిర్ కాలమ్’. త్వరలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే ఈ సినిమా వార్తల్లో నిలిచింది. కమల్‌హాసన్ ‘ఈనాడు’, అజిత్ ‘బిల్లా–2’ సినిమాల తర్వాత చక్రి తోలేటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని ‘రెడ్ ఎపిక్–డబ్ల్యూ’ అడ్వాన్స్ టెక్నాలజీ కెమేరాతో 8కె రిజల్యూషన్‌లో షూట్ చేయనున్నారు. ‘‘8కె రిజల్యూషన్‌లో షూటింగ్ చేయనున్న తొలి భారతీయ చిత్రాల్లో మా ‘కొలై ఉదిర్ కాలమ్’ ఒకటి’’ అన్నారు దర్శకుడు చక్రి తోలేటి. ఈ సినిమా హాలీవుడ్ మూవీకి రీమేక్ అని వార్తలొచ్చాయి. వాటిపై స్పందిస్తూ.. ‘‘అమెరికన్ హారర్ థ్రిల్లర్ ‘హుష్’కు రీమేక్ కాదిది. అందులో ఓ పాత్ర స్ఫూర్తితో సరికొత్త కథ రాసుకున్నాం’’ అన్నారాయన.