breaking news
Husaband murder
-
దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త
సైదాపురం: క్షణికావేశంలో తాలికట్టిన భార్యపై అనుమానంతో కత్తితో దారుణంగా నరికి చంపేశాడు ఓ భర్త. అనంతరం బిడ్డలతో కలిసి పోలీసు స్టేషన్లో లొంగిపోయిన ఘటన సైదాపురం మండలంలో చోటు చేసుకుంది. రాపూరు సీఐ విజయకృష్ణ అందించిన వివరాల మేరకు.. మండలంలోని గంగదేవిపల్లికి చెందిన చింతలపూడి మహేంద్ర(33)కు అదే గ్రామానికి చెందిన లావణ్యకు 11 ఏళ్ల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి వరుణ్(10), జయవర్ధన్(8) ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల కిందట నెల్లూరుకు కాపురం మార్చారు. అయితే వీరి మధ్య ఏడాది నుంచి వివాదం జరుగుతుండేది. ఈ క్రమంలో ఇటీవలే స్వగ్రామానికి వెళ్లారు. మహేంద్రకు తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోమవారం భార్యభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. దుస్తులు సర్దుకుని తన అమ్మవారి పుట్టినిల్లు అయిన చిట్వేల్కు చేరుకునేందుకు లావణ్య సిద్ధమైంది. ఇరుగు పొరుగు వారు సర్దిచెప్పారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మళ్లీ ఇంటి నుంచి వెళ్లేందుకు లావణ్య ప్రయత్నించడంతో మహేంద్ర క్షణికావేశంలో అక్కడే ఉన్న కత్తి తీసుకుని తలపై కొట్టి గొంతు కోశాడు. దీంతో లావణ్య చనిపోవడంతో ఇద్దరు బిడ్డలను తీసుకుని మహేంద్ర సైదాపురం పోలీసు స్టేషన్కు వెళ్లి తన భార్యను చంపేసినట్లు లొంగిపోయాడు. ఎస్ఐ క్రాంతికుమార్, సీఐ విజయకృష్ణ ఘటనా స్థలికి చేరుకుని హత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు. కేసును నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారి రోదన చూసి స్థానికులు చలించిపోయారు. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది
న్యూఢిల్లీ: ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్యచేసిన కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో భర్త బాబులాల్ను చంపడానికి భార్య సుమిత్ర అక్రమసంబంధమే కారణమని పోలీసుల విచారణలో బయటపడింది. దాంతో బుధవారం భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన పోలీసు సిబ్బంది ఆ దిశగా దర్యాప్తును ప్రారంభించింది. హత్యకేసులో నిందితుడైన ప్రియుడు అర్జున్ ఇక్కా(26)ను ఒడిషాలోని సుందర్ఘడ్లో పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. భార్య సుమిత్రను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. జూన్ 20న ఓ వ్యక్తి హత్యకు గురైనట్టు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. కానీ అప్పటికే రక్తపుమడుగులో పడివున్న భర్త బాబులాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆ నిందితులిద్దరూ గుట్టువిప్పారు. ఉద్యోగం కోసం ఢిల్లీ వచ్చిన సుమిత్రకు బాబులాల్కు 2009లో వివాహం జరిగింది. అయితే సుమ్రిత పెళ్లికి ముందే అర్జున్తో స్నేహంగా ఉండేది. సుమిత్ర పెళ్లైన అనంతరం అర్జున్ కూడా ఉద్యోగం కోసం ఢిల్లీ వచ్చి సెక్యూరిటీ గార్డుగా చేరాడు. అతను కూడా బాబులాల్, సుమిత్రలతో కలిసి ఉండేవాడు. వీరిద్దరిపై అనుమానం వచ్చిన బాబులాల్ ఒకరోజు గట్టిగా మందలించాడు. అర్జున్ను ఇంటినుంచి బయటకు పంపేశాడు. దాంతో తమకు అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి చంపాలనుకుంది. అందులోభాగంగానే వీరద్దరూ పథకం ప్రకారం అతన్ని హతమార్చారు. ఒకరోజు ప్రియుడికి ఫోన్ చేసి జూన్ 19న ఇంటికి రమ్మని పిలిచింది. భర్త బాబులాల్ నిద్రిస్తున్న సమయంలో వాడియైన ఆయుధంతో గొంతుకోశారు. మృతదేహాం వద్ద హత్యకు వాడిన ఆయుధం, మొబైల్ ఫోన్, రక్తపు మరకలతో బట్టలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.