breaking news
HudHud cylone
-
సీఎంను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అగ్ర నిర్మాతలు భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నల్లమలుపు బుజ్జి, జెమిని కిరణ్ తదితరులు ముఖ్యమంత్రిని కలిశారు. సమావేశానంతరం దగ్గుబాటి సురేష్ మాట్లాడుతూ.. ఆరేళ్ల క్రితం విశాఖపట్నంలో హుద్‌హుద్ తుపాను సృష్టించిన విలయానికి నిరాశ్రయులైన వారిని ఆదుకోవడంలో భాగంగా సినీ పరిశ్రమ నిధులు సేకరించి వాటితో విశాఖలో బాధితులకు ఇళ్లు కట్టించినట్లు తెలిపారు. దాదాపు రూ.15 కోట్ల నిధులు వచ్చాయని, ఈ మొత్తంతో గృహ సముదాయాన్ని నిర్మించామన్నారు. ఆ ఇళ్లను ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరామని, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. -
'హుద్ హుద్' కాలనీలో ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు
కుందూవానిపేట : శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం కూందూవానిపేటలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. హుద్ హుద్ తుఫాను కాలనీ నిర్మాణాన్ని చేపట్టవద్దంటూ మత్స్యకారులు అడ్డుకున్నారు. తుఫాను వల్ల నష్టపోయిన వారికి అధికార ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వనిదే నిర్మాణాన్ని చేపట్టొద్దని అధికారులను డిమాండ్ చేశారు. కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో భారీగా పోలీసులను మొహరించారు. టీడీపీ సర్కార్ తమకు నష్టపరిహారం చెల్లించడంలేదంటూ బాధిత మత్స్యకారులు ఆరోపించారు. 2014లో హుద్ హుద్ తుఫాన్ సంభవించి ఉత్తరాంధ్రలో భారీగా నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.