breaking news
hiring India
-
వివాహితులకు ‘నోజాబ్’ అంటూ ఫాక్స్‌కాన్‌పై ప్రచారం.. ఎందుకంటే?
చెన్నై: వివాహితులకు ‘నోజాబ్’ అంటూ జరుగుతున్న ప్రచారంపై ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ ఖండించింది. తాము నియమించుకున్న ఉద్యోగుల్లో 25 తం మంది వివాహుతలైన మహిళలే ఉన్నారని స్పష్టం చేసింది.తమిళనాడులోని చెన్నై కేంద్రంగా ఫాక్స్‌కాన్ సంస్థ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్లను తయారు చేస్తుంది. అయితే ఇటీవల ఐఫోన్ తయారీ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో మరికొంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. కానీ దీనిపై ప్రచారం మరోలా జరిగినట్లు తెలుస్తోంది. ఫాక్స్‌కాన్ యాజమాన్యం వివాహితులైన మహిళల్ని నియమించుకోవడం లేదనే పుకార్లు షికార్లు చేశాయి. ఈ ప్రచారంతో అప్రమత్తమైన కేంద్రం ఫాక్స్‌కాన్‌లో జరిగిన నియామకాలపై వెంటనే తమకు సమగ్ర సమాచారాన్ని అందించాలని తమిళనాడు కార్మిక శాఖకు ఆదేశాలు జారీచేసింది. ఉద్యోగుల నియామకంపై ఫాక్స్‌కాన్ వివరణ ఇచ్చినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాలు ఆధారంగా తమ ఐఫోన్ తయారీ ఫ్లాంట్‌లో కొత్తగా ఉద్యోగుల నియామకం జరిగిందని, వారిలో 25 శాతం మంది వివాహిత మహిళలేనని ఫాక్స్‌కాన్ ప్రతినిధులు చెప్పారు. ఉద్యోగం రాలేదని అసత్య ప్రచారం చేశారని, ఇలాంటి నిరాధారమైన ప్రచారంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ తయారీ రంగాన్ని దెబ్బతీస్తున్నాయని వారు తెలిపారు.ఇదిలా ఉంటే, ఫాక్స్ కాన్ ఫ్లాంట్‌లో పని చేయడానికి వివాహిత మహిళలను అనుమతించకపోవడంపై పలు మీడియా సంస్థలు (అందులో పీటీఐ) ఆరా తీయగా ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం 70 శాతం మంది మహిళలు, 30 శాతం మంది పురుషులు ఉన్నారు. తమిళనాడు ప్లాంట్ దేశంలో మహిళలు అత్యధికంగా ఉపాధి పొందుతున్న మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌గా పేరు సంపాదించింది. ఇందులో ప్రస్తుతం ఉపాధి పొందుతున్న సిబ్బంది సంఖ్య 45,000 దాటినట్లు ఫాక్స్‌కాన్ ప్రతినిధులు వెల్లడించారు. పలు జాతీయ మీడియా కథనాలు సైతం.. ఫాక్స్ కాన్‌లో ఉద్యోగం రాలేదన్న కారణంతో 5 నుంచి 10 మంది ఈ అసత్య ప్రచారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. -
ఐటీ కంపెనీలో 10వేల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త చెప్పింది. దేశీయంగా 10వేల మంది ఉద్యోగాల అవకాశాలను కల్పించనున్నామని అమెరికాకు చెందిన బహుళజాతి ఐటి సేవల సంస్థ డీఎక్స్ సీ టెక్నాలజీస్ తాజాగా ప్రకటించింది. ప్రధానంగా డిజిటల్ నైపుణ్యం ఉన్న వారికి ఎంపిక చేస్తామని తెలిపింది. వీరిలో 1500మందిని క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా సెలక్ట్ చేసుకుంటామంది. డిజిటల్ సేవలకై పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడానికి, మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు భారతదేశంలో డిజిటల్ నైపుణ్యాలు కలిగిన 10వేల మంది టెక్కీలను నియమించుకోవాలని యోచిస్తున్నామని డీఎక్స్‌సీ టెక్నాలజీస్ గ్లోబల్ హెడ్ శాంసన్ డేవిడ్ తెలిపారు. కాగా డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌తో, యుఎన్ఎస్లో ప్రతిభావంతుల కొరతను ఎంఎన్‌సి ఐటి కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. దీంతో దిగ్గజ ఐటీ కంపెనీలు ఆఫ్‌షోర్ స్థావరాన్ని భారతదేశానికి తరలిస్తున్నాయి. సీఎస్సీ, హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్ విలీనం తరువాత 2017 లో స్థాపించబడిన డీఎక్స్‌సీ ఐటి సంస్థలో భారతదేశంలో దాదాపు 45 వేల మంది పనిచేస్తుండగా, గ్లోబల్‌గా 1.30లక్షల మంది ఉన్నారు. -
ఇండియన్ టెకీలకు భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: ఒకవైపు దేశీయ ఐటీ కంపెనీలు దేశీయ టెకీలకు షాకిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటోంటే.. దిగ్గజ కంపెనీలకు భారతీయ టెకీలకు తీపికబురు అందించాయి. తాజా నివేదికల ప్రకారం మైక్రోసాఫ్ట్, లింక్డ్ఇన్, ఒరాకిల్, ఫేస్బుక్, గూగుల్ ఇండియా లాంటి టెక్మేజర్లు భారతీయ సాఫ్ట్ వేర్లను నియమించుకోనున్నాయి. తద్వారా భారతీయ సమాచార సాంకేతిక (ఐటి) సర్వీసు ప్రొవైడర్లతో టాలెంట్ వార్‌కు దిగాయని ఓ రిపోర్ట్ వెల్లడించింది. అమెరికా ఆధారిత సంస్థలు తమ సొంత మార్కెట్లో అభద్రత పెరుగుతున్నప్పటికీ, ప్రపంచ ప్రత్యర్థుతో పోటీ కారణంగా ఇండియన్ ఐటీ నిపుణులను ఎంచుకుంటున్నాయట. ఇందులో భాగంగానే ఫేస్బుక్ , లింక్డ్ ఇన్, తదితర కంపెనీలు కొన్ని గత నాలుగు నెలలలో భారత్ లో తమ ఉద్యోగుల సంఖ్య రెట్టింపు చేసినట్టు సమాచారం. భారతదేశంలో ప్రపంచ అంతర్గత కేంద్రాలు (జిఐసిలు) భారత టెకీల ఉద్యోగాల కల్పనలో పెద్ద పాత్ర పోషిస్తాయని బైన్ & కంపెనీ ఇటీవల ప్రచురించిన ఒక నివేదికలో తెలిపింది. భారతీయ జిఐసిలు తదుపరి మూడు నుండి ఐదు సంవత్సరాల్లో ప్రపంచ సి-స్థాయి అధికారుల ఫార్చ్యూన్ 1,000 కంపెనీల్లో చోటు సంపాదించుకుంటాయని అగ్రశ్రేణి పెట్టుబడి ప్రాధాన్యతల మరింత చురుకైన పాత్రను పోషిస్తాయని నివేదించింది. అలాగే ఈ సంస్థల్లో ఎక్కువ సీనియర్ నాయకులు, ప్రత్యేకంగా సీఈవో లకు దిగువస్థాయి ఉద్యోగులు బారత్వెలుపలి ఈ జీఐసీలను నిర్వహించనున్నారని ఈ నివేదిక తెలిపింది. డిజిటల్ టెక్నాలజీలో భారతదేశం ప్రయోగాత్మక ప్రదేశంగా ఉందని మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ,పరిశోధనా సంస్థ జినోవ , మేనేజ్మెంట్ మేనేజర్,ఆనంద్ సుబ్రమణ్యం చెప్పారు. ఈ సంస్థల భారతీయ డెలివరీ కేంద్రాలు ప్రపంచ వనరులతో సమానంగా ఉన్నాయని, వారు పోటీని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ సంస్థలకు చెందిన భారత్ కేంద్రాలు తమ పేరెంట్ సంస్థ ల కొత్త సామర్థ్యాలను ఏర్పరుచుకునేందుకు, సముచితమైన సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో సమర్థతను పెంచుకునేందుకు కృషి చేస్తున్నాయని కోరుతున్నాయని సుబ్రహ్మణ్యం చెప్పారు. ఇ-కామర్స్, డిజిటల్ టెక్నాలజీ, రిటైల్, సప్లయ్ ఛైన్ సాంకేతిక పరిజ్ఞానాలు, కోర్ ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లలో నెట్ వర్కింగ్, వర్చ్యువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంటైనర్సిజేషన్, విశ్లేషణలు, బిగ్ డేటా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో నియామకాలను చేపట్టినట్టు లాయిస్ మేనేజింగ్ డైరెక్టర్ జేమ్స్ బ్రాండ్ట్ తెలిపారు. భారత్ లో వెయ్యిమంది ఉద్యోగులతో ఉన్న సంస్థ తమ ఐటీ మరియు విశ్లేషణ సామర్థ్యాలను , వృద్ధి వ్యూహాన్ని పెంచుకోనున్నట్టు తెలిపింది. టార్గెట్ , లోవ్స్ వంటి ఇతర అమెరికా ఆధారిత సంస్థలు మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా విశ్లేషణ, నెట్వర్కింగ్ వంటి రంగాల్లో భారతదేశంలో ఇంజనీర్లను నియమించుకుంటాయి. భారతదేశంలో 2,500 మంది ఉద్యోగులను కలిగి ఉన్న టార్గెట్ ఇండియా టెక్నాలజీ, మార్కెటింగ్, సరఫరా చెయిన్, యానిమేషన్ వంటి నిపుణులను నియమించుకోనుంది. జావా మరియు ఓపెన్ సోర్స్ సామర్థ్యాలతో, మెషిన్ లెర్నింగ్, న్యూరో-లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో నైపుణ్యం కలిగినవారిని తాము ఎంపిక చేయనున్నట్టు టార్గెట్ ఇండియాలో హెచ్ఆర్ హెడ్ షాలిని నటరాజ్ తెలిపారు టెక్నాలజీకి అదనంగా, కంప్యూటర్లో రూపొందించబడిన యిమేజరీ అండ్ యానిమేషన్లో భారతదేశం ప్రతిభను కలిగి ఉందనీ, తమ మార్కెటింగ్ బృందం సీజీఐ సామర్ధ్యాలను విస్తరించ నుందన్నారు. కాగా అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1 బీ వీసాల కొత్తనిబంధనల నేపథ్యంలో దేశీయ ఐటి దిగ్గజాలు అమెరికా టెకీల నియామకాలపై దృష్టి సారించాయి. దేశీయ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు షాకిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.